వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. వీరే జనం బాబూ.. కారు వెంబడించి, డోర్ తీసి నోటితో ఊది.. విచిత్ర ప్రవర్తన..

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితే చాలు గుండే గుబేల్ మంటోంది. వైరస్ సోకిన వారికి గుండె నిబ్బరం చేసుకొని వైద్య సిబ్బంది ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అయితే కేరళలో మాత్రం కొందరు జనం పిచ్చిగా ప్రవర్తించారు. వైరస్ సోకిన గ్రామంలో శాంపిల్ సేకరిద్దామని వచ్చిన వైద్యులు/సిబ్బందికి పట్టపగలు చుక్కలు చూపించారు. దీంతో సిబ్బంది దేవుడా అంటే వచ్చిన వాహనంలోనే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 విచిత్ర అనుభవం

విచిత్ర అనుభవం

కేరళలోని పూంతురా గ్రామంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడినుంచే పాజిటివ్ కేసులు రావడంతో.. బల్క్‌గా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వైద్యులు, సిబ్బంది శుక్రవారం వచ్చారు. అయితే అక్కడవారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పరీక్ష కోసం రక్త నమూనాలను ఇవ్వాల్సిన ప్రజలు.. వికృతంగా ప్రవర్తించారు.

 నోటితో ఊది..

నోటితో ఊది..

శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాదు వారిని వెంబడించే ప్రయత్నం చేశారు. కారు డోర్ అద్దం తీసి.. నోటితో ఊదారు. ప్రజల చేష్టలతో వైద్య సిబ్బంది నివ్వేరబోయారు. వారికి వైరస్ ఉందోనని ధృవీకరించే సమయంలో ఇలా చేశారని.. వైద్యులు/సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఘటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్, శైలజ ఖండించారు.

Recommended Video

S Sreesanth Dream 11 Indian T20 Team : Included Himself, MS Dhoni, Suresh Raina || Oneindia Telugu
 కఠినతరం చేయడంతో...

కఠినతరం చేయడంతో...

వైరస్ ప్రభావం దృష్ట్యా లాక్ డౌన్ విధించడంపై స్థానికులు గుస్సా మీదున్నారు. ఈ క్రమంలో వైద్యులు రావడంతో ఆందోళన తెలిపారు. తమ కనీస అవసరాలను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది అని వాపోయారు. చాలామంది ఆందోళనకారులు మాస్క్ కూడా ధరించలేదు.

English summary
health workers in the Poonthura area and said that a team had gone in a car and was forced by the agitating local people to lower the car window Kerala Health Minister KK Shailaja said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X