• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lockdown: కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్, డ్యూటీ చెయ్యరా మొగుడా అంటే, మందు పార్టీ !

|

బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ పుణ్యామా అంటూ గత 40 రోజుల నుంచి లిక్కర్ షాప్ లు బంద్ కావడంతో మందుబాబులు మద్యం కోసం వెంపర్లాడుతున్నారు. మందుబాబులకు నేను ఏం తక్కువ అంటున్నాడు ఓ పోలీసు. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఈ నాలుగో సింహమేరా పోలీసు అనే డైలాగ్ చెబుతూ ఆ పోలీసులు స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. పోలీసులు మందు పార్టీ చేసుకోవడం కొత్త కాకపోయినా ఈయన గారు బ్రాందీ షాప్ లు తీసిన వెంటనే లాక్ డౌన్ డ్యూటీ పక్కన పెట్టి ఏకంగా యూనీఫాం వేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి చెట్టు కింద కుర్చుని మందు తాగుతూ ఎంజాయ్ చేశాడు. పోలీసు యూనీఫాంలో ఆ కానిస్టేబుల్ మందు తాగుతున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెక్ పోస్టులో డ్యూటీ చెయ్యరా మొగుడా అంటే మందు పార్టీ చేసుకుంటావా ? అంటూ అధికారులు అతన్ని సస్పెండ్ చెయ్యడంతో అతనికి తాగిన కిక్కు దిగిపోయి నిజంగానే నాలుగో సింహం కనపడింది.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

చెక్ పోస్టులో లాక్ డౌన్ డ్యూటీ

చెక్ పోస్టులో లాక్ డౌన్ డ్యూటీ

కర్ణాటకలోని చిత్రదుర్గా గ్రామీణ పోలీస్ స్టేషన్ లో రాజు చౌహ్వాన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో రాజు చౌహ్వాన్ కు భరమసాగర చెక్ పోస్టు దగ్గర నిఘా వెయ్యాలని, ప్రజలు వాహనాల్లో సంచరించకుండా కాపాలా ఉండాలని, పరిసర ప్రాంతాలను పరిశీలించాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

లాక్ డౌన్ తో మందులేకపోవడంతో !

లాక్ డౌన్ తో మందులేకపోవడంతో !

కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని వైన్ షాప్ లు మూతపడ్డాయి. 40 రోజుల తరువాత వైన్ షాప్ తలుపులు తియ్యడంతో మందుబాబులు అక్కడ కిలోమీటర్ల పొడవు క్యూ కట్టారు. ఎప్పుడెప్పుడు క్వాటర్ బాటిల్ చిక్కుతుందా, దానిని ఓపెన్ చేసి మందు తాగేద్దామా అంటూ తాగుబోతులు ఇన్ని రోజులు ఎదురు చూశారు.

వైన్ షాప్ ముందు డ్యూటీ చేసే నెపంతో !

వైన్ షాప్ ముందు డ్యూటీ చేసే నెపంతో !

చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజు చౌహ్వాన్ ఓ వైన్ షాప్ దగ్గరకు వెళ్లాడు. వైన్ షాప్ ముందు మద్యం కొనుగోలు చెయ్యడానికి క్యూలో నిలబడి ఉన్న మందుబాబులను దబాయించిన రాజు చౌహ్వాన్ నేరుగా వైన్ షాప్ లోకి వెళ్లాడు. తరువాత అతనికి అవసరం అయిన మందు బాటిల్స్ తీసుకుని బయటకు వచ్చేశాడు.

యూనీఫాంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ !

యూనీఫాంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ !

లిక్కర్ తీసుకున్న రాజు చౌహ్వాన్ నేరుగా ఫ్రెండ్స్ తో కలిసి చిత్రదుర్గ పట్టణం సమీపంలోని ఉల్లిపాయల పోలం దగ్గరకు వెళ్లాడు. పోలంలో ఓ చెట్టుకింద కుర్చోవడానికి ఓ దుప్పటి వేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా మందు తాగుతూ కాలం గడిపాడు. తాను యూనీఫాంలో ఉన్నానని, ఎవరైనా చూస్తే పోలీసు శాఖ పరువు పోతుందని కనీసం రాజు చౌహ్వాన్ ఆలోచించలేదు.

డ్యూటీ చెయ్యమంటే తాగి డ్యాన్స్ చేస్తావా ?

డ్యూటీ చెయ్యమంటే తాగి డ్యాన్స్ చేస్తావా ?

రాజు చౌహ్వాన్ పోలీసు యూనీఫాం వేసుకుని మందు తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అంటూ హీరో సాయికుమార్ డైలాగులు చెప్పాడు. రాజు చౌహ్వాన్ యూనీఫాంలో మద్యం తాగడమే కాకుండా నోటికి వచ్చినట్లు వాగిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు నిన్ను చెక్ పోస్టులో డ్యూటీ చెయ్యమంటే తాగి డ్యాన్స్ లు చేస్తూ పోలీసుల పరువు తీస్తావా ? అంటూ రాజు చౌహ్వాన్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Lockdown: The video of police constable having alcohol party with friends went viral in Chitradurga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X