వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడాని చెయ్యడానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విషయంలో ముందుగా సరైన నిర్ణయాలు తీసుకోలేదని కొందరు ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు (మే 12వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేని ఓ వర్గం ఆయనపై దుష్ప్రచారం మొదలు పెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడక ముందు ఎలా మేకప్ వేసుకుంటున్నారో చూడండి ? అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని విడుదల చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు మేకప్ వేసుకున్నారు ? ఆ వీడియో ఎప్పుడు తీశారు ? అనే చర్చ మొదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ పాత వీడియో విడుదల చేసింది ఎవరో తెలిస్తే తరువాత అసలు కథ మొదలౌతుందని బీజేపీ నాయకులు అంటున్నారు.

Coronavirus: కరోనా కట్టడిలో ప్రపంచంలోనే మోదీ గ్రేట్, బెస్ట్ సీఎం ఎవరంటే?, కేసీఆర్, సర్వేలో షాక్ !Coronavirus: కరోనా కట్టడిలో ప్రపంచంలోనే మోదీ గ్రేట్, బెస్ట్ సీఎం ఎవరంటే?, కేసీఆర్, సర్వేలో షాక్ !

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

లాక్ డౌన్ గడుపు ముగుస్తున్న సమయంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. భారతీయులతో పాటు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారో ? అంటూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించక ముందే ఓ వర్గం వారు ఆయన మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు.

ప్రధాని మేకప్ పై దుష్ప్రచారం

ప్రధాని మేకప్ పై దుష్ప్రచారం

దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి సిద్దం అయిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు ముందు ఎలా మేకప్ వేసుకుంటున్నారో చూడండి ? అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ మహిళ మేకప్ చెయ్యడం, మరో మహిళ వీడియో తిస్తున్న విషయం స్పష్టంగా కనపడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే మంగళవారం రాత్రి ఇలా మేకప్ వేసుకున్నారా ? అనే అనుమానం కొందరిలో మొదలైయ్యింది. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో విషయంపై జోరుగా చర్చ జరిగింది.

పాత వీడియోతో పనికిమాలిన పని

మైనపు బొమ్మల ప్రదర్శనలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ది చెందినది అనే విషయం తెలిసిందే. ప్రపంచ రాజకీయాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ముఖ్యమైన నాయకుడని, ఆయన మైనపు బొమ్మలు తయారు చేసి లండన్, సింగపూర్ ,హాంగ్ కాంగ్, బ్యాంకాక్ ల్లోని మ్యూజియంలో ఆవిష్కరిస్తామని మేడమ్ టుస్సాడ్స్ సంస్థ 2016 మార్చి నెలలో తెలిపింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మైనపు బొమ్మ తయారీ కోసం ఆయన కొలతలు తీసుకున్నామని ఆ సంస్థ చెప్పింది. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీకి మేకప్ చేయించి కొలతలు తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను ఇప్పుడు విడుదల చేశారు.

45 సెక్షన్ల వీడియోతో నీచ రాజకీయం

45 సెక్షన్ల వీడియోతో నీచ రాజకీయం

2016లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మైనపు బొమ్మలు చెయ్యడానికి కొలతలు తీసుకుంటున్న సమయంలో మేకప్ వేస్తున్న సందర్బంలో తీసిన 45 సెకన్ల వీడియోను లాక్ డౌన్ సమయంలో విడుదల చేసి నీచ రాజకీయాలు చెయ్యడానికి కొందరు ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli
అంతకంటే పని ఏముంది !

అంతకంటే పని ఏముంది !

లాక్ డౌన్ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించే గంట ముందు ఈ వీడియో విడుదల చేసి రాజకీయ లబ్ధిపొందడానికి కొందరు ప్రయత్నించారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారని, ఆయన పనితీరుపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. కొందరు పనిపాట లేకుండా ఇలాంటి నీచరాజకీయాలు చెయ్యడడానికి ఈ వీడియో విడుదల చేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో తీసుకున్న వీడియో ఇప్పుడు విడుదల కావడంతో అది వైరల్ అవుతోంది.

English summary
Lockdown Fake video: Prime Minister in a grand make up session. The video shoot in when PM Modi met Madame Tussauds artistes in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X