వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డులను తిరగరాసిన నరేంద్ర మోడీ ‘కరోనావైరస్-లాక్‌డౌన్’ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక మంది ప్రజలు వీక్షించిన టెలివిజన్ ప్రసంగంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది.
2016లో నోట్ల రద్దు ప్రసంగాన్ని ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది.

మోడీ లాక్‌డౌన్ స్పీచ్ 19కోట్ల మంది వీక్షించారు..

మోడీ లాక్‌డౌన్ స్పీచ్ 19కోట్ల మంది వీక్షించారు..

కరోనావైరస్(కొవిడ్-19) కట్టడిలో భాగంగా తొలుత జాతినుద్దేశించి ప్రసంగిస్తూ జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 24న మరోసారి కరోనాపై జాతినుద్దేశించి ప్రసగించిన మోడీ.. 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ప్రసంగాన్ని 19. కోట్ల మంది వీక్షించారని బార్క్ ఇండియా తెలిపింది. దీన్ని 201 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ ట్వీట్ చేశారు.

ఐపీఎల్ ఫైనల్ రికార్డులు తిరగరాసి..

ఐపీఎల్ ఫైనల్ రికార్డులు తిరగరాసి..

కాగా, గతంలో ఐపీఎల్ ఫైనల్‌ను అత్యధికంగా 13.3 కోట్ల మంది వీక్షించగా.. ప్రస్తుత మోడీ ప్రసంగం దాన్ని అధిగమించడం గమనార్హం. అంతకుముందు జనతా కర్ఫ్యూను ఉద్దేశిస్తూ మార్చి 19న మోడీ చేసిన ప్రసంగాన్ని 8.30 కోట్ల మంది వీక్షించారు. 191 ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇక జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు ప్రసంగాన్ని 163 ఛానళ్లు ప్రసారం చేయగా, 6.5 కోట్ల మంది వీక్షించారు. 2016లో మోడీ నోట్ల రద్దు ప్రసంగాన్ని 114 ఛానళ్లు ప్రసారం చేయగా, 5.7 కోట్ల మంది ప్రజలు వీక్షించారు.

వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. 850కిపైగా పాజిటివ్ కేసులు

వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. 850కిపైగా పాజిటివ్ కేసులు

ఇది ఇలావుండగా, దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 850కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20కిపైగా కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25వేల మంది కరోనా బారినపడి మరణించారు. 5లక్షల 50వేల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

English summary
Prime Minister Narendra Modi's address announcing the 21-day lockdown got more viewership than his previous televised addresses, including the demonetisation speech in 2016, according to BARC India ratings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X