వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: వలస కూలీలు, రోడ్డు పక్కన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, చంటి బిడ్డతో 160 కి,మి. నడక!

|
Google Oneindia TeluguNews

ముంబై/నాసిక్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు, కూలీలు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించడంతో వలస కూలీలు, కార్మికులు వారి స్వస్థలాలకు బయలుదేరి వెలుతున్నారు. కొందరు రైళ్లు బస్సులు, ఇతర వాహనాలలో స్వస్థలాలకు వెలుతుంటే మరి కొందరు కూలీలు హైవే రహదారల మీదుగా నడిచి వెలుతున్నారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కు వెలుతున్న నిండుగర్భిణి నడి రోడ్డు మీద బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ బాలింత చంటి బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి నడిచి బయలుదేరింది.

Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !

నాసిక్ లో కూలి పనులు

నాసిక్ లో కూలి పనులు

మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాకు చెందిన శకుంతల, ఆమె భర్త మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి చేరుకుని కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్చి నెల 25వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అదే రాష్ట్రంలో చిక్కుకుపోయారు.

9 నెలల నిండు గర్భిణి

లాక్ డౌన్ నియమాలను సడలించిన కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం ఇచ్చింది. వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు, బస్సు సౌకర్యం కల్పించారు. సాత్నా జిల్లాకు చెందిన నిండు గర్భిణి శకుంతల, ఆమె భర్త పని చేస్తున్న ఫ్యాక్టరీలు మూసి వెయ్యడడంతో సొంత ఊరికి వెళ్లడానికి నిర్ణయించారు. శకుంతల, ఆమె భర్త రైళ్లో, బస్సులో వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో జాతీయ రహదారి మీదుగా సాటి కార్మికులతో కలిసి సొంత ఊరికి నడిచి బయలుదేరారు.

నడిరోడ్డులో బిడ్డకు జన్మినిచ్చిన తల్లి

నడిరోడ్డులో బిడ్డకు జన్మినిచ్చిన తల్లి

శకుంతల 9 నెలల నిండు గర్భిణి. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు లెక్కచెయ్యని శకుంతల సొంత ఊరికి బయలుదేరింది. కరోనా వైరస్ భయంతో ఎవ్వరూ నిండుగర్బిణి శకుంతలకు ఏ వాహనంలో కూడా డ్రాప్ ఇవ్వడానికి సాహసం చెయ్యలేకపోయారు. ఇదే సమయంలో ఊరికి నడిచి వెలుతున్న సమయంలోనే శకుంతల నడిరోడ్డు పక్కన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Recommended Video

COVID-19 Lockdown: Watch Pregnant Woman Walks For 7km, Delivers At Dental Clinic
ఒక్క గంట విశ్రాంతి, 160 కిలోమీటర్ల నడక

ఒక్క గంట విశ్రాంతి, 160 కిలోమీటర్ల నడక

నడిరోడ్డు పక్కన బిడ్డకు జన్మనిచ్చిన శంకుతల పచ్చి బాలింత అని కూడా లెక్క చెయ్యకుండా కేవలం ఒక గంట సేపు మాత్రమే విశ్రాంతి తీసుకుని తరువాత సొంత ఊరికి బయలుదేరింది. ఊరి సమీపంలోకి చేరుకుంటున్న సమయంలో స్థానిక పోలీసు ఇన్స్ పెక్టర్, అధికారులు ఓ వాహనం తెప్పించి శకుంతల, ఆమె బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇద్దరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సొంత ఊరికి చేరుకోవాలనే నిర్ణయించుకున్న తరువాత తన భార్య శకుంతల ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత 160 కిలోమీటర్లు నడిచి వచ్చిందని ఆమె భర్త స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
Lockdown: A pregnant migrant worker who was walking back to her village in Satna from Nashik in Maharashtra amid Coronavirus Lockdown, delivered a child on the way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X