బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ప్రయాణానికి పాస్ లేదు, బెంగళూరు: వన్ వే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించిన తరువాత ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్రంలో, జిల్లాల పరిధిలో మాత్రమే సంచరించడానికి అవకాశం ఉంది. ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. అయితే బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించిన ప్రజలకు కర్ణాటక పోలీసు శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మీరు కర్ణాటకలో ఎక్కడి నుంచి అయినా మీ సొంత రాష్ట్రాలకు ప్రయాణించాలంటే ఎలాంటి పాస్ లు అవసరం లేదని, అయితే ఇది వన్ వే మాత్రమే అని కర్ణాటక డీజీపీ స్పష్టం చేశారు.

Coronavirus: సీఎం సొంత ఇలాఖాలో పెళ్లికి చెక్, క్వారంటైన్ లో 19 పోలీసులు, ఏం జరిగిందంటే ?Coronavirus: సీఎం సొంత ఇలాఖాలో పెళ్లికి చెక్, క్వారంటైన్ లో 19 పోలీసులు, ఏం జరిగిందంటే ?

ప్రయాణానికి పాస్ లేదు మిత్రమా !

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిద నగరాలు, జిల్లాల్లో ఉంటున్న ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించాలంటే కచ్చితంగా తమ దగ్గర అనుమతి తీసుకుని పాస్ తీసుకోవాలని కర్ణాటక పోలీసులు ఇన్ని రోజులు చెప్పారు. ఇప్పటి వరకు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెలుతున్న ప్రజలు పోలీసుల దగ్గర పాసులు తీసుకుని సంచరించారు.

బెంగళూరులో లక్షల మంది వెయిటింగ్

బెంగళూరులో లక్షల మంది వెయిటింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు లక్షల మంది బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ అమలు అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోదామా అని కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. అయితే పోలీసుల దగ్గర పాసులు తీసుకోలేక చాలా మంది నిరుత్సాహంతో ఇన్ని రోజులు అలాగే ఉండిపోయారు.

గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ

గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ

మే 22వ తేదీ శుక్రవారం కర్ణాటక డీజీపీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని అనుకున్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి పోలీసుల అనుమతి, వారి పాసులు అవసరం లేదని, మీరు స్వేచ్చగా మీ రాష్ట్రాలకు వెళ్లవచ్చని కర్ణాటక డీజీపీ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఇది వన్ వే మాత్రమే

ఇది వన్ వే మాత్రమే

బెంగళూరు నగరంతో పాటు ఇత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి కర్ణాటక పోలీసు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది వన్ వే మాత్రమే అని డీజీపీ స్పష్టంగా చెప్పారు. బెంగళూరుతో పాటు కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే మా అనుమతి అవసరం లేదు, అయితే ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకలోకి రావాలనుకునే వారు కచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని డీజీపీ క్లారిటీగా చెప్పారు.

అది మీ ఖర్మ.... మాకు తెలీదు

అది మీ ఖర్మ.... మాకు తెలీదు

బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు పోలీసుల అనుమతి అవసరం లేదని చెప్పిన కర్ణాటక డీజీపీ మీరు ఏ రాష్ట్రానికి వెళ్లాలని అనుకుంటున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని అన్నారు. మీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి ఇప్పించే విషయంలో మేము జోక్యం చేసుకోమని కర్ణాటక డీజీపీ స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే వారు కచ్చితంగా ప్రభుత్వ అధికారులు సూచించే క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక డీజీపీ స్పష్టం చేశారు.

బెంగళూరు విమాన ప్రయాణికులకు నో క్వారంటైన్ !

బెంగళూరు విమాన ప్రయాణికులకు నో క్వారంటైన్ !

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ విమానాశ్రయం) నుంచి ప్రయాణించే వారు క్వారంటైన్ లో ఉండవలసిన అవసరం లేదని కర్ణాటక డీజీపీ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు నేరుగా విమానాశ్రయానికి వెళ్లవచ్చని అన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకునే వారు మాత్రం ప్రభుత్వం చెప్పినన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక డీజీపీ స్పష్టం చేశారు. మొత్తం మీద బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి కర్ణాటక డీజీపీ గుడ్ న్యూస్ చెప్పారు.

English summary
Lockdown: In a tweet Karnataka DG & IGP said that pass is not required for inter state movement from Karnataka. But people have written consent of the receiving state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X