వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్ 5.0: కంటైన్మెంట్ జోన్లలోనే, మిగతా చోట్ల మరిన్ని సడలింపులు, స్కూళ్లపై జూలైలో...

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ ‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోందని హోంశాఖ తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ 5.0 అమల్లో ఉండనుంది. లాక్ డౌన్ పొడగింపుపై ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకొన్న తర్వాత కేంద్రం నిర్ణయం వెలువరించింది.

Recommended Video

Lockdown 5.0 ‘Unlock 1’: What is open, what is Shut from June 08

8వ తేదీ నుంచి ఓపెన్..


కంటైన్మెంట్ జోన్లలో కాకుండా ఇతర చోట్ల జూన్ 8వ తేదీ నుంచి రెస్టారెంట్లు, మాల్స్ తెరుచుకోనున్నాయి. అలాగే రాత్రి పూట కర్ప్యూ కూడా సడలింపులు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రార్థన మందిరాలు జూన్ 8వ తేదీ నుంచి తెరిచేందుకు అవకాశం కల్పించింది. విద్యాసంస్థలను ఎప్పుడూ తెరవాలనే అంశపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అంతరాష్ట్ర రవాణాకు ఆంక్షలు లేవని తెలిపింది.

హోటళ్లు, రెస్టారెంట్లు..

హోటళ్లు, రెస్టారెంట్లు..

ఫేజ్ 1లో భాగంగా కంటైన్మెంట్ జోన్లు కానీ ప్రాంతాల్లో పూజలు, ప్రార్థనాలు చేసేందుకు ప్రజలకు అనుమతి, హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చారు. షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేస్తారు. అయితే కేంద్ర వైద్యారోగ్యశాఖ జారీచేసిన నిబంధనలను.. భౌతికదూరం పాటించాలని తేల్చిచెప్పింది.

జూలైలో స్కూళ్లపై నిర్ణయం

జూలైలో స్కూళ్లపై నిర్ణయం

ఫేజ్ 2లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, ట్రైనింగ్, కోచింగ్ సెంటర్లు, ఇతర ఇనిస్టిట్యూట్లు ఓపెన్ చేయడంపై ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయం తీసుకొని ముందడుగు వేస్తామని తెలిపారు. అన్నివర్గాలను సంప్రదింపులు జరిపి.. విద్యాసంస్థలు తెరవడంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆంక్షలు తప్పదు

ఫేజ్ 3లో భాగంగా ఇతర దేశాల నుంచి వచ్చేవారిని అనుమతించారు. వందేభారత్ మిషన్ కాకుండా.. ఇతర విమానాలు రన్ కావని తేల్చిచెప్పాయి. మెట్రో రైలు, సినిమా హాళ్లు, జిమ్స్, స్విమ్మింగ్ ఫూల్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం, బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడంపై నిషేధం విధించారు. ఆయా చోట్ల పరిస్థితిని బట్టి ఫేజ్ 3లో నిబంధనలు సడలించే అవకాశం ఉంది.

అనుమతి అవసరం లేదు..

అనుమతి అవసరం లేదు..


ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రజలకు, సరుకుల కోసం ప్రత్యేకంగా అనమతి అవసరం లేదు అని పేర్కొన్నది. 65 ఏళ్లు దాటిన వారు, అనారోగ్యంతో ఉన్న వారు, గర్భవతులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. మీ ఆరోగ్యం కోసం ఆరోగ్య సేతు యాప్ వాడాలని కూడా సజెస్ట్ చేశారు.

English summary
lock down 5.0: Ministry of Home Affairs on Saturday extended the nationwide lockdown in containment zones till June 30 and issued fresh guidelines for phased re-opening of areas outside these zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X