వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెస్లే సెర్లాక్‌లో పురుగులు, ఫంగస్‌: మదర్ డైరీలో..

|
Google Oneindia TeluguNews

చెన్నై: మ్యాగీలో సీసం శాతం అధికంగా ఉందన్న వార్తలతో కష్టాల్లో కూరుకుపోయిన నెస్లేకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. చిన్న పిల్లలకు తినిపించే సెర్లాక్‌లో పురుగులు, ఫంగస్‌ ఉన్నట్లు తమిళనాడులో గుర్తించారు. దీంతో సెర్లాక్‌ నమూనాలను పరీక్షలకు పంపించారు.

వారం రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో నివాసముంటున్న శ్రీరాం అనే వ్యక్తి తమ పాపాయి కోసం సెర్లాక్‌ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు.

Live worms found in Nestle Cerelac baby food in Coimbatore

అందులో పురుగులు, ఫంగస్‌ ఉండడమే, కాకుండా, అది తయారైంది ‘2016 సంవత్సరం' అని ఆ డబ్బాపై ముద్రించి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది.

మదర్ డైరీ మిల్క్‌లో డిటర్జెంట్

ఇది ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ తయారు చేస్తున్న ఓ పాల ప్యాకేట్‌లో సర్ఫ్ ఉన్నట్లు తేలింది. అగ్రాలో ఎఫ్‌డిఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) రాంనరేష్ యాదవ్.. మదర్ డైరీ నుంచి సేకరించిన రెండు పాల ప్యాకేట్లను పరిశీలించగా.. అందులో ఒకదానిలో సర్ఫ్, బట్టల సబ్బుకు సంబంధించిన పదార్థాలు బయటపడ్డాయి. అయితే ఇది అనుకోకుండా జరిగిందని మదర్ డైరీ అధికారులు చెబుతున్నారు.

English summary
Live worms were found in a packet of Nestle Cerelac baby food bought by an IT professional in Coimbatore for his one-year-old son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X