వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాందేవ్ బాబా సంచలనం: 'వారిని తలనరికి చంపేసేవాడిని'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'భారత్‌ మాతాకీ జై' అనకుంటే తాను వందలాంది మందిని తలనరికి చంపేసేవాడినని అని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. హర్యానాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగంలో భారత్‌ మాతాకీ జై అనాలని ఎక్కడా లేదు కాబట్టి దాని మీద ఉన్న గౌరవంతో ఆ పని చెయ్యడం లేదని ఆయన అన్నారు. 'భారత్‌ మాతాకీ జై' అనడం తనకిష్టం లేదని కొంత మంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని అందుకు వారు సిగ్గుపడాలని అన్నారు.

 Ramdev

ప్రతి ఒక్కరూ తమ మాతృ దేశాన్ని గౌరవించాలని ఆయన సూచించారు. కాగా బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా దీనిపై ఏ ఒక్కరూ పౌరుల దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు.


'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్‌ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని అస‌రుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలపై పార్ల‌మెంట్‌లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని దారుల్ ఉలూమ్ డియోబంద్‌కు చెందిన ఇస్లామిక్ సెమినరీ 'భారత్ మాతా కీ జై' అన్న నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. మార్చి 19న జారీ చేసిన ఈ ఫత్వా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొందరు ముస్లింలు 'భారత్ మాతా కీ జై' నినాదంపై స్పష్టత కోరుతూ లేఖలు రాశారు.

దారుల్ ఉలూమ్‌కు చెందిన ఇస్లామిక్ సెమినరీ మత పెద్దలు ఈ లేఖలను పరిశీలించారు. హిందూ మతానికి, ఇస్లాం మతానికి వ్యత్యాసం ఉందని వారు పేర్కొన్నారు. హిందూ మతం విగ్రహారాధన చేస్తే, ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకమని వారు చెప్పారు. భారత్ మాత అనే దేవతను హిందువుల్లో ఒక వర్గం పూజిస్తుందని స్కాలర్లు అభిప్రాయపడ్డారు.

ఇస్లాం నియమాల ప్రకారం దేవుడు ఒక్కడేనని, మరో దేవుడిని పూజించకూడదని వారు తెలిపారు. కాబట్టి 'భారత్ మాతా కీ జై' నినాదం చేయాల్సిన అవసరం లేదని ఫత్వా జారీ చేశామని వారు చెప్పారు. దేశపౌరులకు రాజ్యాంగం మతస్వేచ్ఛను ఇచ్చిందని, భారత రాజ్యాంగానికి లోబడి తాము ఫత్వా జారీ చేశామని వారు తెలిపారు.

English summary
Yoga guru Baba Ramdev has controversially said that he would have "beheaded" those who refuse to chant "Bharat Mata ki Jai" were it not for the law of the land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X