• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

College girl: బీజేపీ లీడర్, బాషా సినిమాలో రజనీకాంత్ టైప్ లో బిల్డప్, రేప్ చేసి పిల్లిలాగా !

|

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో ఇంట్లో ఉంటున్న ఇంటర్ అమ్మాయి మీద ఓ కామాంధుడి కన్ను పడింది. బాష సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో అతను ఇన్ని రోజులు ఫోజులు కొట్టేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను ఇదే కత్తితో పొడిచి చంపేస్తానని ఆ కామాంధుడు అమ్మాయిని బెదిరించి పరారైనాడు. జాతీయ పార్టీలో లీడర్ అయిన కామాంధుడిని వెంటాడిని పోలీసులు చివరికి పిల్లిలాగా దాక్కొని ఉన్న అతన్ని పట్టుకుని బెండ్ తీస్తున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 పేద కుటుంబం

పేద కుటుంబం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని కొలుమేడు ప్రాంతంలోని అవడిలో ఓ పేద కుటంబానికి చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. అవడి ప్రాంతంలోని ఓ కాలేజ్ లో ఆ అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కూలిపనులు చేస్తూ ఆ దంపతులు కష్టపడి కుమార్తెను చదివించుకుంటున్నారు.

 బాషా సినిమా హీరో టైప్ లో బిల్డప్

బాషా సినిమా హీరో టైప్ లో బిల్డప్

చెన్నైలోని చెంకుడ్రం ప్రాంతంలో శ్రీనివాసన్ (45) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. భారతీయ జనతా పార్టీ (BJP)కి అనుబంధ సంస్థ అయిన ఆటో యూనియన్ లో శ్రీనివాసన్ ఓ లీడర్. ఆటో డ్రైవర్ అయిన శ్రీనివాసన్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాషా సినిమా స్టైల్లో బిల్డప్ లు ఇస్తూ తిరుగుతున్నాడు. తాను పొలిటికల్ లీడర్, నేను ఆటో యూనియన్ లీడర్ అంటూ శ్రీనివాసన్ అతని చెమ్చాల దగ్గర రెచ్చిపోయేవాడు.

 కాలేజ్ అమ్మాయిపై కన్ను

కాలేజ్ అమ్మాయిపై కన్ను

లాక్ డౌన్ కారణంగా కాలేజ్ మూసివేయడంతో ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నది. ఈనెల 4వ తేదీన తల్లిదండ్రులు పనులుకు వెళ్లడంతో అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. చాలా రోజుల నుంచి అమ్మాయి మీద కన్ను వేసిన శ్రీనివాసన్ యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తితో బెదిరించిన శ్రీనివాసన్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, బయట వ్యక్తులకు చెప్పినా నిన్ను ఇదే కత్తితో పొడిచి చంపేస్తానని, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంటూ శ్రీనివాసన్ ఆమెను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

  COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
   పిల్లిలాగా దాక్కొన్నాడు

  పిల్లిలాగా దాక్కొన్నాడు

  రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు శ్రీనివాసన్ తన మీద అత్యాచారం చేశాడని చెప్నిన కాలేజ్ అమ్మాయి బోరున విలపించింది. అమ్మాయి తల్లిదండ్రులు అవడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆటో యూనియన్ లీడర్ పిల్లిలాగా స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి శ్రీనివాసన్ కోసం గాలించిన పోలీసులు శనివారం అతను ఉన్న ప్రాంతం గుర్తించి పట్టుకుని బెండ్ తీస్తున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెన్నై పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు శ్రీనివాసన్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెన్నైలోని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

  English summary
  lockdown: BJp leader and auto driver arrested for raping 16 year girl in Chennai in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X