బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: కర్ణాటక నుంచి వెళ్లిపోతున్న 2 లక్షల మంది, బెంగళూరు ఇంటి ఒనర్స్ దూల తీరుతుంది, ఖాళీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 2. 05 లక్షల మంది వలస కార్మికులు, కూలీలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే 2. 05 లక్షల మంది మా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని కర్ణాటక ప్రభుత్వం దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు.

ఈ దెబ్బతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇక బెంగళూరులో ఇన్ని రోజులు భారీ మొత్తంలో అద్దెలు వసూలు చేసి జల్సాలు చేస్తున్న కొందరు ఇంటి యజమానులు ఎక్కడ మా దూల తీరిపోతుందో అంటూ షాక్ కు గురైనారు. బెంగళూరులోనే సుమారు లక్షల మందికిపైగా వారి ఇండ్లు ఖాళీ చెయ్యాలని నిర్ణయించడంతో ఇంటి యజమానుల తిక్క కుదురుతుందని సాటి కార్మికులు అంటున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

కర్ణాటకలో లక్షల మంది వలస కూలీలు

కర్ణాటకలో లక్షల మంది వలస కూలీలు

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో కొన్ని లక్షల మంది వలస కూలీలు, కార్మికులు, దినసరి కూలీలు నివాసం ఉంటున్నారు కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో 45 రోజులకుపైగా కూలి పనులు లేక వలస కూలీలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంత కాలం చాలిచాలని తిండి తింటూ కాలం వెళ్లదీస్తున్న వసల కూలీలు, కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించారు.

పీక్కుతింటున్న ఇంటి యజమానులు?

పీక్కుతింటున్న ఇంటి యజమానులు?

కూలీపనులు చేస్తున్న వసల కూలీలు, కార్మికులు ఇంత కాలం బెంగళూరు నగరంలో విపరీతమైన ఇంటి అద్దెలు చెల్లిస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 45 రోజుల నుంచి పనులు లేకపోవడం, తినడానికి కనీసం తిండికి లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటి అద్దెలు చెల్లించాలని ఇంటి యజమానులు పట్టుబడుతున్నారు. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, వెంటనే ఇంటి అద్దెలు, కరెంట్, నీళ్ల బిల్లులు చెల్లించాలని ఇంటి యజమానులు వలస కూలీలు, కార్మికుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

విరక్తి చెందిన వలస జీవులు

విరక్తి చెందిన వలస జీవులు

కూలి పనులు లేకపోవడంతో తినడానికే తిండికి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంటి యజమానులు టార్చర్ ఎక్కువ అయ్యిందని విసుగు చెందిన వలస కార్మికులు, కూలీలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 2. 05 లక్షల మంది కర్ణాటక ప్రభుత్వం దగ్గర వారి పేర్లు నమోదు చేసుకుని మా సొంత రాష్ట్రాలకు పంపించాలని వేడుకుంటున్నారు.

ఇంటి యజమానులకే వత్తాసు పలికితే!

ఇంటి యజమానులకే వత్తాసు పలికితే!

లాక్ డౌన్ కారణంగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా గురించి పట్టించుకోకుండా కొందరు ప్రభుత్వ పెద్దలు, పలు పార్టీల నాయకులు ఇంటి యజమానులకే వత్తాసు పలుకుతున్నారని, మా భాదలు పట్టించుకోవడం లేదని వలస కూలీలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. చావో బతుకో మా సొంత ఊర్లలోనే తేల్చుకుంటామని బెంగళూరులో మేము బతకలేమని చాలా మంది వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓటు బ్యాంకు కోసం నోరు విప్పడం లేదు!

ఓటు బ్యాంకు కోసం నోరు విప్పడం లేదు!

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కనీసం వారి దగ్గర ఇళ్ల అద్దెలు వసూలు చెయ్యకూడదని ఇంటి యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యలేదని వలస కూలీలు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి యజమానులు నీటి సరఫరా కట్ చేశారని, తాము ఇళ్లలో భార్య, పిల్లలతో కలిసి ఎలా నివాసం ఉండాలని వలస కూలీలు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ఇంటి యజమానుల తిక్క కుదిరితే!

ఇంటి యజమానుల తిక్క కుదిరితే!

బెంగళూరులోని ఇంటి యజమానుల ఓటు బ్యాంకు కోసం మేము బజారులో పడినా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు పట్టించుకోవడం లేదని, మాలాంటి వాళ్లు ఒక్కసారిగా ఇండ్లు ఖాళీ చేస్తే అప్పుడు ఇంటి యజమానుల తిక్క కుదురుతుందని వలస కూలీలు, కార్మికులు మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బెంగళూరులో ఇంటి అద్దెలు వసూలు చేస్తున్నారని, అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వలస కూలీలు, కార్మికులు ఆరోపిస్తున్నారు.

నిర్ణయం మార్చుకున్న బీజేపీ ప్రభుత్వం

నిర్ణయం మార్చుకున్న బీజేపీ ప్రభుత్వం

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస కూలీలు, కార్మికులను తరలించడానికి ప్రత్యేక రైళ్లను రద్దు చెయ్యాలని మొదట అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనేక విమర్శలు ఎదురుకావడంతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తరువాత ఆ నిర్ణయం మార్చుకుని ఇప్పుడు 9 రాష్ట్రాలకు చెందిని వలస కూలీలు, కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని నిర్ణయించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్న వలస కూలీలు, కార్మికులను మాత్రమే వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని కర్ణాటక ప్రభుత్వం మెలికపెట్టింది.

Recommended Video

Vande Bharat Operation: Special Flights with Indian Nationals From UAE Landed at Kochi
ఈ రాష్ట్రల ప్రజలు మాత్రమే

ఈ రాష్ట్రల ప్రజలు మాత్రమే

బెంగళూరులో పాటు కర్ణాటకలో నివాసం ఉంటున్న వలస కూలీలు, కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో బీహార్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల ప్రజలను ప్రత్యేక రైళ్లలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడతలో తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ప్రజలను తరలించాలని నిర్ణయించారు. శుక్రవారం వలస కూలీలు, కార్మికులతో ఒకటి లేదా రెండు రైళ్లు బయలుదేరుతాయని, శనివారం నుంచి రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

English summary
Lockdown: Till 2.04 lakh people have sought permission to go back to their home state from Karnataka. Govt will only make travel arrangements for those whose name have been cleared by their home states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X