• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కారు ఆపితే యువతి హంగామా ..పోలీసు చెయ్యి కొరికి రక్తం వాళ్ళ మీదే పూసి హల్చల్

|

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి . ఇక ఈ నేపధ్యంలో ప్రజలు బయటకు రావద్దని చెప్పినా వినకున్నా బయటకు వస్తున్న పరిస్థితులు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో పోలీసులు బయట తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో ఒక క్యాబ్ లో ప్రయాణిస్తున్న యువతిని ఆపిన పోలీసులు ఆమె చేసిన పనికి ఖంగుతున్నారు .

కరోనా రిలీఫ్ ఫండ్ : టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

 పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో రోడ్ పై యువతి హంగామా

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో రోడ్ పై యువతి హంగామా

తన కారును రోడ్డుపై ఆపినందుకు ఓ యువతి నడిరోడ్డుపై నానా హంగామా చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తే బయటకు వస్తున్న ప్రజలను ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు . ఇక అలా ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసుల మీద ఆ యువతి వీరంగం వేశారు . పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్‌ చేతిని కొరికింది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 కారు ఆపి ప్రశ్నించినందుకు రెచ్చిపోయిన యువతి

కారు ఆపి ప్రశ్నించినందుకు రెచ్చిపోయిన యువతి

కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద ఒక యువతి క్యాబ్ లో వస్తుండడం చూసి పోలీసులు ఆపారు. లాక్ డౌన్ అని ప్రకటించినా , బయట తిరగవద్దు అని చెప్పినా ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు పోలీసులు . తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామన్నారు. ప్రిస్కిప్షన్ అడిగితే లేదన్నారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగింది. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది .

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
   పోలీస్ చెయ్యి కొరికి, తన గాయాన్ని గిచ్చి రక్తం పూసి రచ్చ .. కేసు నమోదు

  పోలీస్ చెయ్యి కొరికి, తన గాయాన్ని గిచ్చి రక్తం పూసి రచ్చ .. కేసు నమోదు

  ఇక ఆమె వెంట ఉన్న ఓ యువకుడు కూడా బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగాడు. ఇంతలో ఆ యువతి మరింత రెచ్చిపోయి అక్కడ ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ చేయి కొరికేసింది. అక్కడితో ఆగిపోకుండా చాలా దారుణంగా ప్రవర్తించింది . గతంలో యువతికి తగిలిన దెబ్బను గిచ్చి అక్కడ వచ్చిన రక్తాన్ని పోలీస్ ఆఫీసర్‌ డ్రెస్ మీద వేసింది. ఇక దీంతో ఖగు తిన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఇక అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆ తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. సదరు యువతి చేసిన పనికి తాలూకు వీడియో వైరల్ గా మారటంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అవుతుంది.

  English summary
  The national lockdown over the coronavirus has sent some people in the country on the edge as they scramble to procure essential services. A woman in Kolkata even went to the extent if biting a police officer! A video has gone viral on social media showing a woman going into a tussle with police officers as they tried to question her over travelling as the entire country is under lockdown. Enraged over the questioning, the woman screamed at the police officer, accused him of shoving her and even bite him.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more