వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: లాక్ డౌన్ దెబ్బతో మా శాఖలో వందకు 100 % శాతం బొక్క, మాటల్లేవ్, జీతాలు, మంత్రి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అనేక విదాలుగా నష్టాలు వచ్చాయి. లాక్ డౌన్ నష్టాల నుంచి కోలుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ దెబ్బకు ఒక రాష్ట్రంలోని ఓ శాఖలో వందకు 100 % నష్టాలు వచ్చాయని, పెద్ద బొక్కపడిందని స్వయంగా ఆ శాఖ మంత్రి మీడియాకు చెప్పారు. తమ శాఖ కోలుకోవాలంటే పలు సడలింపులతో పాటు పర్యాటకులకు రాయితీలు ఇవ్వాలని సీఎంకు మనవి చేశామని ఆ మంత్రి దీనంగా అంటున్నారు.

వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా!వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా!

సీఎంతో మీటింగ్

సీఎంతో మీటింగ్

లాక్ డౌన్ సందర్బంగా అనేక శాఖల ఆదాయం అటకెక్కింది. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే పర్యాటక కేంద్రాల్లో ఇప్పుడు పక్షులు, జంతువులు తప్పా మానవుడు మాత్రం కనపడటం లేదు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి సీటీ రవి విధానసౌదలో సమావేశం అయ్యి పర్యాటక శాఖ అధికారులతో చర్చించారు.

అయ్యా ఇదీ మాపరిస్థితి !

అయ్యా ఇదీ మాపరిస్థితి !

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో సమావేశం పూర్తి అయిన తరువాత ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి సీటీ. రవి విధాన సౌధలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బకు కర్ణాటక పర్యాటక శాఖ ఆర్థికలావాదేవీలు అతలాకుతలం అయ్యాయని మంత్రి సీటీ. రవి విచారం వ్యక్తం చేశారు.

వందకు 100 % బొక్కపడింది

వందకు 100 % బొక్కపడింది

కర్ణాటక పర్యాటక శాఖ పరిస్థితి మరీ దారుణంగా ఉందని మంత్రి సీటీ. రవి అన్నారు. మార్చి నెల నుంచి కర్ణాటకలోని పర్యాటక కేంద్రాలు అన్ని మూసివేశామని మంత్రి సీటీ. రవి గుర్తు చేశారు. కరోనా, లాక్ డౌన్ దెబ్బకు కర్ణాటక పర్యాటక శాఖకకు వందకు 100 శాతం నష్టాలు వచ్చాయని, పెద్ద బొక్క పడిందని మంత్రి సీటీ. రవి విచారం వ్యక్తం చేశారు.

Recommended Video

Unlock 1.0: Guidelines for Reopening of Shopping malls, Hotels and Religious Places
తెలుగు, తమిళ సినిమా షూటింగ్ ల దెబ్బ

తెలుగు, తమిళ సినిమా షూటింగ్ ల దెబ్బ

కర్ణాటకలో ప్రస్తుతం ఎలాంటి సినిమా షూటింగ్ లు జరగడం లేదని మంత్రి సీటీ. రవి అన్నారు. కన్నడ సినిమాలతో పాటు తెలుగు, తమిళ సినిమా షూటింగ్ లు అన్ని నిలిచిపోయాయని, అనేక రాయితీలు ఇచ్చి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలని సీఎం బీఎస్. యడియూరప్పకు తాము మనవి చేశామని మంత్రి సీటీ. రవి అన్నారు. అంతేకాకుండా కర్ణాటకలోకి వచ్చే పర్యాటకుల వాహనాలకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా చూడాలని సీఎం బీఎస్. యడియూరప్పకు తాము మనవి చేశామని మంత్రి సీటీ. రవి మీడియాకు చెప్పారు.

English summary
Lockdown: Karnataka tourism Minister CT Ravi said that 'Tourism is Suffered 100% of loss amid coronavirus Lockdown'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X