వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown:ఆన్ లైన్ క్లాసులు బ్యాన్, అధిక ఫీజులు అంటే ప్రిన్సిపాల్,టీచర్ల తోలు తీస్తాం,సీఎం వార్నింగ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దేశంలో లాక్ డౌన్ అమలు కాకముందే దేశంలోని దాదాపు అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకు విద్యాసంస్థలు మూతపడటంతో కొంతకాలం నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఆన్ లైన్ లో క్లాసులు ఎవ్వరూ నిర్వహించకూడదని, అలాగే విద్యార్థుల కుటుంబ సభ్యుల నుంచి ఆన్ లైన్ క్లాసుల కోసం ఫీజులు వసూలు చేస్తే ప్రిన్సిపాల్, టీచర్ల తోలు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంతో పాటు విద్యాశాఖా మంత్రి విద్యాసంస్థల యాజమాన్యంకు వార్నింగ్ ఇచ్చారు.

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?

ఫీజుల కోసం టార్చర్ ?

ఫీజుల కోసం టార్చర్ ?

లాక్ డౌన్ అమలు అయినప్పటి నుంచి దేశంలోని అనేక ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్ననారని అనేక ఆరోపణలు ఉన్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ఆధాయం లేక, పనులు లేక అల్లాడుతున్న కుటుంబ సభ్యులకు వారి పిల్లల చదువు, వాటి ఫీజుల విషయంలో పెద్ద తలనొప్పి ఎక్కువ అయ్యిందని ప్రభుత్వాలకు పలు ఫిర్యాదులు అందాయి.

ఎల్ కేజీకి రూ. లక్షలు లక్షలు

ఎల్ కేజీకి రూ. లక్షలు లక్షలు

కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరు నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. బెంగళూరులో అయితే దాదాపు చాలా విద్యాసంస్థలు ఎల్ కేజీ, యూకేజీలకే ఒక్కొక్కరి నుంచి రూ. లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారని తెలిసిందే. ప్రైవేట్ స్కూల్స్ తీరుపై అనేక మంది కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి లాక్ డౌన్ సందర్బంగా పలు ఫిర్యాదు చేశారు.

సీఎం, మంత్రి సీరియస్

సీఎం, మంత్రి సీరియస్

ప్రైవేట్ స్కూల్స్ పై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆన్ లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వేల మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చెయ్యడంతో విచారణ కమిటి వేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల విచారణలో ప్రైవేట్ స్కూల్స్ పైచాచికం బట్టబయలు అయ్యింది.

7వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాస్ లు బంద్

7వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాస్ లు బంద్

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆన్ క్లాస్ లు నిర్వహించకూడదని, విద్యార్థుల కుటుంబ సభ్యుల నుంచి ఫీజులు వసూలు చెయ్యకూడదని బుధవారం కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే మళ్లీ ఫిర్యాదులు రావడంతో గురువారం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఆన్ క్లాసులు నిర్వహించి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురాకూడదని కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ప్రిన్సిపాల్, టీచర్ల తోలు తీస్తాం

ప్రిన్సిపాల్, టీచర్ల తోలు తీస్తాం

1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఆన్ క్లాస్ లు నిర్వహించినా, విద్యార్థుల కుటుంబ సభ్యుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు తెలిస్తే ఆ విద్యాసంస్థల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు తెలిస్తే ఆ స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ తోలు తీస్తామని, అందులో ఎలాంటి ములాజు ఉండదని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇంత కాలం ఆన్ లైన్ క్లాసుల పేరుతో పిల్లలకు మా దగ్గర నుంచి మొబైల్స్ ఇప్పించి వారి మీద ఒత్తిడి చేసిన కొన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలతో తిక్కకుదిరిందని కొన్ని వేల మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
Lockdown: Karnataka government ordered to ban online classes till 7th standard. Earlier, it was decided to not allow online classes till August 15th standard in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X