వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... లిక్కర్ కోసం మనస్థాపం.. వ్యక్తి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి నానా తిప్పలు పడుతున్నాయి ప్రభుత్వాలు . అయినా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు వస్తున్న నేపధ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు షట్ డౌన్ కొనసాగనుంది . నిత్యావసరాలు , కూరగాయలు మినహాయించి మరే ఇతర వస్తువులు దొరకని పరిస్థితి .

మద్యం దుకాణాలు బంద్ చెయ్యటంతో అత్మహత్యాయత్నాలు

మద్యం దుకాణాలు బంద్ చెయ్యటంతో అత్మహత్యాయత్నాలు

నిత్యావసరాలను అందించే షాపులు మినహాయించి మిగతా అన్నీ మద్యం షాపులతో సహా బంద్ చెయ్యటంతో లిక్కర్ లేక ఉండలేని వారు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. దీంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . దేశ వ్యాప్తంగా దాదాపు మద్యం దుకాణాలన్నీ లాక్ డౌన్ నేపధ్యంలో మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. చుక్క దొరక్క తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు .ఇక మద్యానికి బానిసైన వారు ఏకంగా ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

మద్యానికి బానిసై కేరళలో వ్యక్తి మృతి

మద్యానికి బానిసై కేరళలో వ్యక్తి మృతి

ఇక తాజాగా కేరళకు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి మద్యం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటి వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు . రాష్ట్రంలోని తువ్వనూర్‌‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి ఇతర కుటుంబ కారణాలతో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితయ్యారని, ఇక అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుందని ఇక అతనికి ఎక్కడ కూడా ఉద్యోగం రాకపోవటంతో అతను మద్యానికి బానిసయ్యాడని తెలిపారు .

 మద్యం దొరక్క డిప్రెషన్ కు గురవుతున్న మందుబాబులు

మద్యం దొరక్క డిప్రెషన్ కు గురవుతున్న మందుబాబులు

ఈ నేపథ్యంలోనే మద్యం దొరక్కపోవటంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది.ఇప్పటికే మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మద్యం దొరక్క కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. నిత్యం తాగటం అలవాటైన వారు తాగకుండా ఉండలేకపోతున్నారు. దీంతో మందుబాబుల కుటుంబ సభ్యులు సైతం వారికి లిక్కర్ అందించే ఏర్పాటు చెయ్యాలని , లేకుంటే తమను హింసించి చంపుతారని లబోదిబోమంటున్నారు. ఇక కొంతమంది లిక్కర్ దొరక్క ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

English summary
Recently, a 38-years man from Kerala committed suicide for alcohol. He hung to a tree at his house and took his life. Locals said the man who committed suicide on Friday morning in Tuvanur was also suffering from other family reasons. He addicted to alcohol and went into depression and committed suicide .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X