వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటి కాదు .. రెండు కాదు ... 24 ఏళ్లు : భారతదేశ పౌరసత్వం కోసం ఎదురుచూసిన పాకిస్థాన్ అక్కాచెల్లెళ్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారతదేశం .. భిన్నత్వంలో ఏకత్వం, భిన్న మతాలు, ఆచారాలు, వ్యవహారాల నెలవు. ఇక్కడ ఉండేందుకు ఇతరదేశాల వారు ఇష్టపడతారు. పాకిస్థాన్‌ పౌరసత్వం కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా దేశంపై అభిమానం పెంచుకున్నారు. అయితే చుట్టపు చూపుగా ఉండటం కాదు ... ఈ దేశ పౌరసత్వం కోసం వారు దాదాపు 24 ఏళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు.

సేవ్ డేట్ ..

సేవ్ డేట్ ..

మార్చి 19, 2019ని తమ జీవితంలో మరచిపోలేమంటున్నారు నిదా, మహరుఖ్ నసీం అనే అక్కాచెల్లెళ్లు. పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన వీరు .. 1995లో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. పౌరసత్వం కోసం గత 24 ఏళ్ల నుంచి వేచి చూస్తున్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన ప్రధాని మోదీకి ఆ ఇద్దరు మహిళలు కృతజతలు తెలిపారు. 'మేం ఈ రోజును జీవితంలో మరచిపోలేం అన్నారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లామో .. ఆ అధికారులు కూడా మీరు మీ దేశానికి వెళ్లిపోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ పౌరసత్వం ఇవ్వడం అంత ఈజీ కాదని చెప్పారు‘ అని తెలిపారు.

1989లో పెళ్లి .

1989లో పెళ్లి .

వీరి తల్లిదండ్రులు 1989లో పెళ్లి చేసుకున్నారు. వారి తండ్రి అక్తర్ భారతదేశ పౌరుడు కాగా .. తల్లి పాకిస్థానీ. ఆమెకు 2007లో భారతదేశ పౌరసత్వం వచ్చింది. వారి కూతుళ్లు ఇద్దరికీ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సిటిజెన్ షిప్ వచ్చింది. తమ కూతుళ్ల పౌరసత్వం కోసం నజీమ్ అక్తర్ పలుమార్లు దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వారి మొర అలకించలేదు. కానీ 2014లో వారణాసిలో మినీ పీఎంవో ఏర్పాటు చేశారు. అక్కడ తాము దరఖాస్తు చేయడంతో తమ సమస్య పరిష్కారమైందని తెలిపారు.

ఇబ్బందులను ఎదుర్కొన్నాం ..

ఇబ్బందులను ఎదుర్కొన్నాం ..

ఇప్పటికీ తమ సోదరుడు పాకిస్థాన్ లో ఉన్నాడని మహరుఖ్ తెలిపారు. దీంతో తాము జాతీయత విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. వారణాసి నుంచి మోదీ గెలిచాక తమ సమస్య ఆలకించారని ... మరోసారి రమ్మని కూడా పిలువలేదని చెప్పారు. తాము ఇక్కడే చదువుకున్న జాతీయతను మాత్రం పాకిస్థాన్ అని రాయాల్సి వచ్చేదని గుర్తుచేశారు నిదా. ఇక్కడ ఉంటూ .. పాకిస్థాన్ అని జాతీయత గురించి రాయడం ఇబ్బంది కలిగేదన్నారు.

English summary
After 24 years of struggle, Nida and Mahrukh Naseem, born in Pakistan's Karachi and living in India since 1995, were finally granted Indian citizenship on March 23, 2019. The two women - Nida and Mahrukh Naseem - on Tuesday thanked Prime Minister Narendra Modi for granting them Indian citizenship and said they will never forget the date. "I want to thank PM Modi. When we went to the PMO, the people heard us and asked us to go back home and that it was now their responsibility to get them Indian citizenship," Nida Naseem said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X