వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: శ్రామిక్ రైలులో కార్మికుడి మృతి, శవంతో 8 గంటలు సాటి ప్రయాణికులకు హడల్, రీజన్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశంలో లాక్ డౌన్ అమలు కావడంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కూలీలు, కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. ఇదే సమయంలో సొంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులు మార్గం మద్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇదే సమయంలో శ్రామిక్ రైలులో వెలుతున్న వలస కార్మికుడు అదే రైలులో ప్రాణాలు వదలడంతో సుమారు 8 గంటల పాటు ఆ శవంతో సాటి ప్రయాణికులు అదే కంపార్ట్ మెంట్ లో ప్రయాణించారు. ఇదే సమయంలో 8 గంటలకు పైగా శవంతో ప్రయాణించిన సాటి కూలి కార్మికులు ఎక్కడ మాకు కరోనా వైరస్ వస్తుందో ? అనే భయంతో ఇప్పుడు హడలిపోతున్నారు.

Lockdown: వీడి లవ్ స్టోరీ ముందు టైటానిక్ సినిమా వేస్ట్, పెళ్లి కూతురు ఎవరంటే ? రియల్ హీరో !Lockdown: వీడి లవ్ స్టోరీ ముందు టైటానిక్ సినిమా వేస్ట్, పెళ్లి కూతురు ఎవరంటే ? రియల్ హీరో !

 వలస కూలీలు, కార్మికులు

వలస కూలీలు, కార్మికులు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు శ్రామిక్ రైలు బయలుదేరింది. ఇదే రైలులో మాల్డా జిల్లాలోని హరిశ్చంద్రపుర ప్రాంతానికి చెందిన బుద్ద పరిహార్ (50) అనే వ్యక్తి బయలుదేరాడు.

 కదులుతున్న రైలులో మృతి

కదులుతున్న రైలులో మృతి

రాజస్థాన్ లోని బికనెర్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్ లో బుద్ద పరిహార్ గత 20 ఏళ్లుగా పని చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు బయలుదేరిన శ్రామిక్ రైలులో వెలుతున్న బుద్ద పారిహార్ అనే వలస కూలి మరణించాడు. బుద్ద పరిహార్ మరణించడంతో సాటి ప్రయాణికులు హడలిపోయారు.

 శవంతో 8 గంటలు ప్రయాణం

శవంతో 8 గంటలు ప్రయాణం

రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వెలుతున్న రైలులో బుద్ద పరిహార్ మరణించాడు. సుమారు 8 గంటలకు పైగా బుద్ద పరిహార్ మృతదేహంతో అదే కంపార్ట్ మెంట్ లోని సాటి ప్రయాణికులు ప్రయాణించారు. ఉదయం 6. 40 గంటల సమయంలో రైలు మల్డా రైల్వేస్టేషన్ చేరుకోవడంతో సాటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

 కరోనా వైరస్ టెన్షన్

కరోనా వైరస్ టెన్షన్

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కంపార్ట్ మెంట్ లోని బుద్ద పరిహార్ మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా బుద్ద పరిహార్ టీబీ వ్యాధితో భాదపడుతున్నాడని, ఆ వ్యాధితో అతను మరణించాడా ? లేక కరోనా వైరస్ ఉందా ? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. బుద్ద పరిహార్ మృతదేహాంతో అదే కంపార్ట్ మెంట్ లో సుమారు 8 గంటల పాటు ప్రయాణించిన సాటి ప్రయాణికులు ఇప్పుడు మాకు ఎక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో ? అనే భయంతో హడలిపోతున్నారు.

English summary
Lockdown: Migrant Worker dies on Shramik Train in UP Triggers Panic among other passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X