బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: బెంగళూరులో 3 లక్షల Tolet బోర్డులు ! వెళ్లి పోతున్న 5 లక్షల మంది, లాక్ డౌన్ దెబ్బ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో కార్మికులు, కూలీలు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వారి జీవితాలు పూర్తిగా తల్లకిందులు అయ్యాయి. పుట్టిన ఊర్లో, ఆ పరిసర ప్రాంతాల్లో జీవించడానికి వీలులేకపోవడంతో వలస వెళ్లిన కూలీలు ఈ రోజు ఉన్న పల్లంగా తట్టేబేడా సర్దుకుని వారి సొంత ప్రాంతాలకు పయనం అయ్యారు. పుట్టిన ఊర్లో గంజీ తాగి బతక వచ్చని, అదీ లేకుంటే మంచీనీళ్లు తాగైనా ప్రాణాలు ఉన్నంత వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండ వచ్చని నిర్ణయించుకున్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న 5 లక్షల మంది వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని నిర్ణయించారు. 5 లక్షల మందికి పైగా సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని వారి పేర్లు కర్ణాటక ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు. ఈ దెబ్బతో బెంగళూరు నగరంలో ఇంత కాలం భారీగా ఇంటి అద్దెలు వసూలు చేసి పేదల రక్తం తాగిన కొందరు ఇంటి యజమానులు ఇప్పుడు సుమారు 3 లక్షలకు పైగా ఇండ్లకు Tolet బోర్డులు తగిలించడానికి సిద్దం అవుతున్నారు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

సేవా సింధులో ఈ పాస్ లు

సేవా సింధులో ఈ పాస్ లు

కర్ణాటకలో ఉంటున్న వలస కూలీలు, కార్మికులను ఆ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సేవా సింధు వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లడానికి, ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి పేర్లు నమోదు చేసుకుంటున్న వారికి సేవా సింధు వెబ్ సైట్లలో పేర్లు, వివరాలు పరిశీలిస్తున్న కర్ణాటక ప్రభుత్వం వారికి ఈ పాసులు మంజూరు చేస్తున్నది.

5 లక్షల మందితో షాక్

5 లక్షల మందితో షాక్

కర్ణాటకలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెలుతున్న వారి పేర్లు, వివరాలు పరిశీలించి ఈ పాస్ లు మంజూరు చేస్తున్న అధికారులు పెద్దగా ఏమి పట్టించుకోవడం లేదు. అయితే బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఉంటున్న 5 లక్ష్లల మందికి పైగా వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఈ పాస్ లకు దరఖాస్తు చేసుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం షాక్ కు గురైయ్యింది.

దిక్కుమాలిన బతుకులు

దిక్కుమాలిన బతుకులు

లాక్ డౌన్ కారణంగా చెయ్యడానికి పనులు లేవని, చేతిలో డబ్బులు ఖాళీ అయ్యాయని, తాగడానికి నీళ్లు కూడా చిక్కడం లేదని, ఈ దిక్కుమాలిన బతుకు మేం బతకలేమని, వెంటనే మమ్మల్ని మా రాష్ట్రాకు పంపించాలని సేవా సింధులో పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలు, కార్మికులు బోరున విలనిస్తున్నారు. ముఖ్యమంగా బెంగళూరు నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని సేవా సింధులో పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు.

ప్రభుత్వానికి తలనొప్పి

ప్రభుత్వానికి తలనొప్పి

సుమారు 5 లక్షల మంది వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది. సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వారికి ఇప్పటికే నచ్చచెప్పడానికి ప్రయత్నించిన కర్ణాటక ప్రభుత్వం, అధికారులు విఫలం అయ్యారు. 5 లక్షల మంది వలస కూలీలు, కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి సాధ్యం అవుతుందా ? అంటూ కొందరు అధికారులు అయోమయంలో పడిపోయారు.

చేతులు ఎత్తేస్తున్న కాంట్రాక్టర్లు !

చేతులు ఎత్తేస్తున్న కాంట్రాక్టర్లు !

వలస కూలీలు, కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతే ఎక్కడ పనులు ఆగిపోతాయో అంటూ కొందరు కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని లక్షల మందికి ఇన్ని రోజులు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించిన కొందరు కాంట్రాక్టర్లు ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారో ? తెలీకపోవడం, అన్ని రోజులు వారికి ఆహారం, నిత్యవసర వస్తువులు ఇచ్చామని, ఇక మావళ్లకాదని, మేము వారికి ఏమీ సరఫరా చెయ్యలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు మాకు ఇవ్వవలసిన కూలీ డబ్బులు, జీతాలు ఇవ్వలేదని కొన్ని వేల మంది వలస కూలీలు, కార్మికులు ఆరోపిస్తున్నారు.

బెంగళూరులో 25 శాతం మంది

బెంగళూరులో 25 శాతం మంది

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లకుండా వారికి నచ్చచెప్పడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. అయితే వారు వెనక్కి తగ్గకపోవడం, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బెంగళూరు నగరంలోని ఒక్క పిణ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోనే 25 శాతం మంది వలస కూలీలు, కార్మికులు ఉన్నారని అధికారులు అంటున్నారు.

బెంగళూరులో 3 లక్షల Tolet బోర్డులు !

బెంగళూరులో 3 లక్షల Tolet బోర్డులు !

కర్ణాటకలో మొత్తం మీద 5 లక్షల మంది వలస కూలీలు, కార్మికులు కర్ణాటకను వదిలి వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతే బెంగళూరు సుమారు 3 లక్షలకు పైగా ఇండ్లు ఖాళీ అయిపోతాయని తెలిసింది. ఇంత కాలం భారీగా అద్దెలు వసూలు చేసి జల్సాలు చేసిన బెంగళూరులోని ఇంటి యజమానులు ఇప్పుడు Tolet బోర్డులు వేసుకోవడానికి సిద్దం అవుతున్నారు.

English summary
Lockdown: Around 5 lakh migrant workers from various districts of registered now to go back to their home state in Karnataka. More workers from Bihar, Uttar Pradesh, Jharkhand and other state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X