వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: కరోనా అంటే భయం లేదు, రచ్చబండలో మీటింగ్, రాత్రి దెయ్యం హల్ చల్, వీడియో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ భువనేశ్వర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసినా ప్రజలు మాత్రం విచ్చలవిడిగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీద సంచరించినా, సామాజిక దూరం పాటించకపోయినా కరోనా వైరస్ మమమ్మారి దెబ్బకు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని పభుత్వాలు, అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలకు చెప్పిచెప్పి విసిగిపోయిన గ్రామ పంచాయితీ పెద్దలు చివరికి దెయ్యాలను ఆశ్రయించారు. పదేపదే రోడ్ల మీదకు వచ్చి ఊరు మొత్తం తిరిగేస్తూ రచ్చబండ మీద మీటింగ్ లు పెడుతున్న వారికి తగిన బుధ్ది చెప్పడానికి దెయ్యాలను రంగంలోకి దింపారు. మీరు దెయ్యాలను కాదు కదా, భూతాలను, చివరికి కరోనాను కంటి ముందు నిలబెట్టినా మేము మాత్రం మారం అంటున్నారు ప్రజలు.

Lockdown: కూరగాయల లారీలో వెళ్లిన కంప్యూటర్ ఆపరేటర్, కరోనా పాజిటివ్, లేడీ దెబ్బకు 82 మందికి !Lockdown: కూరగాయల లారీలో వెళ్లిన కంప్యూటర్ ఆపరేటర్, కరోనా పాజిటివ్, లేడీ దెబ్బకు 82 మందికి !

భారత్ లో కరోనా మహమ్మారి

భారత్ లో కరోనా మహమ్మారి

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం హడలిపోతున్నది. సోమవారం సాయంత్రానికి దేశంలో 67, 152 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా కాటుకు ఇప్పటి వరకు 2, 206 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 20, 917 మంది కరోనా వైరస్ తో పోరాటం చేసి వ్యాధి నయం చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.

ఒడిశా ప్రభుత్వం సీరియస్

ఒడిశా ప్రభుత్వం సీరియస్

దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒడిశాలో కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసులు చాలా తక్కువగానే ఉన్నాయి. ఒడిశాలో ఇప్పటి వరకు 377 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం ముగ్గురు మాత్రమే ఆ వ్యాధితో మరణించారు. అయినా ఒడిశాలో ఒక్క కరోనా వైరస్ కూడా ఉండకూడదని అక్కడి ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది.

విసిగిపోయిన గ్రామ పెద్దలు

విసిగిపోయిన గ్రామ పెద్దలు

ఒడిశాలోని ఓ గ్రామంలో నిత్యం పదేపదే ప్రజలు రోడ్ల మీదకు రావడం, ఊరి మధ్యలోని రచ్చబండ మీద పంచాయితీలు పెట్టడం చేస్తున్నారు. గ్రామంలో, రోడ్ల మీద అనవసరంగా పదేపదే తిరగకూడదని, కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని గ్రామ పంచాయితీ పెద్దలు ఊరి ప్రజలకు చెప్పారు. అయితే ఊరి ప్రజలు ఏ మాత్రం పట్టించుకోకుండా పదేపదే రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టారు. గ్రామ ప్రజల తీరుతో ఆ గ్రామ పంచాయితీ పెద్దలు విసిగిపోయారు.

దెయ్యాలు రోడ్ల మీదకు వస్తే

గ్రామ ప్రజల తీరుతో విసిగిపోయిన గ్రామ పెద్దలు ఓ వ్యక్తికి నలుపు రంగు చీర కట్టారు. దెయ్యం ఎలా ఉంటుందో అలాగే అతని ముఖానికి మేకప్ వేశారు. కాళ్లకు గజ్జెలు కట్టి గ్రామంలోని రోడ్ల మీదకు తీసుకువచ్చారు. చేతిలో నిప్పుల కుంపటి పెట్టుకున్న దెయ్యం వేషధారి గ్రామంలోని రోడ్ల మీద తిరుగుతూ కరోనా వైరస్ జాగ్రత్తగా ఉండాలని, రోడ్ల మీదకు అనవసరంగా రాకూడదని ప్రచారం చేయించారు. ఒడిశాలోని గ్రామంలో దెయ్యం వేషంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కరోనాను కంటి ముందు నిలబెట్టి చూడు ?

కరోనాను కంటి ముందు నిలబెట్టి చూడు ?

దెయ్యం వేషంతో రోడ్ల మీదకు వచ్చిన వ్యక్తిని చూసిన గ్రామస్తులు భలే కామిడీగా ఉంది కదా ? అంటూ నవ్వుకున్నారే తప్పా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. మీరు కరోనాను కంటి ముందు నిలబెట్టి చూడండి, దాని కథ మేమే చూస్తాం అంటూ గ్రామంలోని అల్లరిమూకలు రెచ్చిపోతున్నారు. దెయ్యాలు కాదు కదా భూతాలను పిలుచుకుని వచ్చినా మా తీరు మారదు అంటూ కొందరు పదేపదే రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

English summary
Lockdown: Ghost that roams around the streets at night warning people to stay indoors in Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X