వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown lovers: పొదల్లో కాలేజ్ లవర్స్, ఏకాంతంలో జల్సాలు, చూసిన బాలుడిని ఏం చేశారంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిర్పూర్: ఏకాంతంగా గడుపుతున్న కాలేజ్ లవర్స్ ను చూడరాని సమయంలో చూసిన ఓ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎక్కడ మా విషయం బయట పడుతుందో అనే భయంతో ప్రియురాలు బయపడింది. మనం కలిసి ఉండటాన్ని బాలుడు చూశాడని, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలని ప్రియురాలు ప్రియుడి దగ్గర బోరున విలపించింది. విషయం మొత్తం నేను చూసుకుంటానని, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లాలని ప్రియురాలికి చెప్పిన ప్రియుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి ముళ్ల పొదల్లో విసేరేశాడు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 కాలేజ్ లవర్స్

కాలేజ్ లవర్స్

తమిళనాడులోని తిర్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సోట్టక వుండమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. యువతి, యువకుడు ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో ప్రేమలో పడ్డారు.

 కవల పిల్లలు

కవల పిల్లలు

ఊత్తుకులి ప్రాంతంలో నివాసం ఉంటున్న తంగరాజ్, సుమతి దంపతులకు భువనేష్ (8), విఘ్నేష్ (8) అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. తంగరాజ్, సుమతి దంపతులు బనియన్లు తయారు చేసే గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తంగరాజ్, సుమతి దంపతులు ఉద్యోగాలకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటారు.

 ప్రేమికులకు రోజు పండగే

ప్రేమికులకు రోజు పండగే

కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న యువతి, యువకుడు ప్రతిరోజు వారి ఇళ్లలో ఎవ్వరూ లేని సమయంలో అక్కడే కలుసుకుంటున్నారు. లాక్ డౌన్ సందర్బంగా కాలేజ్ లు మూసివేయడంతో ఇళ్లలోనే ఉంటున్న వీరిద్దరు ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే ఊరి బయట ఉన్న చెరువు సమీపంలోని ముళ్ల పొదల్లో కలుసుకోవడం మొదలుపెట్టారు. ఇలా వీరు ప్రతిరోజు కలుసుకోవడం అలవాటైయ్యింది. ప్రతిరోజు ప్రేమికులు ఏకాంతంగా కలుసుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు.

 ఏకాంతంగా ఉంటే బాలుడు చూశాడని !

ఏకాంతంగా ఉంటే బాలుడు చూశాడని !

రెండు రోజుల క్రితం సోట్టక వుండమ్ చెరువు సమీపంలో ప్రేమికులు ఏకాంతంగా నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో భవనేష్ సాటి స్నేహితులతో కలిసి అటువైపు వెళ్లి వారిని చూశాడు. ఆ సమయంలో ప్రియురాలు ఆందోళన చెందింది. తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్న భువనేష్ ఎక్కడ ఈ విషయం మా తల్లిదండ్రులకు చెబుతాడో అని భయపడింది. అయితే ఏమీ తెలియని వయసు కాబట్టి భువనేష్ వారు ఏకాంతంగా గడుపుతున్న విషయం చూసిచూడనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 ప్రియురాలి కోసం ఏం చేశాడంటే ?

ప్రియురాలి కోసం ఏం చేశాడంటే ?

తాను నీతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భువనేష్ చూశాడని, వాడు తన ఇంట్లో ఈ విషయం చెబితో మొదటికే మోసం వస్తోందని ప్రియురాలు ఆమె ప్రియుడి దగ్గర బోరున విలపించింది. సరే మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లిపో అని ప్రియుడు ఆమె ప్రియురాలికి చెప్పాడు. తరువాత స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడు భువనేష్ కు మాయమాటలు చెప్పిన ప్రియుడు అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లాడు.

 కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు

కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు

చెరువు సమీపంలోకి భువనేష్ ను తీసుకెళ్లిన ప్రియుడు అతని ఎద, చాతి ముఖం, కడుపు తదితర చోట్ల దారుణంగా పొడిచి చంపేసి శవాన్ని చెరువు సమీపంలోని ముళ్ల పొదల్లో విసిరేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన తంగరాజు, సుమతి దంపతులు కుమారుడు భువనేష్ కనపడలేదని గుర్తించి ఊత్తుకులి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 9 ప్రత్యేక బృందాలతో కేసు విచారణ చేసిన పోలీసులు చెరువు సమీపంలో భువనేష్ మృతదేహాన్ని గుర్తించారు. పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు ప్రేమికులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికుడు తాను భువనేష్ ను హత్య చేశానని అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రియురాలిని విచారణ చేస్తున్నామని ఊత్తుకులి పోలీసులు తెలిపారు .

English summary
Lockdown lovers: 8 year old boy brutally murdered by young man Tiurppurin Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X