వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు : భారత్‌తో చర్చలకు సిద్ధమన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచినట్టుగా సమాచారం. ప్రపంచదేశాలు చెబుతున్నప్పటికీ మాత్రం పాక్ బుద్ధి మాత్రం మారలేదని చెప్పేందుకు నిదర్శనం బుధవారం ఘటన. మంగళవారం పాకిస్తాన్‌ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి దాడిచేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ బుధవారం ఉదయం సరిహద్దు రేఖ ఉల్లంఘించి భారత గగనతలంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారులు వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌‌లోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు సమాచారం.

పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార చర్యగా భారత వాయుసేన జరిపిన మెరుపుదాడి తర్వాత పరిణామాలు మారుతున్నాయి. మంగళవారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయి బాలాకోట్‌లోని జైషే మహ్మద్ అతిపెద్ద శిక్షణా శిబిరంపై దాడి చేసి తిరిగి భారత్‌కు చేరుకుంది. దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బుధవారం పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు. అయితే ఖాన్ ఎలాంటి ప్రకటన చేస్తారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు నిగ్రహంతో వ్యవహరించాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే ఇరు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోరాదని పాక్ విదేశాంగా మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ, భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లను కోరారు. ఇదిలా ఉంటే పుల్వామాలో ఉగ్రదాడులు చేసినందువల్లే తాము జైషే మహ్మద్ శిబిరంపై దాడులు చేసినట్లు సుష్మా స్వరాజ్ చైనాలో వెల్లడించారు.

Live Updates:situation turns tense between India and Pak after operation Balakot

Newest First Oldest First
6:02 PM, 27 Feb

పాక్ చర్యలను ఖండించిన విపక్ష పార్టీలు,మోడీ ప్రభుత్వంపై విమర్శలు
5:11 PM, 27 Feb

పాక్ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ
5:01 PM, 27 Feb

భారత యుద్ధ విమానాలు సరిహద్దు దాటి పాక్ గగనతలంలోకి వచ్చాయి..ఒక భారత పైలట్‌ను అదుపులోకి తీసుకున్నాం: ఇమ్రాన్ ఖాన్
4:37 PM, 27 Feb

ఉగ్రవాదులపై భారత్ తీసుకుంటున్న చర్యలను సమర్థించిన చైనా
ఉగ్రవాదులపై భారత్ తీసుకుంటున్న చర్యలను సమర్థించిన చైనా
4:36 PM, 27 Feb

భారత్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
3:24 PM, 27 Feb

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌ను గుర్తించిన వెంటనే భారత వాయుసేన తిప్పి కొట్టింది
3:21 PM, 27 Feb

దురదృష్టవశాత్తు భారత్ కూడా ఓ మిగ్ 21 కోల్పోయింది.. ఓ పైలట్ కూడా మిస్ అయ్యారు: రవీష్ కుమార్
3:20 PM, 27 Feb

ఓ పాకిస్తాన్ యుద్ధ విమానంను భారత మిగ్ యుద్ధ విమానం కూల్చేసింది: రవీష్ కుమార్
3:20 PM, 27 Feb

జైషే మహ్మద్ మరిన్ని ఆత్మాహుతి దాడులు చేసే అవకాశం ఉంది: రవీష్ కుమార్
3:19 PM, 27 Feb

మీడియా సమావేశంలో విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్
2:59 PM, 27 Feb

కాసేపట్లో తిరిగి తెరుచుకోనున్న విమానాశ్రయాలు. ఆదేశాలు జారీ చేసిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
2:58 PM, 27 Feb

ఇవాళ ఉదయం మిగ్ 21 జెట్ విమానం తీసుకెళ్లిన ఐఏఎఫ్ ఫైలట్ వింగ్ కమాండర్ అభినందన్. ఇంకా తిరిగిరాకపోవడంతో ఉత్కంఠ. కాసేపట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోయల్ ప్రెస్ మీట్. అభినందన్ మిస్సింగ్ పై వెల్లడించే అవకాశం
2:57 PM, 27 Feb

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ మిస్సింగ్
2:47 PM, 27 Feb

కాసేపట్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రెస్ మీట్
2:41 PM, 27 Feb

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రతిపక్షాల భేటీ. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్, శరద్ యాదవ్, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ
2:36 PM, 27 Feb

గల్ప్ దేశాలు, యూరప్, అమెరికా మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్ గగనతలం ఉపయోగిస్తోన్న భారత్
2:34 PM, 27 Feb

గగనతలంలో పాకిస్థాన్ మీదుగా ప్రయాణించొద్దని భారత వాయుసేన నిర్ణయం. ఈ డిసిషన్ తక్షణం అమల్లోకి వస్తోందని ప్రకటన
2:30 PM, 27 Feb

గతంలో పరిస్థితులు లేవు .. ఇప్పటి సిచుయేషన్ వేరు, పాకిస్థాన్ కు జైట్లీ పరోక్ష హెచ్చరికలు
2:28 PM, 27 Feb

పాకిస్థాన్ లో అమెరికా సేనలు దాడి చేయొచ్చు .. కానీ మేం చేయకూడదా ?
2:26 PM, 27 Feb

గతంలో అమెరికా దాడిచేసినట్టే మేం పాక్ భూభాగంలో దాడి చేశాం. అరుణ్ జైట్లీ
1:17 PM, 27 Feb

ప్రధాని మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం. హాజరైన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. తాజా పరిస్థితులపై సమీక్ష
1:01 PM, 27 Feb

బయటపడ్డ పాక్ కుటిల బుద్ధి..ఎప్పుడో ఒడిషాలో కూలిన విమానం ఫోటోను వైరల్ చేస్తున్న పాక్ మీడియా
12:56 PM, 27 Feb

పాక్ గగనతలంలో హై అలర్ట్. మిలటరీకి చెందిన యుద్ధ విమానాలు ఎగురేందుకు మార్గం సుగుమం కోసం ముల్తాన్, లాహోర్,ఫైసలాబాద్,సియాల్‌కోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటన
12:55 PM, 27 Feb

కాసేపట్లో పాక్ మేజర్ జనరల్ గఫూర్ మీడియా సమావేశం. భారత్‌కు చెందిన రెండు యుద్ద విమానాలను కూల్చామని పాక్ ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం
12:53 PM, 27 Feb

భారత సరిహద్దుల్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సమీక్ష. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించాలని ఆదేశం
12:52 PM, 27 Feb

ఉగ్రవాదంను అణిచివేయాలని తీర్మానించిన త్రిసభ్య దేశాలు. ఉగ్రవాదంకు ఏ దేశం మద్దతు ఇవ్వరాదని నిర్ణయం. ఉగ్రవాదులను కచ్చితంగా ఏరిపారేయాలని తీర్మానించిన మూడుదేశాల విదేశాంగా మంత్రుల సమావేశం
12:46 PM, 27 Feb

భారత్ మాపై యుద్ధం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. మా భూభాగాన్ని, గగనతలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ
12:31 PM, 27 Feb

భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో పడిపోయిన స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లు దిగువకు పడిపోయిన సెన్సెక్స్. 71.75 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ
12:27 PM, 27 Feb

భారత్, పాక్ గగనతలంలో వెళ్లాల్సిన అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర ఇబ్బందులు. కొన్ని విమానాల దారి మళ్లింపు. గమ్యస్థానాలకు తిరిగి వెళుతున్న మరికొన్ని విమానాలు
12:25 PM, 27 Feb

భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం. హాజరైన రా, ఎన్ఎస్ఏ, హోమ్ సెక్రటరీలు
READ MORE

English summary
Surgical Strikes 2.0 LIVE Updates: A day after the Indian Air Force (IAF) jets destroyed the biggest Jaish-e-Mohammed terror camp in Pakistan in a pre-dawn operation, the existing tension between the two neighbours after the Pulwama attack escalated further. All eyes are now on Pakistan PM Imran Khan's address to the joint session of parliament where he is expected to respond to India’s strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X