వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ డోర్ డెలివరీ: వైన్ షాపులకు ‘మహా’సర్కార్ అనుమతి, కానీ కండీషన్స్ అప్లై...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేల 401కి చేరింది. వైరస్ తగ్గి 4 వేల 786 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 868 మంది చనిపోయారు. ముంబై, పుణెలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఉద్దవ్ థాకరే సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో ప్రధానంగా మద్యం ఇంటికి సరఫరా చేసేందుకు అనుమతిచ్చింది. లిక్కర్ షాపులకు కూడా పర్మిషన్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ లిక్కర్ హోం డెలివరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కరోనా: వైన్ షాపులో దూరిన దొంగ, రూ.60 వేల లిక్కర్, నగదు చోరీ, సీసీటీవీ ఫుటేజీ ద్వారా..కరోనా: వైన్ షాపులో దూరిన దొంగ, రూ.60 వేల లిక్కర్, నగదు చోరీ, సీసీటీవీ ఫుటేజీ ద్వారా..

లైసెన్స్ షాపు నిర్వాహకులు తమ ప్రాంత పరిధిలో మద్యం డోర్ డెలివరీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ అవకాశం కల్పంచింది. అయితే డోర్ డెలివరీ చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. పదే పదే శానిటైజర్‌తో చేతులు కడుక్కొవాలని సజెస్ట్ చేసింది. మద్యం షాపులు తెరిచే ఉంచేందుకు ఇచ్చిన సమయంలోనే మందు డెలివరీ చేయాలని.. అంతకుముందు, ఆ తర్వాత డోర్ డెలివరీకి అంగీకరించబోమని తెలిపింది. ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్, మిల్డ్ లిక్కర్, బీర్, వైన్ డోర్ డెలివరీ చేసే జాబితాలో ఉన్నాయి.

Lockdown: Maharashtra allows home delivery of alcohol..

దేశంలో లాక్ డౌన్ ముగిసేవరకు లిక్కర్ డోర్ డెలివరీ కొనసాగుతోందని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో భౌతికదూరం పాటించి.. వైరస్ వ్యాప్తిని తగ్గించొచ్చని ఉద్దవ్ సర్కార్ భావిస్తోంది.

English summary
Maharashtra government on Tuesday allowed home delivery of liquor in the state. As per the order, licensed shops will be allowed to deliver Indian-made foreign liquor, mild liquor, beer and wine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X