బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం అమలు చేసిన లాక్ డౌన్ సందర్బంగా కొందరు పోలీసులకు మామూళ్లు వసూలు కాకపోవడంతో ఢీలా పడిపోయారు. దాదాపు 90 శాతం షాపులు మూసివేయడంతో పోలీసులకు ఇంత కాలం రోజువారి మామూళ్లు ఇచ్చిన వ్యాపారులు చేతులు ఎత్తేశారు. ఇలాంటి లాక్ డౌన్ సమయంలో సిగరెట్లు విక్రయించడానికి మీరు అనుమతి ఇస్తే రూ. 60 లక్షలు లంచం ఇస్తామని కొందరు డీలర్లు, వ్యాపారులు పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

లాక్ డౌన్ లో ఒక్క డీల్ కు ఒక్కసారిగా రూ. 60 లక్షలు ఇంటికి వస్తుంటే ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులు కాదనలేకపోయారు. అంతే ఢీల్ ఓకే అయ్యింది. వ్యాపారులు పోలీసు అధికారులకు రూ. 60 లక్షలు ఇచ్చేయడం, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి చకచకా అక్రమంగా సిగరెట్లు బ్లాక్ మార్కెట్ కు తరలించడం జరిగిపోయింది. అయితే ఎక్కడో తేడా కొట్టి ఈ విషయం పై అధికారులకు తెలియడంతో తరువాత అసలు కథ మొదలైయ్యింది.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

లాక్ డౌన్ దెబ్బతో సిగరెట్లు జామ్

లాక్ డౌన్ దెబ్బతో సిగరెట్లు జామ్

కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో లిక్కర్, సిగరెట్లు, పాన్, గుట్కాకు విపరీతమైన డిమాండ్ ఎర్పడింది. ముఖ్యంగా సిగరెట్లకు భారీ డిమాండ్ ఎర్పడింది. షాపుల్లో స్టాక్ ఉన్న సిగరెట్లు మొత్తం ఖాళీ అయ్యాయి.

ఒక్క సిగరెట్ రూ. 50

ఒక్క సిగరెట్ రూ. 50

బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్క సిగరెట్ రూ. 25 నుంచి రూ. 50 వరకు విక్రయించడం మొదలు పెట్టారు. అయినా సిగరెట్లకు భారీగా డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపారులు భారీ మొత్తంలో సిగరెట్లు బ్లాక్ లో విక్రయించడం మొదలుపెట్టారు. ఇలా బెంగళూరులో స్టాక్ ఉన్న సిగరెట్లు మొత్తం ఖాళీ అయిపోయాయి.

రూ. 60 లక్షలకు భారీ డీల్

రూ. 60 లక్షలకు భారీ డీల్

లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సిగరెట్లు సరఫరా చెయ్యడానికి వ్యాపారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సిగరెట్లకు భారీ డిమాండ్ పెరిగిపోవడంతో ఎలాగైనా సిగరెట్లు విక్రయించాలని వ్యాపారులు నిర్ణయించారు. సిగరెట్లు తరలించడానికి అవకాశం ఇస్తే రూ. 60 లక్షలు లంచం ఇస్తామని సిగరెట్ల డీలర్లు, వ్యాపారులు బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు భారీ డీల్ పెట్టారు.

రూ. 60 లక్షలు డీల్ ఓకే కాని ఇంకా కావాలి?

రూ. 60 లక్షలు డీల్ ఓకే కాని ఇంకా కావాలి?

బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ (సీసీబీ) విభాగం ఏసీపీ ప్రభు శంకర్, ఇన్స్ పెక్టర్ లు అజయ్, నిరంజన్ కుమార్ రూ. 60 లక్షలు లంచం తీసుకుని అక్రమంగా సిగరెట్లు తరలించడానికి వ్యాపారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి రూ. 60 లక్షలు ఇవ్వాలని, తరువాత ఇంకా తమకు డబ్బులు ఇవ్వాలని ఈ ముగ్గురు పోలీసు అధికారులు వ్యాపారులను డిమాండ్ చేశారని తెలిసింది.

ఎక్కడో తేడా వచ్చింది, అంతే !

ఎక్కడో తేడా వచ్చింది, అంతే !

రూ. 60 లక్షలు లంచం ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలని పోలీసు అధికారులు డిమాండ్ చెయ్యడంతో అక్కడ పోలీసులకు, వ్యాపారులకు తేడా వచ్చిందని తెలిసింది. ఏసీపీ ప్రభుశంకర్, ఇన్స్ పెక్టర్లు నిరంజ్ కుమార్, సంజయ్ రూ. 60 లక్షలు లంచం తీసుకుని అక్రమంగా సిగరెట్లు తరలించడానికి అవకాశం ఇచ్చారని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ కు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ చాలా సీరియస్ అయ్యారు.

Recommended Video

Vande Bharat Mission: First Flight From Kuwait Arrive in Hyderabad With 163 Indians
ఉద్యోగాలు ఊడిపోయాయి

ఉద్యోగాలు ఊడిపోయాయి

రూ. 60 లక్షలు లంచం తీసుకుని అక్రమంగా సిగరెట్లు తరలించడానికి అవకాశం ఇచ్చారా ? అనే విషయంపై విచారణ చెయ్యాలని, వెంటనే నివేదిక సమర్పించాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ సీసీబీ విభాగం డీసీపీ రవికుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తి కావడంతో పోలీసు అధికారులు లంచం తీసుకున్నారని వెలుగు చూడటంతో ఇన్స్ పెక్టర్లు సంజయ్, నిరంజన్ కుమార్ లను సస్పెండ్ చేశారు. ఏసీపీ ప్రభుకుమార్ ను బదిలి చేసి మరోసారి విచారణకు ఆదేశాలు జారీ చేశామని, తప్పు చేసినట్లు రుజువు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

English summary
Lockdown: Bengaluru CCB Inspectors Suspended, base on dcp ravikumar report. Inspectors involving the cigarate Scam with dealers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X