• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. దశాబ్దాల తర్వాత బీహార్ వాసులకు కనువిందు చేస్తున్న మౌంట్ ఎవరెస్ట్

|

కరోనా వైరస్ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. ఇక ఈ లాక్ డౌన్ కారణంగా మనుషుల పరిస్థితి ఎలా ఉన్నా వాతావరణంలో మాత్రం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కాలుష్య స్థాయిలు బాగా తగ్గాయి . ఇక ఈ నేపధ్యంలో బ్యూటీఫుల్ మౌంట్ ఎవరెస్ట్ బీహార్ వాసులకు కనువిందు చేసింది. కొన్ని దశాబ్దాల క్రితం కనిపించిందని పెద్దలు చెప్పిన ఎవరెస్ట్ శిఖరం ఇప్పుడు లాక్ డౌన్ తో కాలుష్యం తగ్గి తిరిగి కనిపించటంతో బీహార్ వాసులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు .

కనువిందు చేస్తున్న లాక్ డౌన్ అద్భుతాలు ....చెంగు చెంగున గెంతుతూ స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు

 భారీగా తగ్గినా కాలుష్యం ... అద్భుతంగా దర్శనమిస్తున్న మౌంట్ ఎవరెస్ట్

భారీగా తగ్గినా కాలుష్యం ... అద్భుతంగా దర్శనమిస్తున్న మౌంట్ ఎవరెస్ట్

లాక్ డౌన్ తో పొల్యూషన్ బాగా తగ్గింది. పొల్యూషన్ వల్ల దశాబ్దాల కాలంగా కనబడని వందల కిలోమీటర్ల దూరంలోని హిమాలయాలను ఇప్ప్దుదు పలు రాష్ట్రాల ప్రజలు చూడగలుగుతున్నారు . లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బీహార్ లో కూడా గాలి కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మొన్నటికి మొన్న మూడు దశాబ్దాలలో మొదటిసారిగా ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌‌ వాసులకు 200 కిలో మీటర్ల ఏరియల్ డిస్టెన్స్ లో ఉన్న గంగోత్రి, బంద్రాపంచ్‌ పర్వాతాలు కన్పించి కనువిందు చేశాయి .

దశాబ్దాల క్రితం ఎవరెస్ట్ ను చూసినట్టు చెప్పిన పూర్వీకులు

దశాబ్దాల క్రితం ఎవరెస్ట్ ను చూసినట్టు చెప్పిన పూర్వీకులు

ఇక పంజాబ్ లోని జలంధర్ సిటీ ప్రజలు దశాబ్దాల తర్వాత 160కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ లోని మంచుతో కప్పబడిన దౌలాదర్ హిమాలయ రేంజ్ ను చూడగలిగారు . ఇక ఇప్పుడు బీహార్‌ లోని సీతామర్హి జిల్లాలో సింగ్‌వాహిని అనే గ్రామ ప్రజలు ఎవరెస్ట్ శిఖరం చూస్తున్నారు . దాదాపు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉన్న పర్వత శ్రేణి చాల చక్కగా ఆ గ్రామస్థులకు కనువిందు చేస్తుంది. అంత దూరంలో ఉన్న ఎవరెస్ట్ చూస్తామని వారు అసలు భావించలేదు. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత పొల్యూషన్ లేకపోవడంతో సింగ్ వాహిని గ్రామస్థులు సృష్టంగా ఎవరెస్ట్ పర్వతాన్ని చూడగల్గుతున్నారు. ఎప్పుడో దశాబ్దాలక్రితం తమ తాత ముత్తాతలు చూసిన ఎవరెస్ట్ పర్వతాన్ని అక్కడి ప్రజలు ఇప్పుడు మళ్లీ చూడగలగటం విశేషం .

ఎవరెస్ట్ ఫోటో తీసి ట్విట్టర్ లో షేర్ చేసిన బీహార్ సామాజిక కార్యకర్త

ఎవరెస్ట్ ఫోటో తీసి ట్విట్టర్ లో షేర్ చేసిన బీహార్ సామాజిక కార్యకర్త

ఇక ఈ అద్భుతమైన ఎవరెస్టును చూసి ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్థానికులు ఎంతో ఆనందపడుతున్నారు. సింగ్‌వాహిని గ్రామానికి చెందిన రీతూ జైస్వాల్ అనే సామాజిక కార్యకర్త తీసిన ఎవరెస్ట్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది . మంచు పరదా కప్పుకుని ప్రకృతి అందాల అద్భుతమైన ఎవరెస్ట్ శిఖరం అందులో కనిపిస్తోంది. తన గ్రామం నుండి హిమాలయ శిఖరం యొక్క జూమ్-ఇన్ చిత్రాన్ని పంచుకుంటూ, జైస్వాల్ తన టెర్రస్ నుండి చూడగలనని రాశారు.

ప్రకృతి తనను తాను సమతుల్యం చేస్తుందని పేర్కొన్న రీతూ

"ప్రకృతి తనను తాను సమతుల్యం చేసుకుంటోంది" అని ఆ మహిళ హిందీలో రాసింది. నేపాల్కు దగ్గరగా ఉన్న హిమాలయ శ్రేణిలోని దిగువ పర్వతాలు కొన్నిసార్లు భారీ వర్షాలు మరియు స్పష్టమైన ఆకాశం తరువాత గ్రామం నుండి కనిపిస్తాయని ఆమె చెప్పింది, యుగాలలో మొదటిసారి ఎవరెస్ట్ కనిపించడం రీతూ పేర్కొన్నారు . భౌగోళికంగా, బీహార్‌లోని సీతామార్హి జిల్లా రాష్ట్రంలోని తిర్హత్ విభాగంలో భాగం . ఇది ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం, సీతామార్హి మరియు ఎవరెస్ట్ పర్వతం మధ్య దూరం సుమారు 205 కిమీ మరియు ఈ గ్రామం నుండి వైమానిక దూరం సుమారు 194 కిమీ గా ఉంది .

English summary
One positive impact of the lockdown has been a drastic drop in pollution levels around the world, including in India. As a fallout, people have been able to see distant things, like snow-capped mountains, from plains. Recently, people in Bihar reportedly woke up to seeing the world’s highest mountains from their village in Sitamarhi district.A picture of Mount Everest, taken from a house in Singhwahini village in the district, is going viral on social media. The picture got everyone talking online after it was shared by Ritu Jaiswal, Mukhiya of Gram Panchayat Singhwahini on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X