వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: కొడుకులపై కోటి ఆశలు, రూ, 2 వేల కోసం కాటికి పంపించారు, మద్యం కోసం, శవాన్ని పూడ్చేసి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ ఈరోడ్/ మదురై: నవమాసాలు కడుపులో మోసి 25 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుని పెంచి పోషించిన తల్లి మీద ఇద్దరు కుమారులకు కనికరం లేకుండా పోయింది. మద్యం సేవించడానికి ఇంట్లో దాచి పెట్టుకున్న కేవలం రూ. 2 వేలు మాయం అయ్యిందని ఆవేశంలో కొడుకులు రెచ్చిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఎంతో కష్టపడి రూ. రెండు వేలు సంపాధించుకుని ఆ డబ్బుతో మద్యం సేవించి ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఆడబ్బు ఖర్చు చేసి మా ఆశల మీద నీళ్లు చల్లుతావా ? అంటూ ఇద్దరు కొడుకులు ఇనుప రాడ్లు తీసుకుని తల్లిమీద దాడి చేసి అతిదారుణంగా చంపేసి శవాన్ని పాతిపెట్టి చేతులు దులుపుకున్నారు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 కొడుకుల మీద కోటి ఆశలు

కొడుకుల మీద కోటి ఆశలు

తమిళనాడులోని ఈరోడ్డు సమీపంలోని సూరమ్ పట్టి ప్రాంతంలో గణేశన్, సరోజ (48) దంపతులు నివాసం ఉంటున్నారు. గణేశన్, సరోజ దంపతులకు విఘ్నేష్ (28), అరుణ్ కుమార్ (24) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గణేశన్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు.

 కసాయి కొడుకులు

కసాయి కొడుకులు

సరోజ కొడుకులు విఘ్నేష్ డ్రైవర్ గా, అరుణ్ కుమార్ ప్లంబర్ పని చేస్తున్నారు. ఇద్దరు కొడుకులతో కలిసి నివాసం ఉంటున్న సరోజను మాత్రం ఆమె కొడుకులు పట్టించుకునేవాళ్లు కాదు. కూలి పని చేస్తూ సరోజ ఆమె కష్టం మీద ఆధారపడిఉంది. అయితే రోజు సంపాధిస్తున్న డబ్బులతో విఘ్నేష్, అరుణ్ కుమార్ పీకలదాకా మద్యం సేవించి ఎంజాయ్ చేస్తూ తల్లి సరోజను ఏమాత్రం పట్టించుకోకుండా జలాయిగా తిరుగుతున్నారు.

 ఇంట్లో రూ. 2 వేలు మాయం

ఇంట్లో రూ. 2 వేలు మాయం

కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో అంతంతమాత్రంగా పనులు జరగడంతో విఘ్నేష్, అరుణ్ కుమార్ పనులు చేసిన సమయంలో కొంచెం కొంచెం డబ్బులు సంపాధిస్తున్నారు. ఇలా సంపాధించిన డబ్బులో ఇంట్లోని ఓ టిఫిన్ బాక్స్ లో సోదరులు ఇద్దరూ రెండు వేల రూపాయలు దాచిపెట్టుకున్నారు. అయితే రెండు రోజుల ముందు ఇంట్లు దాచిపెట్టిన రెండు వేల రూపాయలు మాయం కావడడంతో విఘ్నేష్, అరుణ్ కుమార్ రగలిపోయారు.

 ఇనుప రాడ్లు తీసుకుని తల్లిపై దాడి

ఇనుప రాడ్లు తీసుకుని తల్లిపై దాడి

ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు ఏమైనాయని తల్లి సరోజను ఇద్దరు కొడుకులు నిలదీశారు. ఇంటికి అవసరమైన సరుకులు తీసుకు వచ్చానని, తాను సొంత అవసరాలకు డబ్బులు వాడుకోలేదని సరోజ చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన విఘ్నేష్, అరుణ్ కుమార్ ఇంట్లో ఉన్న రెండు ఇనుపరాడ్లు తీసుకుని తల్లి సరోజ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. తలకు తీవ్రగాయాలైన సరోజ ఇంట్లోనే కుప్పకూలిపోయింది.

 పాతిపెట్టి చేతులు దులుపుకున్నారు

పాతిపెట్టి చేతులు దులుపుకున్నారు

తల్లి సరోజ కుప్పకూలిపోవడంతో ఆందోళనకు గురైన ఇద్దరు కొడులకు అంబులెన్స్ పిలిపించారు. కాలు జారి ఇంట్లో కిందపడిపోయిందని స్థానికులను నమ్మించి తల్లి సరోజను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గం మద్యలోనే సరోజ ప్రాణాలు విడించింది. బంధువులు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా తల్లి సరోజ శవాన్ని తీసుకెళ్లి సూరమ్ పట్టిలోని శ్మశానంలో పాతిపెట్టిన కొడుకులు చేతులు దులుపుకున్నారు.

Recommended Video

COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
 తాగుబోతులపై అనుమానం

తాగుబోతులపై అనుమానం

సరోజ మృతిపై ఆమె బంధువులకు, స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఈరోడ్ తహసిల్దార్ శ్మశానంలో పాతిపెట్టిన సరోజ మృతదేహాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. రెండు వేల రూపాయల కోసం తమ తల్లిని తామే హత్య చేశామని విఘ్నేష్, అరుణ్ కుమార్ అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Lockdown: Sons killed mother near Erode in Tamil Nadu and police inquiry is going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X