India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: అచ్చం సచిన్, అంజలి పెళ్లిలాగా ?, ఆతనికి 18, ఆమెకు 25, చల్లటి నీళ్లు చల్లి వేడిపుట్టించారు

|
Google Oneindia TeluguNews

చెన్నై/వేలూరు: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే ఆయన భార్య అంజలి టెండూల్కర్ వయసు ఎక్కువ. అదే తరహాలో ఓ పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి కొడుకుకు గాలం వెయ్యడానికి బంగారు నగలు, బంగ్లా, కారు, భారీ మొత్తంలో నగదు ఇవ్వడానికి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. ఆమెకు 25 ఏళ్లు, అతనికి 18 ఏళ్ల వయసు. పెళ్లికి పెళ్లి కొడుకు తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పెళ్లి చేసుకోవాలని పెళ్లి కుమార్తె ఉబలాటపడింది. అయితే పెళ్లి కొడుకు తల్లి, సోదరి రివర్స్ కావడంతో కథ అడ్డం తిరిగింది. తెలుగు సినిమాలో ట్వీస్ట్ లాగా కథ కొత్తమలుపు తిరిగింది.

Lockdown: ఆర్థిక సమస్యలు, వీడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఏమంటారో తెలీదు, ప్రియురాలి వీడియోలు !Lockdown: ఆర్థిక సమస్యలు, వీడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఏమంటారో తెలీదు, ప్రియురాలి వీడియోలు !

 టార్చర్ తో విడాకులు

టార్చర్ తో విడాకులు

తమిళనాడులోని వేలూరు జిల్లాలో 25 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఈమెకు ఇదివరకే పెళ్లి జరిగింది. అయితే ప్రతినిత్యం దంపతుల మద్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి నచ్చచెప్పడానికి అనేకసార్లు ప్రయత్నించారు. అయితే దంపతుల మద్య రోజురోజుకు గొడవలు పెరిగిపోవడంతో వీరు విడాకులు తీసుకున్నారు. యువతి ఆమె తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉంటున్నది.

 18 ఏళ్ల యువకుడికి వల

18 ఏళ్ల యువకుడికి వల

విడాకులు తీసుకున్న యువతి బంధువు వేలూరు పట్టణం సమీపంలోని అరియూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతని మీద యువతి కన్ను పడింది. ఇద్దరికి 7 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినా ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానని, వెంటనే మీరు తనకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేసింది.

 యువతి ఫ్యామిలీ బిగ్ షాట్

యువతి ఫ్యామిలీ బిగ్ షాట్

యువతి కుటుంబ సభ్యులు శ్రీమంతులు. 18 ఏళ్ల యువకుడితో తమ కుమార్తె వివాహం జరిపిస్తే కట్నం కింద భారీ మొత్తంలో డబ్బులు, బంగ్లా, బంగారు నగలు, కారు ఇస్తామని యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. వివాహం జరిగి విడాకులు తీసుకున్న యువతితో కుమారుడి వివాహం జరిపించడానికి అతని తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 ఇద్దరు మహిళలు రివర్స్

ఇద్దరు మహిళలు రివర్స్

25 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువకుడికి పెళ్లి జరిపించడానికి లాక్ డౌన్ సరైన సమయం అని కుటుంబ సభ్యులు బావించారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎలాగైనా పెళ్లి జరిపించాలని ఈనెల 12వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి గుడిలో చెయ్యాలని యువతి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే వివాహం జరిగి విడాకులు తీసుకున్న తన కుమారుడి కంటే 7 ఏళ్ల వయసు ఎక్కువ ఉన్న యువతితో పెళ్లి జరిపించడానికి పెళ్లి కొడుకు తల్లి, సోదరి వ్యతిరేకించారు.

 తెలుగు సినిమా ట్వీస్ట్

తెలుగు సినిమా ట్వీస్ట్

ఎవరు అవునన్నా, కాదన్నా సరే తన కుమారుడి వివాహం 25 ఏళ్ల యువతితోనే జరిపిస్తానని పెళ్లి కొడుకు తేల్చిచెప్పాడు. డబ్బులు, బంగారు, బంగ్లా, కారు కోసం ఆశపడి తన కుమారుడి జీవితం నాశనం చేస్తామంటే నేను ఒప్పుకోను అని పెళ్లి కొడుకు తల్లి గొడవ పెట్టుకుంది. పెళ్లి చెయ్యాలని పెళ్లి కొడుకు పట్టుబట్టడంతో పెళ్లి కొడుకు తల్లి వేలూరు జిల్లా శిశు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఈ పెళ్లి నిలిపివేయాలని మనవి చేసింది.

 పెళ్లి కావాలా ? జైలు కావాలా

పెళ్లి కావాలా ? జైలు కావాలా

విషయం తెలుసుకున్న జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు పెళ్లి కొడుకు ఇంటికి చేరుకున్నారు. యువకుడికి 18 ఏళ్లు నిండాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే భారత చట్టం ప్రకారం 21 ఏళ్ల నిండిన యువకుడికే పెళ్లి జరిపించాలని రూల్ ఉందని, అలా కాదని మొండిగా పెళ్లి జరిపిస్తే జైలుకు పంపిస్తామని అధికారులు పెళ్లి కొడుకు తండ్రిని, యువతి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. వెంటనే వివాహ ఏర్పాట్లు నిలిపివేయాలని పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు అధికారులు సూచించారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ లాగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన యువతి ఆశల మీద అధికారులు చల్లటి నీళ్లు చల్లి వేడిపుట్టించారు.

English summary
Lockdown: 18 year old boy married 25 year old girl near Veloore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X