వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: చెల్లెలు కోసం వచ్చిన 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య, 14 ఏళ్లకే క్రిమినల్ మైండ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి: చెల్లితో ఆడుకోవడానికి వచ్చిన 9 ఏళ్ల బాలికను నమ్మించి తీసుకెళ్లిన మైనర్ బాలుడు లైంగిక దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. లైంగిక దాడికి గురైన బాలిక అపస్మారకస్థితిలో పడి ఉన్న ప్రాంతంలోనే రక్తం మరకలు ఉన్న బాలుడి షర్టు పూడ్చిపెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. బాలిక మీద గత కొన్ని నెలల నుంచి లైంగిక దాడి చెయ్యడం, తలమీద దాడి చెయ్యడం వలనే మరణించిందని వైద్యులు చెప్పడంతో 14 ఏళ్లకే క్రిమినల్ మైండ్ ఉన్న బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న బాలుడు బాలిక మీద లైంగిక దాడి చేసి చంపేశాడని వెలుగు చూసింది. సంచలనం రేపిక ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

చెల్లెలి ఫ్రెండ్

చెల్లెలి ఫ్రెండ్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణపారై సమీపంలోని గ్రామంలో 9 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. బాలిక ఇంటి పక్కింటిలో 14 ఏళ్ల బాలుడు, ఆ బాలుడి చెల్లెలు నివాసం ఉంటున్నాడు. 9 ఏళ్ల బాలిక రోజు ఆడుకోవడానికి బాలుడి ఇంటి దగ్గరకు వెళ్లేది. 9 ఏళ్ల బాలిక పక్కింటికి వెళ్లి వస్తుంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాలేదు.

పూలతోటలో బాలిక

పూలతోటలో బాలిక

గ్రామం సమీపంలోని పూలతోటలో బాలిక అపస్మారక స్థితిలో పడిఉంది. ఆ సమయంలో అటువైపు వెలుతున్న గ్రామస్తులు విషయం గుర్తించి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాలికను తిరుచ్చి ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై బాలిక మరణించింది. బాలిక వైద్యపరీక్షలు చేయించిన వైద్యలు బాలికపై లైంగిక దాడి జరిగిందని, తల మీద బండరాయితో దాడి చెయ్యడంతో ఎక్కువ రక్తం పోవడం వలనే మరణించిందని నివేదిక ఇచ్చారు.

14 ఏళ్లకే కిరాతకుడికి ఎంత తెలివి ?

14 ఏళ్లకే కిరాతకుడికి ఎంత తెలివి ?

విషయం తెలుసుకున్న తిరుచ్చి జిల్లా ఎస్పీ జియా ఉల్ హన్ రంగంలోకి దిగి స్వయంగా విచారణ చేశారు. బాలిక అపస్మారకస్థితిలో పడి ఉన్న పూలతోట పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో పూలతోట సమీపంలో రక్తపు మరకలు అంటుకున్న ఓ షర్టు పూడ్చిపెట్టిన విషయం పోలీసులు గుర్తించారు. ఆ షర్టు 14 ఏళ్ల బాలుడిది అని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.

కొన్ని నెలలుగా లైంగిక దాడి

కొన్ని నెలలుగా లైంగిక దాడి

14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం బయటపడింది. ప్రతిరోజు తన చెల్లితో ఆడుకోవడానికి వస్తున్న 9 ఏళ్ల బాలికపై కొన్ని నెలల నుంచి లైంగిక దాడి చేశానని బాలుడు అంగీకరించాడు. ఆదివారం బాలికను పూలతోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశానని, ఎదురుతిరిగిన బాలిక తల మీద రాయితో దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైనాయని బాలుడు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన బాలుడిని అరెస్టు చేసి బాల నేరస్తుల కారాగారానికి తరలించామని తిరుచ్చి జిల్లా ఎస్పీ జియా ఉల్ హన్ మీడియాకు చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో అప్పుడప్పుడు పోర్న్ వీడియోలు చూస్తున్న బాలుడు బాలిక మీద లైంగిక దాడి చేసి చంపేశాడని వెలుగు చూసింది.

English summary
Lockdown: 9 year old girl killed by 14 year old boy near Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X