వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: సైకిల్ ఎక్కిన పాపానికి ఎఫ్ఐఆర్, బస్తీమే సవాల్, షాక్, సైకిల్ భలే తొక్కాడు కదా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ భోపాల్: దేశంలో ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించి ఇప్పుడు వరుసగా 17 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే సామాన్య ప్రజల మీద పన్ను రూపంలో అధాయం వచ్చేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రి, జాతీయ పార్టీ టాప్ లీడర్ సైకిల్ ఎక్కిన పాపానికి కేసు నమోదు అయ్యింది. సైకిల్ పై నిరసన వ్యక్తం చేసి బస్తీ మే సవాల్ అంటూ రెచ్చిపోయిన టాప్ లీడర్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో ప్రముఖ పార్టీ నేతలు షాక్ కు గురైనారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

17 రోజులు సినిమా

17 రోజులు సినిమా

భారతదేశంలో గత 17 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మొదలు పెట్టాయి. 17 రోజుల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ రావడంతో సామాన్య ప్రజలకు చుక్కలు కనపడ్డాయి. ఇదే సమయంలో ఈ రోజు... రేపు.... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు ప్రతిరోజు ఎదురు చూశారు. అయితే 17 రోజుల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలకు తాత్కాలికంగా బ్రేక్ లు పడ్డాయి.

ప్రజలపై భారం !

ప్రజలపై భారం !

కరోనా వైరస్ దెబ్బకు మార్చి 25వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. లాక్ డౌన్ దెబ్బకు సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యింది. ఇదే సమయంలో లాక్ డౌన్ 5.0 సడలింపులతో సామాన్య ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలపై భారం పడిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి..

సైకిల్ ఎక్కిన టాప్ లీడర్

సైకిల్ ఎక్కిన టాప్ లీడర్

కేంద్ర ప్రభుత్వం కావాలనే సామాన్య ప్రజలపై భారం మోపడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (డిగ్గి రాజా) ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సైకిల్ బాగా తొక్కారు కదా!

సైకిల్ బాగా తొక్కారు కదా!

కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికే కేంద్ర ప్రభుత్వం 17 రోజుల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

లడ్డూ కావాలా నాయనా లడ్డూ!

లడ్డూ కావాలా నాయనా లడ్డూ!

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎక్కువ మంది గుమికూడటం నేషేధమని, నిరసన ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని నియమాలు అమలులో ఉన్నా కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ వందలాది మందితో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారని మధ్యప్రదేశ్ పోలీసులు ఆరోపించారు. వందలాది మంది గుమికూడి కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడానికి కారణం అయ్యారని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ తో పాటు సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీ నేతల మీద భోపాల్ పోలీసులు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిగ్గిరాజా దిగ్విజయ్ సింగ్ మీద కేసు నమోదు కావడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ కు గురైనారు.

English summary
Lockdown: FIR Registered Against Congress Leader Digvijaya Singh And 150 Other Party Workers in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X