వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... జనసంచారం లేక, తిండి దొరక్క వీధి కుక్కలకు తప్పని పాట్లు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇండియాను వణికిస్తుంది. ఎప్పుడు, ఎవరు కరోనా బాధితులుగా మారతారో అర్ధం కాని పరిస్థితి .అది అలా ఉంచితే కరోనా ఎఫెక్ట్ జంతువుల మీద కూడా పడింది. ముఖ్యంగా వీధి కుక్కలు కరోనా ప్రభావంతో ఆహారం దొరక్క ,ఏం జరుగుతుందో అర్ధం కాక కన్ఫ్యూజన్ కు గురవుతున్నాయి. అంతేకాక కరోనా వైరస్ వ్యాపించకుండా చల్లుతున్న బ్లీచింగ్ పౌడర్ , శానిటైజర్ దెబ్బకు చనిపోతున్న పరిస్థితి ఉంది.

పులికి కరోనా వచ్చింది! ముందు చూపుతో మేకలకు మాస్కులు వేశాడు!!పులికి కరోనా వచ్చింది! ముందు చూపుతో మేకలకు మాస్కులు వేశాడు!!

 దారుణంగా మారిన వీధి కుక్కల పరిస్థితి

దారుణంగా మారిన వీధి కుక్కల పరిస్థితి

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్రం 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ప్రకటించిన సమయంలో జనాలు ఇళ్లకే పరిమితం కావటం ఎవరూ రోడ్లమీద తిరగకపోవటం వెరసి వీధి కుక్కల పరిస్థితి దారుణంగా తయారైందని యానిమల్ యాక్టివిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .మన దేశంలో 130 కోట్ల జనాభాతో పాటు సుమారు 40 లక్షల వీధి కుక్కలు జీవిస్తున్నట్టు ఒక అంచనా . నిన్నా మొన్నటి దాకా జానాలతో పాటు జీవనం సాగించిన వీధి కుక్కలు ఒక్క సారిగా కరోనా దెబ్బకు ఖంగు తిన్నాయి .

కుక్కల ప్రవర్తనలో మార్పులు .. తిండి కోసం కుక్కల కొట్లాట

కుక్కల ప్రవర్తనలో మార్పులు .. తిండి కోసం కుక్కల కొట్లాట

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా జనం రోడ్లపై తిరగకపోవటంతో కొన్ని వీధి కుక్కలు కన్ఫ్యూజన్‌లోకి వెళ్ళి ఆ కుక్కల ప్రవర్తనలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని ఢిల్లీకి చెందిన యానిమల్ బిహేవియర్ అనలిస్ట్ ఒకరు పేర్కొన్నారు.ఇక మరోపక్క లాక్ డౌన్ నేపధ్యంలో బయట హోటళ్ళు, టిఫిన్ బండ్లు వంటివి కూడా ఎవరూ నిర్వహించటం లేదు . దీంతో ఆహార కొరత ఏర్పడటంతో ఉన్న కొంచెం తిండి కోసం వీధి కుక్కల మధ్య కొట్లాటలు సాగుతున్నాయి.

తిండిలేక కొన్ని, రసాయనాలు చల్లటంతో కొన్ని కుక్కలు మృతి

తిండిలేక కొన్ని, రసాయనాలు చల్లటంతో కొన్ని కుక్కలు మృతి

కొన్ని కుక్కలు తిండి లేక మృత్యు వాత పడుతుంటే, కొన్ని కుక్కలు కరోనా వైరస్ జనాలకు ప్రబలకుండా చల్లుతున్న రసాయనాల దెబ్బకు మృతి చెందుతున్నాయి. మనుషులపైనే ఆధారపడి జీవించే వీధి కుక్కల పరిస్థితి ఈ సమయంలో చాలా బాధాకరంగా తయారైంది. మరోవైపు కొన్ని నగరాల్లో అయితే కుక్కలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాయి. పట్టెడన్నం పెట్టే వాళ్ళు లేక ఏది కనిపిస్తే అది తిని చాలా వరకు అనారోగ్యం పాలవుతున్నాయి. ఎండాకాలం కావటంతో పాటు ఆహారం దొరకని దుర్భిక్ష పరిస్థితులు కరోనా వైరస్ వల్ల కుక్కలకు కూడా వచ్చింది. ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివెయ్యకుంటే పెద్ద సంఖ్యలో కుక్కలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది.

English summary
Corona virus trembles India . Don't know When and who does not become a victim of corona. Street dogs, in particular, are under the influence of corona to get food and not to understand what is happening. In addition, there is a dying condition of dogs becausse of bleaching powder and sanitizer that is used to not spread by corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X