llegal affair: భార్యను చంపేసిన కాంట్రాక్టర్, జెంటిల్ మెన్ టైపులో లొంగిపోయి స్టోరీ చెప్పాడు, ఫేస్ బుక్ లో !
బెంగళూరు/ఎలక్ట్రానిక్ సిటి: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. భర్త బిల్డింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ డబ్బులు బాగానే సంపాదించాడు. కాంట్రాక్టర్ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళితే రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు అంతా కాంట్రాక్టర్ భార్య ఒక్కటే ఇంట్లో ఉంటున్నది. గత ఏడాది భర్తకు కొందరు వ్యక్తులు నువ్వు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటికి మగాళ్లు వచ్చి వెలుతున్నారని చెప్పారని తెలిసింది. చుట్టుపక్కల వాళ్లు కొందరు భార్య గురించి చెప్పినప్పటి నుంచి భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. నా భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని కాంట్రాక్టర్ కు విపరీతమైన అనుమానం పెరిగిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు నటిస్తున్న భర్త సమీపంలో రహస్యంగా దాక్కొన్ని అతని భార్య మీద నిఘా వేశాడు. రానురాను భార్య శీలం మీద అనుమానం పెంచుకున్న భర్త ఆమెను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. ఇదే సమయంలో తనను ఎవరో హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, నాకు ఏదైనా జరగరానిది జరితే అందుకు తన భార్య, ఆమె ప్రియుడు కారణం అంటూ ఇటీవల కాంట్రాక్టర్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఇదే విషయంలో పోలీసులు సైతం కాంట్రాక్టర్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి ఇంటికి వెళ్లిన కాంట్రాక్టర్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కత్తి తీసుకుని భార్య గొంతు కోసేసి దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన తరువాత ఆమెను చంపడానికి ఉపయోగించిన కత్తి చేతిలో పట్టుకున్న కాంట్రాక్టర్ జెంటిల్ మెన్ టైపులో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
Illegal affair: అందంగా రెడీ అవుతున్న భార్య, క్యాబ్ లో బయటకు తిరుగుతున్న భర్త, మూడు రోజులకు !

భర్త కాంట్రాక్టర్
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని అనేకల్ లోని తిమ్మరాయదిన్నెలో మల్లేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న మల్లేష్ కొన్ని సంవత్సరాల క్రితం సరస్వతి (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మల్లేష్, సరస్వతి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా సంతోషంగా కాపురం చేశారు.

నీ భార్య కోసం ఎవరో వచ్చి వెలుతున్నారు
మల్లేష్ బిల్డింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ డబ్బులు బాగానే సంపాదించాడు. కాంట్రాక్టర్ మల్లేష్ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళితే రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు అంతా కాంట్రాక్టర్ మల్లేష్ భార్య సరస్వతి ఒక్కటే ఇంట్లో ఉంటున్నది. గత ఏడాది మల్లేష్ కు స్థానికులు కొందరు వ్యక్తులు నువ్వు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటికి మగాళ్లు వచ్చి వెలుతున్నారని చెప్పారని తెలిసింది.

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?
చుట్టుపక్కల వాళ్లు కొందరు భార్య సరస్వతి గురించి చెప్పినప్పటి నుంచి మల్లేష్ కు అతని భార్య మీద అనుమానం పెరిగిపోయింది. నా భార్య సరస్వతి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని కాంట్రాక్టర్ మల్లేష్ కు విపరీతమైన అనుమానం పెరిగిపోయింది.

భార్య మీద రహస్యంగా నిఘా వేసిన భర్త
ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు నటిస్తున్న మల్లేష్ ఇంటి సమీపంలో రహస్యంగా దాక్కొన్ని అతని భార్య సరస్వతి మీద నిఘా వేశాడు. రానురాను భార్య సరస్వతి శీలం మీద అనుమానం పెంచుకున్న మల్లేష్ ఆమెను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. భార్య సరస్వతి అందంగా తయారైనా, బయటకు వెళ్లినా మల్లేష్ విపరీతమైన కోపం వచ్చేది.

ఫేస్ బుక్ లో హంగామా
ఇదే సమయంలో తనను ఎవరో హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, నాకు ఏదైనా జరగరానిది జరితే అందుకు తన భార్య సరస్వతి , ఆమె రహస్య ప్రియుడు కారణం అంటూ ఇటీవల కాంట్రాక్టర్ మల్లేష్ అతని ఫేస్ బుక్, ఫ్రెండ్స్ ఫేస్ బుక్ అకౌంట్ కు మెసేజ్ షేర్ చేశాడు. ఇదే విషయంలో పోలీసులు సైతం కాంట్రాక్టర్ మల్లేష్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు.

భార్యను చంపేసి వెళ్లి లొంగిపోయిన జెంటిల్ మెన్
మద్యం సేవించి ఇంటికి వెళ్లిన కాంట్రాక్టర్ మల్లేష్ అతని భార్య సరస్వతితో గొడవ పెట్టుకున్నాడు. కత్తి తీసుకుని భార్య సరస్వతి గొంతు కోసేసి దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతిని హత్య చేసిన తరువాత ఆమెను చంపడానికి ఉపయోగించిన కత్తి చేతిలో పట్టుకున్న కాంట్రాక్టర్ మల్లేష్ జెంటిల్ మెన్ టైపులో నేరుగా వెళ్లి ఆనేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని, అందుకే ఆమెను చంపేశానని మల్లేష్ అంగీకరించాడని ఆనేకల్ పోలీసులు తెలిపారు.