చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఈ ప్రభుత్వానికి ఏమైయ్యింది, ఓ పక్క కరోనా చావులు, మరో పక్క ప్రైవేట్ బస్సులు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య క్రికెట్ స్కోర్ పెరిగిపోయినట్లు రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యింది మహారాష్ట్రలో. తరువాత స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడుడలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 34, 914 ఉంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా కాటుకు ఆయన పుట్టినరోజే ప్రాణాలు వదిలారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ప్రైవేట్ బస్సులు తిప్పడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ పక్క కరోనా చావులు ఎక్కువ అవుతుంటే మరో పక్క ఎంత ధైర్యంగా తమిళనాడు ప్రభుత్వం ప్రైవేటు బస్సుల్లో ప్రజలు సంచరించడానికి అనుమతి ఇచ్చిందో ? అనే విషయం మాత్రం అర్థం కావడం లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు.

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?

దేశంలో రెండోస్థానం

దేశంలో రెండోస్థానం

భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజటివ్ కేసులు నమోదు అయ్యింది మహారాష్ట్రలో. మహారాష్ట్రలో 88, 528 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3, 169 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమిళనాడులో మంగళవారం వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 34, 914 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్క చెన్నై సిటీలోనే 24, 545 కరోనా కేసులు నమోదైనాయి. మంగళవారం మాత్రమే 1, 685 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

దేశంలో ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడే బలి

దేశంలో ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడే బలి

దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ నాయకులకు కరోనా వైరస్ సోకినా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నయం చేసుకున్నారు. అయితే దేశంలో ఒక ఎమ్మెల్యే కరోనా వైరస్ వ్యాధికి బలి అయ్యింది తమిళనాడులోనే. బుధవారం డీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా కాటుకు బలి అయ్యారు. విధిరాసిన తలరాతలో పుట్టినరోజు నాడే డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా వ్యాధితో చికిత్స విఫలమై మరణించారు. దేశంలో కరోనా వ్యాధితో మరణించిన మొట్ట మొదటి ఎమ్మెల్యే అన్బళగన్.

రోడ్ల మీద ప్రైవేట్ బస్సులు రైట్ రైట్

రోడ్ల మీద ప్రైవేట్ బస్సులు రైట్ రైట్

తమిళనాడులో బుధవారం నుంచి రోడ్ల మీద ప్రైవేట్ బస్సులు సంచరించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తమిళనాడులో జోన్ల పరిధిలో ఆర్ టీసీ బస్సులు సంచరిస్తున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఒత్తిడితో వారు బస్సులు తిప్పుకోవడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు అంగీకరించారు.

ఇ- పాస్ లు, 60 % ప్రయాణికులు

ఇ- పాస్ లు, 60 % ప్రయాణికులు

తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులు తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ బస్సుల యాజమాన్యం నాయకుడు ధర్మరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం జోన్ల పరిధిలోనే 60 శాతం మంది ప్రయాణికులతో బస్సులు తిప్పుతామని ధర్మరాజ్ స్పష్టం చేశారు. జోన్లు దాటి సంచరించే ప్రయాణికులు కచ్చితంగా ఇ- పాస్ లు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని, ఇ- పాస్ లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్రైవేట్ బస్సుల్లో వేరే జోన్లకు తీసుకెలుతున్నామని ధర్మరాజ్ వివరించారు.

Recommended Video

Vijayawada Lockdown Again As Raise In Corona Cases
ఏం చూసుకుని అంత ధైర్యం ?

ఏం చూసుకుని అంత ధైర్యం ?

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో ఆ వ్యాధిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. మరో వైపు ఏం చూసుకుని అంత ధైర్యంగా ప్రైవేట్ బస్సులు తిప్పడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో అర్థం కావడం లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ప్రైవేటు బస్సుల యాజమాన్యం నిర్లక్షం చేస్తే కరోనా వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని తమిళ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Lockdown: Private buses ply from Trichy to their respective zones from today in Tamil Nadu. Driver and conductor are advised to keep social distance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X