• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lockdown: మాజీ అండర్ వరల్డ్ డాన్ అంత్యక్రియలు, కాల్పులు, తుపాకులు సీజ్, కాంగ్రెస్ ఎంపీ !

|

బెంగళూరు/ రామనగర్: డాన్ లకే డాన్, అండర్ వరల్డ్ డాన్ అని పేరు తెచ్చుకున్న మాజీ మాఫియా డాన్, జయ కర్ణాటక వ్యవస్థాపకుడు ముత్తప్ప రాయ్ క్యాన్సర్ వ్యాధితో బెంగళూరులో మరణించిన విషయం తెలిసిందే. మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన గన్ మెన్ లు, అనుచరులు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. చట్టాన్ని ఉల్లంఘించారని, లాక్ డౌన్ నియమాలు పాటించలేదని ఆరోపిస్తూ మాజీ మాఫియా డాన్ అనుచరుల మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు వారి తుపాకులను సీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ సైతం మాజీ మాఫియా డాన్ అంత్యక్రియలకు హాజరైనారు.

lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?

దుబాయ్ నుంచి బెంగళూరులో డీలింగ్స్

దుబాయ్ నుంచి బెంగళూరులో డీలింగ్స్

కర్ణాటకలో పుట్టిన ముతప్ప రాయ్ అలియాస్ ముతప్ప రై బెంగళూరును గడగడలాడించాడు. బెంగళూరులో రౌడీయిజం రుచిచూపించిన జయరాజ్ అనే పేరుమోసిన రౌడీషీటర్ ను హత్య చేయించిన ముత్తప్ప రాయ్ తరువాత బెంగళూరులో తిరుగులేని మాఫియా డాన్ గా ఎదిగాడు. తరువాత ముత్తప్ప రాయ్ పై అనేక కేసులు నమోదు కావడంతో దుబాయ్ పారిపోయిన అతను అక్కడే తలదాచుకున్నాడు. దుబాయ్ నుంచి ముత్తప్ప రాయ్ తన కనుసైగలతో బెంగళూరును శాసించే స్థాయికి ఎదిగిపోయాడు.

అనారోగ్యంతో మాజీ డాన్ మృతి

అనారోగ్యంతో మాజీ డాన్ మృతి

దుబాయ్ పోలీసులు ముత్తప్ప రాయ్ ను భారత్ కు అప్పగించిన తరువాత జైలు శిక్ష అనుభవించి అన్ని కేసుల నుంచి విముక్తి పొందాడు. తరువాత ముత్తప్ప రాయ్ తరువాత సమాజ సేవ చెయ్యడం మొదలు పెట్టాడు. అనంతరం జయ కర్ణాటక అనే సంస్థను ప్రారంభించి కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో ఆ సంస్థ పేరుతో అనేక కార్యక్రమాలు చేశారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న ముత్తప్ప రాయ్ చికిత్స విఫలమై శుక్రవారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మృతి చెందారు.

గన్ మెన్ ల కాల్పులు

గన్ మెన్ ల కాల్పులు

బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో ముత్తప్ప రాయ్ నివాసం ఉంటున్నారు. బిడిది ప్రాంతం అంటే ముత్తప్ప రాయ్ కి చాలా ఇష్టం. బిడిదిలోని గ్రామంలోనే ముత్తప్ప రాయ్ ఇంటి దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ముత్తప్ప రాయ్ కుమారుడు రిక్కీ తండ్రి చితికి నిప్పంటించి బంట సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియల సమయంలో ఆయన గన్ మెన్ లు గాల్లోకి కాల్పులు జరిపి ఆయన గురువు, యజమానికి తుది వీడ్కోలు పలికారు.

తుపాకులు సీజ్, అరెస్టు

తుపాకులు సీజ్, అరెస్టు

మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియల సందర్బంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించారని, ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి గాల్లోకి కాల్పులు జరిపారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ గన్ మెన్ ల తుపాకులను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముత్తప్ప రాయ్ ప్రధాన అనుచరులు ప్రకాష్ రాయ్, రంజిత్ రాయ్, మానప్ప, గిరీష్, లక్వీర్ సింగ్. జాతర్ సింగ్, సునీల్ అనే 7 మందిని అరెస్టు చేశారు.

  Rahul Gandhi Request To PM Modi
  కాంగ్రెస్ ఎంపీ హాజరు, తేనెటీగల దాడి

  కాంగ్రెస్ ఎంపీ హాజరు, తేనెటీగల దాడి

  కేపీసీసీ అధ్యక్షుడు, ట్రుబల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. శివకుమార్ తదితరులు ముత్తప్ప రాయ్ ఇంటి దగ్గరకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ముత్తప్ప రాయ్ అంత్యక్రియల్లో ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ముత్తప్ప రాయ్ అనుచరులు, అభిమానులు, పరిసర ప్రాంతాల గ్రామస్తులు ఎవ్వరూ అంత్యక్రియలకు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అక్కడ తేనెటీగలు దాడి చేశాయని, అయితే ఎవ్వరికి పెద్ద గాయాలు కాలేదని తెలిసింది.

  English summary
  Lockdown: Karnataka Police filed FIR on seven for firing at air during Muthappa Rai funeral which took place at Bidadi near Bengaluru.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more