అద్వానీకి తీవ్ర అస్వస్థత - ఏయిమ్స్ లో చేరిక..!!
మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆయన అడ్మిట్ అయ్యారు. వృద్ధాప్య సమస్యల విభాగానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో అద్వానీ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఏయిమ్స్ వైద్యులతో అద్వానీ ఆరోగ్యం పై ఆరా తీసారు.
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. కాగా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎల్‌కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్‌కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నను ప్రదానం చేశారు. మోదీ మూడో సారి ప్రధానిగా ఎంపిక అయిన తరువాత అద్వానీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసారు.












Click it and Unblock the Notifications