వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: విదేశాల్లో భర్త మృతి, మరుసటి రోజు బిడ్డకు జన్మనిచ్చిన భార్య, ఒక్క నిమిషం చూపించాలని !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ దుబాయ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక డౌన్ విధించడంతో భారతీయులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. దుబాయ్ లో చిక్కుకున్న దంపతులు భారత్ రావాలని ప్రయత్నించారు. నెల క్రితం భార్య భారత్ చేరుకుంది. అప్పటి నుంచి భర్త భారత్ రావడానికి ప్రయత్నించాడు. అయితే విధి రాసిన కథలో భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఒక్కరోజు ముందే విదేశాల్లో భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడని తెలుసుకున్న భార్య ఒక్క నిమిషం తన భర్తను చివరిసారి చూసుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఒకేఒక్కసారి తన భర్తను ముట్టుకుంటానని భార్య ఆర్తనాదాలు చెయ్యడంతో మీడియాతో సహ అక్కడున్న వారు అందరూ చలించిపోయారు. బిడ్డ పుట్టాడు అనే సంతోషాన్ని మరిచిపోయి భర్త లేడనే భాదతో పగవారికి కూడా ఇలాంటి కష్టాలు వద్దు దేవుడా అంటూ ఆ భార్య ఆర్తనాదాలు చేసింది.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

 కేరళ దంపతులు

కేరళ దంపతులు

కేరళలోని కోజికోడ్ కు చెందిన నితిన్ చంద్రన్ (28), అతిరా గీతా శ్రీధరన్ దంపతులు దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. ఈనెల (జూన్) 2వ తేదీన నితిన్ చంద్రన్ 28 ఏళ్లు పూర్తి చేసుకుని 29 ఏట అడుగుపెట్టాడు. నితిన్ చంద్రన్ భార్య అతిరా గీతా శ్రీధరన్ నిండుగర్బవతి. దుబాయ్ లో చాలా సంతోషంగా ఇంత కాలం దంపతులు జీవనం సాగించారు.

 లాక్ డౌన్ దెబ్బతో !

లాక్ డౌన్ దెబ్బతో !

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు భారత్ లో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతతీయులు భారత్ రాలేకపోయారు. నితిన్ చంద్రన్ భారత్ రావడానికి కోర్టును ఆశ్రయించారు. అంతకు నెల రోజుల ముందే అతిరా గీతా శ్రీధరన్ భారత్ చేరుకుని కేరళలోని ఆమె ఇంటికి చేరుకుంది.

 నిద్రలోనే ప్రాణం విడిచిన భర్త

నిద్రలోనే ప్రాణం విడిచిన భర్త

సోమవారం నితిన్ చంద్రన్ కేరళలో ఉన్న భార్య అతిరా గీతా శ్రీధరన్ కు ఫోన్ చేసి మాట్లాడాడు. తనకు పురుటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయని భార్య అతిరా భర్త నితిన్ చంద్రన్ కు చెప్పింది. వెంటనే ఆసుపత్రిలో చేరాలని, తాను భారత్ వస్తున్నానని నితిన్ చంద్రన్ భార్య అతిరాకు చెప్పాడు. అదే రోజు రాత్రి దుబాయ్ లోని ఇంటిలో నిద్రపోయిన నితిన్ చంద్రన్ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.

 ఒక్క రోజు తేడాలో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

ఒక్క రోజు తేడాలో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

మంగళవారం అతిరా గీతాకు పురిటినోప్పులు ఎక్కువ కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయంలో అతిరాకు రక్తపోటు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్ చెయ్యడంతో అతిరా గీతా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు బిడ్డపుట్టిందని ఆసుపత్రిలో ఉన్న అతిరా గీతా దుబాయ్ లో ఉంటున్న భర్త నితిన్ చంద్రన్ కు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే నితిన్ చంద్రన్ ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో అతిరా గీతాకు అనుమానం మొదలైయ్యిందని నితిన్ చంద్రన్ ప్రాణ స్నేహితుడు బిబిన్ జాకబ్ ది గల్ఫ్ న్యూస్ కు చెప్పాడు.

 ఏం జరిగిందో చెప్పండి ?

ఏం జరిగిందో చెప్పండి ?

బుధవారం రాత్రి షార్జా నుంచి నితిన్ చంద్రన్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్ పంపించడానికి యూఏఇ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నితిన్ చంద్రన్ గుండెపోటుతో మరణించాడని, ఆయనకు కరోనా వైరస్ లేదని దుబాయ్ వైద్యులు దృవీకరించారు. నితిన్ చంద్రన్ మృతదేహం కేరళలోని కొచ్చికి చేరుకుంది. కోచికోడ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య అతిరా గీతా శ్రీధరన్ కు ఒక్కసారి నితిన్ చంద్రన్ మృతదేహాన్ని చూపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 నా భర్తను ఒక్క నిమిషం చూపించండి

నా భర్తను ఒక్క నిమిషం చూపించండి

కోజికోడ్ లోని ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో నితిన్ చంద్రన్ మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్ నిలిపారు. అదే సమయంలో వీల్ చేర్ లో అతిరా గీతా శ్రీధరన్ ను అంబులెన్స్ దగ్గరకు తీసుకువచ్చారు. నీ భర్త నితిన్ చంద్రన్ మరణించాడని బంధువులు చెప్పడంతో అతిరా గీతా వీల్ చేర్ లోనే పక్కకుపడిపోయింది. నితిన్ చంద్రన్ మృతదేహాన్ని శవపేటికలో పూర్తిగా సీల్ చెయ్యడం, ముఖం మాత్రం కవర్ లో నుంచి చూడటానికి అవకాశం ఉండటంతో అతిరా గీతా తల్లడిల్లిపోయింది. శవపేటిక తీస్తే తన భర్త నితిన్ ను ఒక్కసారి చివరిసారిగా చూస్తానని, ఆ అవకాశం ఇవ్వాలని అతిరా గీతా ఆర్తనాదాలు చేసింది. అయితే శవపేటిక తియ్యడానికి అధికారులు అంగీకరించలేదు.

 పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు దేవుడా

పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు దేవుడా

అతిరా గీతా భర్త నితిన్ చంద్రన్ శవం ముందు ఆర్తనాదాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న మళయాలం మీడియా టీవీల్లో లైవ్ లో దృశ్యాలు ప్రసారం చెయ్యడంతో అందరూ చలించిపోయారు. అతిరా గీతాను ఓదార్చడం ఎవ్వరివల్ల కాకపోవడంతో మీడియా సైతం అక్కడే మౌనంగా ఉండిపోయింది. కేవలం రెండు నిమిషాలు మాత్రమే నితిన్ చంద్రన్ మృతదేహాన్ని చూడటానికి అవకాశం ఇచ్చిన అధికారులు తరువాత శవాన్ని తీసుకెళ్లి ఆయన సొంత గ్రామంలో సాంప్రధాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. తనకు బిడ్డ పుట్టబోతుందని, అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఎన్నో కలలుకన్న నితిన్ చంద్రన్ ఒక్కసారి కూడా బిడ్డను చూసుకోకుండా ప్రాణాలు విడిచాడని ఆయన భార్య అతిరా గీతా ఆర్తనాదాలు చేస్తోంది. దుబాయ్ లోని నితిన్ చంద్రన్ మృతదేహాన్ని భారత్ పంపించడానికి సహకరించిన భారత ప్రభుత్వం, దుబాయ్ ప్రభుత్వంతో పాటు అక్కడి భారతీయులకు ప్రముఖ న్యాయవాది హర్షిక్ టీకే. ధన్యవాదాలు తెలిపారు.

English summary
Lockdown: Scores of people on Wednesday paid a tearful adieu to an Indian expat who died a day before his pregnant wife repatriated from the UAE a month ago delivered their first child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X