హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రంప్ ప్రసంగంలో లోకల్ టచ్: హైదరాబాద్..సచిన్..షోలే..షారుఖ్ మూవీ..చాయ్‌వాలా: పదాలు పలకలేక..!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: రోమ్‌లో రోమన్‌లా..ఇటలీలో ఇటాలియన్‌లా వ్యవహరించాలంటుంటారు. ఈ సామెతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అచ్చంగా ఫాలో అయినట్టు కనిపించింది. భారత్‌లో భారతీయుడిగా కనిపించారాయన. అహ్మదాబాద్ శివార్లలోని మొతెరా స్టేడియంలో సుమారు 30 నిమిషాల పాటు ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో లోకల్ టచ్ కొట్టొచ్చినట్టు కనిపించింది. హైదరాబాద్ మొదలుకుని వివేకానందుడి దాకా.. చాయ్ వాలా మొదలుకుని షారుఖ్ ఖాన్ మూవీ దాకా కొన్ని లోకల్ పదాలు దొర్లాయి. వాటిని ఉచ్ఛరించడంలో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారనుకోండి.. అది వేరే విషయం.

Recommended Video

Namaste Trump : Twitter War On Trump Pronunciations | Oneindia Telugu
వివేకానందుడి గురించి..

వివేకానందుడి గురించి..

డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో స్వామి వివేకానందుడి గురించి ప్రస్తావించారు. వివేకానందుడి వంటి అసాధారణ వ్యక్తిత్వం భారతీయుల సొంతమని అన్నారు. వివేకానందుడు ప్రపంచానికే పాఠాలను నేర్పించారని స్మరించుకున్నారు. ఆయన బోధనలు చిరస్మరణీయమని చెప్పారు. చికాగోలో వివేకానందుడి ప్రసంగాన్ని తాను కొన్ని సందర్భాల్లో విన్నానని ట్రంప్ అన్నారు.

హైదరాబాద్ గురించి..

హైదరాబాద్ గురించి..

అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి హైదరాబాద్ పదం వినిపించడం ఆశ్చర్యకరమే. ఎప్పుడో మూడేళ్ల కిందట ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ను సందర్శించిన సందర్భాన్ని డొనాల్డ్ ట్రంప్.. తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2017 నవంబర్‌లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ను సందర్శించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ పారిశ్రామిక సదస్సులో తన కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారని అన్నారు. హైదరాబాద్‌ను సందర్శించినందుకు ఇవాంకాకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

మోడీని ఉద్దేశించి చాయ్‌వాలాగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చాయ్‌వాలాగా అభివర్ణించారు. చాయ్‌వాలా అనే పదాన్ని ఉచ్ఛరించలేకపోయారు. ఒక చాయ్‌వాలాను ప్రధానమంత్రిగా చేసిన గొప్పదనం భారతీయులకు మాత్రమే సాధ్యపడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒక్క అమెరికా మాత్రమే కాదని, ప్రపంచ దేశాలు సైతం భారత్ పట్ల గౌరవభావాన్ని చూపడానికి భారతీయుల వ్యక్తిత్వమే కారణమని అన్నారు ట్రంప్. ఒక చాయ్‌వాలాను శక్తిమంతుడైన నాయకుడిగా చేసిన భారతీయులు గొప్పవారని చెప్పారు.

నవరసాలు ఎక్కువే..

భారతీయుల్లో భావోద్వేగాలు, నవరసాలు అధికంగా ఉంటాయని అంటూ ట్రంప్.. షారుఖ్ ఖాన్, కాజల్ నటించిన బాలీవుడ్ మూవీ దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే, షోలే సినిమాల గురించి ప్రస్తావించారు. షార్ట్‌గా డీడీఎల్‌జేగా పేర్కొన్నారు. సంవత్సరానికి రెండువేలకు పైగా సినిమాలను చిత్రీకరించే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి కూడా ఈ స్థాయిలో సినిమాలను తీసే శక్తి సామర్థ్యాలు లేవని చెప్పారు.

సచిన్.. విరాట్ కోహ్లీల పైనా


టాప్ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీల గురించి కూడా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాజకీయాలు, సినిమాలను మాత్రమే కాదు.. క్రీడారంగాన్ని కూడా శాసించదగ్గ ఆటగాళ్లను భారతీయులు క్రీడా ప్రపంచానికి అందించారని చెప్పారు. భారతీయులు క్రికెట్‌ను తమ మతంగా మార్చుకున్నారని అన్నారు. మతాలకు అతీతంగా క్రీడాకారులను అభిమానిస్తున్నారని అన్నారు.

English summary
All over the planet people take great joy in watching Bollywood films, bhangra, and classic films like DDLJ and Sholay. You cheer on great cricketers like Sachin Tendulkar and Virat Kohli: US President. "From this day on, India will always hold a special place in. Your nation has always been admired around the Earth as the place where millions upon millions of Hindus & Muslims, Sikhs & Jains, Buddhists, Christians & Jews worship side by side in Harmony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X