• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lockdown: బాహుబలికే బావ, యమహా బైక్ లో 300 కిలోమీటర్ల స్పీడ్, ఫ్లైఓవర్ షేక్, బావలుసయ్యా ( వీడియో) !

|

బెంగళూరు/ ఎలక్ట్రానిక్ సిటీ: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు ప్రజలకు ప్రస్తుతం కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి భయం పట్టుకుంది. సిలికాన్ సిటీలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అనవసరంగా ఎవ్వరూ రోడ్ల మీదకు రాకూడాదని, వాహనాల్లో సంచరించరాదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే బెంగళూరు సిటీలోనే అతి పెద్ద ఫ్లైఓవర్ అయిన ఎక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఓ యువకుడు గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్ తో యమహా 1000 సీసీ బైక్ నడిపి ఇతర ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఇంతటితో వీడిపాటు ఊరికేవదిలేయలేదు. నేను బాహుబాలి బావ అంటూ బైక్ నడుపుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పాటుపడి బాహుబలి బావ బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు బావలుసైయ్యా.. సైసై అంటూ పోటుగాడికి మంచి మసాలా దోసె తినిపిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

బెంగళూరులో లాక్ డౌన్ జారీ

బెంగళూరులో లాక్ డౌన్ జారీ

సిలికాన్ సిటీలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో లాక్ డౌన్ విధించింది. అనవసరంగా ఎవ్వరూ రోడ్ల మీదకు రాకూడాదని, వాహనాల్లో సంచరించరాదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బెంగళూరు సిటీలోని, నగర శివార్లలోని అనేక ఫ్లైఓవర్లను పోలీసులు పూర్తిగా మూసివేశారు. అయితే ఐటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లే మార్గంలోని అతి పెద్ద ఫ్లై ఓవర్ ను మాత్రం పోలీసులు అలాగే వదిలిపెట్టారు.

త్రీ ఇన్ వన్ ఫ్లైఓవర్ అని వదిలేశారు

త్రీ ఇన్ వన్ ఫ్లైఓవర్ అని వదిలేశారు

ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచే తమిళనాడుకు, ఆ రాష్ట్రాంలోని హోసూరు ప్రాంతానికి వెళ్లడానికి అవకాశం ఉంది. ఇదే మార్గంలో మైసూరుకు వైళ్లే నైస్ రింగ్ రోడ్డు సైతం ఉండటంతో నిత్యం ఈ ఫ్లైఓవర్ మీద వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అత్యవసర పాస్ లు, పోలీసు వాహనాలు, ఆరోగ్య శాఖ, అంబులెన్స్ వాహనాలు మాత్రమే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద సంచరించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

 గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్

గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్

బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్న ఓ యువకుడు అతని యమహా 1000 సీసీ బైక్ తీసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు యమహా బైక్ లో సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ మీదకు వెళ్లిపోయాడు. అంతే ఒక్కసారిగా యువకుడికి ఊపు వచ్చేసింది. బైక్ ను గంటకు 300 కిలోమీటర్లు స్పీడ్ తో వాయువేగంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ మీద నడిపాడు. దెబ్బకు ఎంతోఎత్తులో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద యహహా బైక్ ఊగిపోయింది. అయినా ఆ యువకుడు మాత్రం బైక్ వేగం తగ్గించలేదు.

నేను బాహుబలి బావ

ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ మీద గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్ తో యహహా బైక్ నడిపిన యువకుడు ఆ సమయంలో బైక్ లో ముందు భాగంలో స్పీడోమీటర్ ఉన్న ప్రాంతంలో మొబైల్ పెట్టి ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలో బైక్ 299 కిలోమీటర్ల వేగంతో అటూఇటూ ఊగుతూ వెలుతున్న విషయం స్పష్టంగా వెలుగు చూసింది. చేసినపాపం ఊరికే పోదు అంటారు పెద్దలు, ఇక్కడ ఆ యువకుడి విషయంలో అదే జరిగింది. నేను హీరో, బాహుబలి బావ, నేను 300 కిలోమీటర్ల స్పీడ్ తో బైక్ నడిపాను, గాల్లో తేలిపోయిన్లు ఉంది, మీరు చూడండి అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యింది.

బావలు సయ్యా..... సైసై

బావలు సయ్యా..... సైసై

సోషల్ మీడియాలో యువకుడు గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్ తో బైక్ నడిపాడని తెలుసుకున్న నెటిజన్లు బెంగళూరు సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడు ఎదుటివారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాహనాలు ఎదుట వస్తున్నా, పక్కనా వెలుతున్నా బైక్ స్పీడ్ మాత్రం తగ్గించలేదనే విషయం ఆ వీడియోలో స్పష్టంగా కనపడింది. విషయం తెలుసుకుని యువకుడి కోసం గాలించి అతన్ని అరెస్టు చేశామని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ విభాగం (CCB) సీనియర్ అధికారి సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.

మసాలా దోసె బాగుందా ?

మసాలా దోసె బాగుందా ?

యువకుడిని అరెస్టు చేసి అతని యమహా 1000 సీసీ బైక్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి బెంగళూరు ట్రాఫిక్ విభాగం పోలీసులకు అప్పగించామని ఐపీఎస్ అధికారి సందీప్ పాటిల్ ట్వీట్ చేశారు. మొత్తం మీద పోటుగాడు తాను బాహుబలి బావ అంటూ పాటుపడి ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయాడు. బైక్ లో పాటుపడి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడిన పోటుగాడికి పోలీసులు మాడిపోయిన మసాలా దోసె తినిపిస్తున్నారు.

English summary
Lockdown: Bengaluru CCB police arrested a person who rode a Yamaha bike at 300 kmph Speed on Electronic city flyover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X