వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాం విలాస్ పాశ్వాన్ సోదరుడి మృతి.. గుండెపోటుతో లోహియా ఆస్పత్రిలో కన్నుమూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ సోదరుడు రాం చంద్ర పాశ్వాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఇవాళ ఉదయం గుండె పోటు రావడంతో కన్ను మూశారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. చంద్ర పాశ్వాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

గుండెపోటు..
రాం విలాస్ పాశ్వాన్ చిన్న తమ్ముడే రాం చంద్ర పాశ్వాన్. ఈయన బీహర్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ఇతనికి భార్య సునైన కుమారి, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చంద్ర పాశ్వాన్. దీంతో వారం క్రితం ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు.

LJP MP Ram Chandra Paswan dies at 56

అయితే ఇవాళ ఉదయం 10.30 గంటలకు గుండెపోటు వచ్చి మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో చంద్ర పాశ్వాన్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు చంద్ర పాశ్వాన్ పార్థీవదేహం ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. సోదరుడి మృతితో రాం విలాస్ పాశ్వాన్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనను నేతలు ఓదార్చారు.

English summary
Lok Sabha member Ram Chandra Paswan, younger brother of Union minister Ram Vilas Paswan, died at the Ram Manohar Lohia Hospital in New Delhi on Sunday due to cardiac arrest, the family said. He was 56. The Lok Janshakti Party (LJP) leader passed away around 10.30 a.m. He was admitted to the hospital a week ago. Union Home Minister Amit Shah was present at Ram Chandra Paswan's funeral, newsagency ANI reported. A four-time MP, Ram Chandra Paswan represented Bihar's Samstipur in the Lok Sabha. He is survived by his wife Sunaina Kumari, two sons and a daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X