వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: పెళ్లికి 17 షరతులు, మందు, మసాల, ఢాం డుస్ అంటే కుదరదు, వాళ్లకు నో ఎంట్రీ, లక్కీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ దెబ్బకు దాదాపు అందరి జీవితాలు తల్లకిందులైనాయి. ఇంతకు ముందు శుభకార్యాలు, పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నువ్వానేనా అంటూ పోటీ పడి చేసేవారు. అయితే కరోనా పుణ్యమా అంటూ ఆ హంగామాలు, ఆర్బాటాలకు చెక్ పడింది. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ఎంతటి కోటీశ్వరులు అయినా కేవలం 50 మంది సమక్షంలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రభుత్వం నియమాలు పెట్టింది. 50 మంది హాజరైనా 17 నియమాలు, షరతులు కచ్చితంగా పాటించి పెళ్లిళ్లు చేసుకోవాలని, మందు, మసాలా, ఢాం డుస్ అంటే కదరదని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

పెళ్లి చేసినా, పెళ్లికి మీరు వెళ్లినా !

పెళ్లి చేసినా, పెళ్లికి మీరు వెళ్లినా !

కరోనా లాక్ డౌన్ సందర్బంగా పేదలు, సామాన్య ప్రజలు సింపుల్ గా పెళ్లి జరిపించడానికి ఇదో మంది అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి సింపుల్ గా వారికి ఉన్నంతలో సంతోషంగా ఈ శుభకార్యం పూర్తి చెయ్యడానికి లాక్ డౌన్ కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. అయితే పెళ్లి మీరు చేసినా, పెళ్లికి మీరు వెళ్లినా 17 నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కంటైన్ మెంట్ జోన్లలో కుదరదు

కంటైన్ మెంట్ జోన్లలో కుదరదు

కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఆ వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది. కంటైన్ మెంట్ జోన్లలో వివాహాలు, శుభకార్యాలు, బర్త్ డే పార్టీలతో పాటు ఎక్కువ మంది గుమికూడే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్లు చేస్తున్న వారు కచ్చితంగా ఈ 17 నియమాలు పాటించాలని ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

50 మంది, శానిటైజర్, మాస్క్ లు

50 మంది, శానిటైజర్, మాస్క్ లు

* కంటైన్ మెంట్ జోన్లలో ప్రభుత్వ నియమాలు కచ్చితంగా పాటించాలి

* పెళ్లి జరుగుతున్న చోట ప్రవేశ ద్వారంలో కచ్చితంగా శానిటైజర్ ఉండాలి.

* పెళ్లి చేస్తున్న కల్యాణమండపాలు లేదా హాల్ లో ఏసీలు ఆన్ చెయ్యకూడదు.

* పెళ్లి చెయ్యడానికి కచ్చితంగా స్థానిక అధికారులు, సంబంధిత శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.

* పెళ్లి జరిగే ప్రాంతంలో వధూవరులతో సహ మొత్తం 50 మందికి మించి ఉండకూడదు.

గర్బిణిలు, పిల్లలు, వృద్దులకు నో ఎంట్రీ

గర్బిణిలు, పిల్లలు, వృద్దులకు నో ఎంట్రీ

* గర్బిణిలు, 10 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లలు, 65 ఏళ్ల పైన వయసు ఉన్న వృద్దులు పెళ్లికి హాజరుకాకూడదు.

* పెళ్లికి హాజరైయ్యే ప్రతిఒక్కరు మాస్క్ కచ్చితంగా వేసుకోవాలి, ఫోటోలకు ఫోజు ఇవ్వడానికి మాస్క్ లు తియ్యకూడదు.

* పెళ్లికి హాజరయ్యే ప్రతిఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చెయ్యాలి. జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఉన్న వారు పెళ్లికి హాజరుకాకూడదు.

* పెళ్లి జరిగే ప్రాంతాలు, ఫంక్షన్ హాల్స్ లో వాతావరణం బాగుండాలి, అప్పుడే పెళ్లికి అధికారులు అనుమతి ఇస్తారు.

పెళ్లికి నోడల్ అధికారి, మీటరు దూరం

పెళ్లికి నోడల్ అధికారి, మీటరు దూరం

* పెళ్లి జరిగే ప్రాంతంలో కచ్చితంగా స్థానిక నోడల్ అధికారి ఒక్కరు ఉండాలి.

* పెళ్లికి హాజరయ్యే వారు ఒక్కొక్కరు కనీసం ఒక్క మీటరు దూరంలో నిలబడి సమాజిక దూరం పాటించాలి.

* పెళ్లికి హాజరయ్యే ప్రతిఒక్కరు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

* పెళ్లికి ఎంత మంది వస్తున్నారు ? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ? వారి పేర్లు, వివరాలు స్థానిక నోడల్ అధికారికి ఇవ్వాలి.

మందు, పాన్ మసాలా, ఢాం డుస్ అంటే కుదరదు

మందు, పాన్ మసాలా, ఢాం డుస్ అంటే కుదరదు

* పెళ్లికి హాజరయ్యే వారు మద్యం సేవించకూడదు. పాన్, గుట్కా, బీడాలు, పొగాకు, సిగరెట్లు సేవించడానికి అవకాశం లేదు.

* పెళ్లి జరుగుతున్న పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. ఢాం డుస్ అంటూ హంగామాలు చెయ్యకూడదు.

* పెళ్లి వలన స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదు.

* పెళ్లికి హాజరయ్యే ముందు, అక్కడి నుంచి వెళ్లే ముందు కచ్చితంగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.

Recommended Video

Donald Trump Could 'Cut Off' China Ties & Says Doesn't Want To Speak To Xi Jinping
నియమాలు పాటించకపోతే అంతే !

నియమాలు పాటించకపోతే అంతే !

పెళ్లిళ్లు జరిపించాలనుకునే వారు కచ్చితంగా ఈ 17 నియమాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కర్ణాటక కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన లాక్ డౌన్ మూడో విడత పూర్తి అయిన తరువాత పెళ్లిళ్లు నిర్వహించే వారు కచ్చితంగా ఈ 17 నియమ నిబంధనలు పాటించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద పేదలు, సామాన్య ప్రజలు సింపుల్ గా వారి కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు చెయ్యడానికి లక్కీచాన్స్ చిక్కింది.

English summary
Lockdown: Karnataka Health And Family Welfare Ministry's 17 Guide lines For Marriage Function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X