lockdown: మంచిమొగుడు వస్తాడు, నీకు కరోనా రాదు, ప్రార్థనలు చేస్తానని యువతిపై మౌల్వీ రేప్!
బెంగళూరు/ మైసూరు: అందమైన అమ్మాయి మీద కన్ను వేసిన ఓ మతగురువు లాక్ డౌన్ లో ఎక్కువ సేపు ఇంట్లోనే ఉంటున్న ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అమ్మాయి లొంగకపోవడంతో నీకు మంచి మొగుడు వచ్చేలా ఆదేవుడికి ప్రార్థనలు చేస్తానని, నువ్వు జీవితంలో సుఖంగా ఉండటానికి నేను సహాయం చేస్తానని, కరోనా వైరస్ వ్యాధి నీ దగ్గరకు కూడా రాదని యువతిని నమ్మించిన మసీదులోని మౌల్వీ ఆమెపై అత్యాచారం చేశాడు. పదేపదే తన కోరిక తీర్చాలని యువతికి చిత్రహింసలు పెట్టాడు. మౌల్వీ టార్చర్ తట్టుకోలేని యువతి అసలు విషయం బయటకు చెప్పడంతో ఆ కామాంధుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా!
అందమైన అమ్మాయి
కర్ణాటకలోని మైసూరు జిల్లా హణసూరు సమీపంలోని చిల్కుంద గ్రామంలో అందమైన అమ్మాయి నివాసం ఉంటున్నది. హణసూరు పట్టణంలోని లాల్ బన్ వీదిలో నివాసం ఉంటున్న జబీవుల్లా అనే వ్యక్తి హైరిగే గ్రామంలోని ఓ మసీదులో మతగురువు (మౌల్వీ)గా పని చేస్తున్నాడు.
అమ్మాయిపై మతగురువు కన్ను
జబీవుల్లా మతగురువు కావడంతో ముస్లీం సోదరులు ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. చుట్టుపక్కల గ్రామాల వారు, తెలిసిన వారు మతగురువు జబీవుల్లా మాటకు గౌరవం ఇచ్చేవారు. ఇదే సమయంలో యువతి కుటుంబ సభ్యులు మతగురువు జబీవుల్లాను అప్పుడప్పుడు ఇంటికి పిలుచుకుని వెళ్లేవారు. ఆ సమయంలో మౌల్వీ జబీవుల్లా అమ్మాయి మీద కన్ను వేశాడు.
లొంగదీసుకోవాలని!
లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన అందమైన అమ్మాయి మీద కన్ను వేసిన మౌల్వీ జబీవుల్లా ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అది వీలుకాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు పెళ్లి పేరుతో గాలం వేశాడు. మీ అమ్మాయికి మంచి భర్త రావాలని ప్రతిరోజు నేను మసీదులో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తానని వారిని నమ్మించాడు. ఇదే సమయంలో ప్రార్థనలు చేసే ముసుగులో మౌల్వీ అమ్మాయిని కలవడం మొదలుపెట్టాడు.
మంచిమొగుడు వస్తాడు, కరోనా రాదు!
అమ్మాయి ఇంటికి వెళ్లి వస్తున్న మౌల్వీ ఆమె ఇంటిలో ఎవరు లేని సమయంలో పక్కాప్లాన్ ప్రకారం ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తాను చెప్పినట్లు నువ్వు ప్రార్థనలు చేస్తే నీకు మంచిమొగుడు వస్తాడని, కరోనా వైరస్ నీ దగ్గరకు కూడారాదని నమ్మించి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు.
Recommended Video
కోరిక తీర్చాలని టార్చర్
ప్రతినిత్యం తన కోరిక తీర్చాలని మౌల్వీ జబీవుల్లా ఎక్కువ టార్చర్ పెట్టడంతో తట్టుకోలేని యువతి ఆమె తండ్రికి విషయం చెప్పింది. నమ్మినందుకు తన కుమార్తె జీవితం నాశనం చేశాడని యువతి తండ్రి మౌల్వీ జబీవుల్లాపై హణసూరు పోలీసులకు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మౌల్వీ జబీవుల్లా మాయం అయ్యాడు. మసీదులో ఇలా ప్రార్థనల ముసుగులో మతగురువు జబీవుల్లా ఇంకా ఎంతమందిని మోసం చేశాడో విచారణ చేస్తున్నామని హణసూరు గ్రామీణ పోలీసులు తెలిపారు.