వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు సహకరించకుంటే లాక్ డౌన్ రూల్స్ కఠినం .. మినహాయింపు ఇచ్చిన వారికే అనుమతి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. దీంతో కేంద్రం రాష్ట్రాల మీద సీరియస్ అవుతుంది. కరోనా వైరస్ కేసులు 433కు చేరటంతో కేంద్రం చాలా సీరియస్ గా తాజా పరిస్థితిని తీసుకుంటుంది.

 లాక్ డౌన్ పాటించని రాష్ట్రాలపై ప్రధాని అసహనం ... పెరిగిన ధరలతో బతుకు భారం లాక్ డౌన్ పాటించని రాష్ట్రాలపై ప్రధాని అసహనం ... పెరిగిన ధరలతో బతుకు భారం

 ప్రభుత్వం సడన్ గా నిర్ణయం తీసుకోవటంతో రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజలు

ప్రభుత్వం సడన్ గా నిర్ణయం తీసుకోవటంతో రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజలు

కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావిత 75 జిల్లాలను కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది . ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం మార్చి 31 వరకు షట్ డౌన్ ప్రకటించారు. కానీ ప్రజలు నేడు రోడ్ల మీదకు వచ్చి తిరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి. ప్రజలు సహకారం అందిస్తారని భావిస్తే అందుకు భిన్నంగా ప్రజల నుండి రెస్పాన్స్ వస్తుంది. అయితే ప్రభుత్వం సడన్ గా నిర్ణయం తీసుకోవటం కూడా అందుకు కారణంగా భావిస్తున్నారు.

ప్రజలు రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి .. రూల్స్ కఠినం చెయ్యాలని నిర్ణయం

ప్రజలు రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి .. రూల్స్ కఠినం చెయ్యాలని నిర్ణయం

కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇప్పుడు అందరినీ ఇంటికే పరిమితం కావాలని చెప్తున్నా ప్రజలు బయటకు వెళ్ళటంతో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఉదయం నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు రావడానికి అనుమతించిన పోలీసులు ఉదయం 10 తర్వాత పరిస్థితిని కొంత సీరియస్‌గా తీసుకున్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరింత ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇలా అయితే లాక్ డౌన్ ప్రభావం ఉండదని ,అసలు ఉద్దేశం నేరవేరదని భావిస్తున్న ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నాయి.

నిత్యావసరాలు పేరు చెప్పి యధేచ్చగా తిరుగుతున్న వైనం

నిత్యావసరాలు పేరు చెప్పి యధేచ్చగా తిరుగుతున్న వైనం


ఇప్పటికే సర్వీసు ఆటోలను ఆపి, ప్రయాణికులను దించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు.ఇక అంతే కాదు ముఖ్యంగా డ్రైవర్లకు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణిస్తుంటే ఆపాలని ,కుటుంబ సభ్యులకు అత్యవసరం అయితే తప్ప అనుమతి ఇవ్వొద్దని పోలీసులకు ఆదేశాలు అందాయి. మరోవైపు ఇక, బైక్‌లపై వెళ్లేవారిని అందరినీ ఆపి చెక్‌ చేస్తున్నారు పోలీసులు. నిత్యావసరాలకు మినహాయింపు అని చెప్పిన నేపధ్యంలో అందరూ నిత్యావసర వస్తువుల పేర్లు చెప్పి బయటకు వెళ్తున్న పరిస్థితి.

మినహాయింపు ఇచ్చిన వారు తప్ప మిగతా అందరిపై కఠినంగా రూల్స్

మినహాయింపు ఇచ్చిన వారు తప్ప మిగతా అందరిపై కఠినంగా రూల్స్


ఇక లాక్ డౌన్ నుండి నిత్యావసరాలకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, మీడియా వారికి మినహాయింపు ఉన్న నేపధ్యంలో వారి ఐడీ కార్డులను పరిశీలించి జీవో 45లో వెసులుబాటు ఉంటనే అనుమతి ఇస్తున్నారు. ఇక, ప్రధాన రోడ్లు, చౌరస్తాలలో మరింత సీరియస్‌గా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో మధ్యాహ్నం నుండి మరింత సీరియస్‌గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రోడ్లపై బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు సహకరించాకుంటే కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు పోలీసులు .

English summary
The states that announced the lockdown in the wake of the corona virus are now saying that all people should be restricted to home and governments are planning to take tough decisions. However, the center is also serious, with no lockdown effect. Governments who think that the original intent is not fulfilled are expected to act harshly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X