వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: అబ్బా... ఏం చేస్తివి ఏం చేస్తివి, ఇప్పుడో చేస్తివా, లేక ?, ఎస్ఐ బిల్డప్ !

|
Google Oneindia TeluguNews

భోపాల్: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ సందర్బంగా పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకున్నారు. ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిని శుభశ్రీ ఇటీవల మతిస్థిమితం లేని మహిళకు భోజనం తినిపిస్తున్న సమయంలో తీసిన వీడియోను చూసిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. అయితే సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్ సన్నివేశాలను నిజజీవితంలో చేసిన పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ పై అధికారుల దగ్గర చివాట్లు తిన్నారు. కదులుతున్న రెండు కార్ల మద్యలో నిలబడి సినిమా హీరోలాగా బిల్డప్ ఇచ్చిన ఆ సబ్ ఇన్స్ పెక్టర్ కు రూ. 5 వేలు ఫైన్ వెయ్యడంతో పాటు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లో విధులు తొలగించి వీఆర్ కు పంపించారు. ఎస్ఐ యాక్షన్ సీన్ వీడియో చూసిన నెటిజన్లు అబ్బా.... ఏం చేస్తివి ఏం చేస్తివి ఇప్పుడో చేస్తివా, లేక ? అంటు జోకులు వేస్తున్నారు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

సింగం పోలీస్

సింగం పోలీస్

1991లో విడుదలైన బాలీవుడ్ సినిమా పూల్ ఔర్ కాంటేలో అజయ్ దేవగన్ కదులుతున్న రెండు బైక్ ల మీద కాలేజ్ లోకి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోయింది. ఆ ఒక్క సన్నివేశంతో దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కు యువతలో మంచి క్రేజ్ వచ్చింది. అదే సినిమా తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సైతం రీమేక్ చేశారు. కదులుతున్న రెండు బైక్ ల్లో నాగార్జున సైతం యాక్షన్ సిన్నివేశాల్లో నటించారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగానే తెరకెక్కిన సింగం సినిమాలో సైతం కదులుతున్న రెండు కార్ల మీద నిలబడి ముందుకు వెలుతున్న యాక్షన్ సీన్స్ అదిపోయాయి.

ఎస్ఐ సినిమా పిచ్చోడు

ఎస్ఐ సినిమా పిచ్చోడు

మధ్యప్రదేశ్ లోని దామోహ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ యాదవ్ సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐ మనోజ్ యాదవ్ సినిమా పిచ్చోడు. సినిమాల్లోని సన్నివేశాలను ఎస్ఐ మనోజ్ యాదవ్ ఫాలో అవుతున్నాడు. సింగం సినిమాలో హీరో అజయ్ దేవగన్ రెండు కార్ల మీద వచ్చి అభిమానులతో విజిల్స్ వేయించుకున్నాడని, తాను అలాగే చేసి తాను ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో హీరో అనిపించుకోవాలని మనోజ్ యాదవ్ భావించాడు.

హీరోలాగా ఫోజులు, ఫ్లయింగ్ కిస్ లు

సింగం సినిమాలో రెండు కార్ల మీద హీరో అజయ్ దేవగన్ వచ్చే సీన్ పదేపదే చూసిన ఎస్ఐ మనోజ్ యాదవ్ తన పలుకుబడి ఉపయోగించి రెండు కార్లు తెప్పించుకున్నాడు. తరువాత ఆ రెండు కార్లను నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లాడు. కదులుతున్న రెండు కార్ల మీద రెండుకాళ్లు పెట్టి హీరో అజయ్ దేవగన్ ఎలా చేశాడో అలాగే కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడు. చివరికి కదులుతున్న రెండు కార్ల మీద నిలబడి వెలుతున్న సమయంలో హీరోలాగా నిలబడి ఫోజ్ ఇస్తూ ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చిన ఎస్ఐ మనోజ్ యాదవ్ వీడియో తీయించాడు. అంతటికే అతని సినిమా పిచ్చి, హీరోయిజం పిచ్చి పోలేదు. ఆ యాక్షన్ సీన్ వీడియోను ఎస్ఐ మనోజ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త !

ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త !

ఎస్ఐ మనోజ్ యాదవ్ చేసిన యాక్షన్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో శాంతిభద్రతలు కాపాడకుండా ఇలా సినిమాల్లో చేసినట్లు యాక్షన్ సీన్స్ చేస్తూ కాలం గడుపుతున్న ఎస్ఐ మనోజ్ మాదవ్ మీద చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ డీజీపీకి అనేక మంది మనవి చేశారు. విషయం తెలుసుకున్న ఐజీ అనీల్ శర్మ ఎస్ఐ మనోజ్ యాదవ్ ను మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త అంటూ ఐజీ అనీల్ శర్మ హెచ్చరించారు.

ఎస్ఐకి రూ. 5 వేలు ఫైన్

ఎస్ఐకి రూ. 5 వేలు ఫైన్

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు ఎస్ఐ మనోజ్ యాదవ్ నుంచి రూ. 5, 000 జరిమానా వసూలు చెయ్యాలని సంబంధిత అధికారులకు ఐజీ అనీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా దామోహ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ యాదవ్ ను విధుల నుంచి తప్పించి వీఆర్ కు పంపించి కార్ల స్టంట్ విషయంపై విచారణ చెయ్యాలని సంబంధిత అధికారులకు ఐజీ అనీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంమీద సినిమా హీరోలాగా ప్రజల దగ్గర నిజంగా హీరో ఐపోవాలని ప్రయత్నించిన ఎస్ఐ మనోజ్ యాదవ్ ఇప్పుడు ఒక్క వీడియోతో చిక్కుల్లో పడ్డాడు.

English summary
Lockdown: Madhya Pradesh police got relieved of his charge after pulling off danger car stunt to become viral. A sub-inspector of Madhya Pradesh Police was fined Rs 5,000 after a video showing him performing a famous stunt from Ajay Devgn-starrer Bollywood film Singham went viral on social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X