వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువకుడి మృతి: పూరీ-బార్బిల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు, 3 బోగీలు ధ్వంసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పూరీ: ఒడిషాలోని పూరీ జిల్లాలో డీలాంగ్ రైల్వే స్టేషన్‌లో స్ధానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్ధితులకు దారీ తీసింది. దీంతో రైల్వే స్టేషన్‌లోని సామాగ్రిని ధ్వంసం చేసిని ఆందోళనకారులు పూరీ-బార్బిల్ ఎక్స్‌ప్రెస్ రైలుకున్న 3 బోగీలకు నిప్పంటించారు.

Locals set express train bogey on fire in Delang

ఈ ఘటనలో 3 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో పూరీ-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలుని రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఆందోళనకు గల కారణం గురువారం రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందడమే. యువకుడి మృతిపట్ల ఆగ్రహించిన స్ధానికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

వాహనాలకు నిప్పు పెట్టిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. సచివాలయ ప్రాంతంలో కొన్ని వాహనాలు, బస్సులకు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక సంఘటనలకు కారణం ఏప్రిల్ 6న షాలిమార్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు గాయపడటమేనని తెలుస్తోంది.

English summary
Hundreds of angry locals ransacked Delang railway station in Puri district and torched one bogey of Puri-Barbil Express today. The locals also damaged furniture and set fixtures on fire on the premises of the station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X