బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown Cheating: యువతికి వీధి కుక్క మీద ప్రేమ, హెల్ప్ లైన్ కు ఫోన్, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలు కావడంతో ఇంటిలో ఉన్న ఓ యువతికి ఓ సమస్య వెతుక్కుంటూ వచ్చింది. అనారోగ్యంతో వీధిలో ఓ ఉన్న ఓ కుక్కకు సహాయం చెయ్యడానికి వెళ్లిన ఆ యువతి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయ్యింది. కుక్క అనారోగ్యంగా ఉందని ఓ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన యువతి ఫోన్ నెంబర్ కు వచ్చిన అఫ్లికేషన్ పూర్తి చేసి పంపించడంతో సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేశారు. మోసపోయామని విషయం తెలుసుకున్న ఆ యువతి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

లాక్ డౌన్ తో ఇంట్లో !

లాక్ డౌన్ తో ఇంట్లో !

ఐటీ బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో సైబర్ నేరాలకు కొదవలేదనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దాదాపు అందరు ఉద్యోగులు వారి ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరులోని చామరాజపేట్ లో నివాసం ఉంటున్న 25 ఏళ్ల యువతి లాక్ డౌన్ సందర్బగా ఇంట్లోనే ఉంది.

వీధిలో కుక్కను వదిలేసిన యజమాని

వీధిలో కుక్కను వదిలేసిన యజమాని

ఖరీదైన ల్యాబ్రెడార్ కుక్కకు సరిగా కళ్లు కనపడకపోవడంతో లాక్ డౌన్ సందర్బంగా ఇదే మంచి చాన్స్ అంటూ దాని యజమాని ఆ కుక్కను చామరాజపేట్ లోని రోడ్లో వదిలేసి వెళ్లిపోయాడు. కళ్లు సరిగా కనపడకపోవడం, ఆహారం లేకపోవడంతో ఆ కుక్క యువతి నివాసం ఉంటున్న ఇంటి ముందే లోబోదిబో అంటూ అక్కడక్కడే తిరిగింది. జంతు ప్రేమికురాలు అయిన ఆ యువతి కుక్క మీద జాలిపడింది.

హెల్ప్ లైన్ కు ఫోన్

హెల్ప్ లైన్ కు ఫోన్

వీధిలో తిరుగుతున్న కుక్క భాదను చూసి తట్టుకోలేని ఆ యువతి రెండు రోజులు దానికి ఆహారం పెట్టింది. ఆ కుక్క సక్రమంగా ఆహారం తినకపోవడంతో మరింత అనారోగ్యానికి గురైయ్యింది. కుక్క పరిస్థితి చూసి తల్లడిల్లిపోయిన ఆ యువతి ఆన్ లైన్ లో జంతు సంరక్షణ కేంద్రానికి చెందిన 24x7 వెబ్ సైట్ నెంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

చికిత్స ఫ్రీ, అంబులెన్స్ కు రూ. 5 వేలు

చికిత్స ఫ్రీ, అంబులెన్స్ కు రూ. 5 వేలు

మీ వీధిలో ఉన్న కుక్కకు తాము ఫ్రీగా చికిత్స చేస్తామని, అయితే ఆ కుక్కను మా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కు రూ. 5 వేలు చెల్లించాలని ఆ వెబ్ సైట్ నిర్వహకులు చెప్పారు. రూ. 5 వేలు పోతేపోని, కుక్క ప్రాణాలతో ఉంటుందని బావించిన ఆ యువతి తాను ఆ డబ్బు చెల్లిస్తానని వైబ్ సైట్ నిర్వహకులకు చెప్పింది.

అయ్యో పాపం అంటే !

అయ్యో పాపం అంటే !

వైబ్ సైట్ నిర్వహకులు మొబైల్ కు పంపించిన ఒక అఫ్లికేషన్ లో యువతి పేరు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ తో పాటు పూర్తి వివరాలు భర్తీ చేసి గూగుల్ పే ద్వారా రూ. 5 వేలు ఆ వెబ్ సైట్ చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు పంపించింది. నగదు పంపించిన తరువాత కూడా ఆ కుక్కను తీసుకుపోవడానికి అంబులెన్స్ కాని, మనుషులు కాని ఎవ్వరూ రాకపోవడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది.

జీతం ఖాళీ, జీరో బ్యాలెన్స్ !

జీతం ఖాళీ, జీరో బ్యాలెన్స్ !

యువతి ఇంటి సమీపంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసింది. అంతే ఆ యువతి మైండ్ బ్లాక్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం తన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయిన జీతం రూ. 18, 389 తో పాటు అంతకు ముందు బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయ్యిందని తెలుసుకుని బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్విని అనే వ్యక్తి అకౌంట్ కు ఆ యువతి బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు బదిలి అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. యువతి ఫిర్యాదు చేసిన వెబ్ సైట్ నుంచే ఇటీవల ఓ వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 40 వేలు నగదు బదిలి అయ్యిందని, అది ఓ నకిలి వెబ్ సైట్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కుక్కకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించిన యువతి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కావడంతో ఆమె లబోదిబో అంటోంది.

English summary
Lockdown Cheating: 25 year old women and animal lover lost money after calling to fake animal rescue helpline at Chamarajpet, Bengaluru. Police registered the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X