వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరునల్వేలి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని, కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ కష్టాలను ఎదుర్కొని ఇంటికి వస్తున్నానని తెలిసినా ఇంటి నుంచి ప్రియుడితో కలిసి తిరగడానికి వెళ్లిపోయిందని ఆవేశంలో భర్త సహనం కోల్పోయాడు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్న భర్త గంట తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నమ్మించి తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన భర్త తన ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పి నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు.

Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !

కేరళ అమ్మాయితో లవ్

కేరళ అమ్మాయితో లవ్

తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని కురిచ్చికుళం ప్రాంతానికి చెందిన సొరిముత్తు (32) కేరళలోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేసేవాడు. కేరళకు చెందిన రమ్లెట్ (30) అనే యువతి ప్రేమలో పడిన సొరిముత్తు ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

కుటుంబ సభ్యులకు నచ్చచెప్పిన సొరిముత్తు రమ్లెట్ ను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని కేరళ నుంచి అతని సొంత ఊరు కురిచ్చికుళం ప్రాంతానికి చేరుకున్నాడు. సొరిముత్తు, రమ్లెట్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం భార్య రెమ్లెట్, ఇద్దరు పిల్లలతో కలిసి సొరిముత్తు సొంత గ్రామంలో నివాసం ఉన్నాడు.

భర్త కేరళ వెళితే అతని ఫ్రెండ్స్ తో !

భర్త కేరళ వెళితే అతని ఫ్రెండ్స్ తో !

గత ఏడాది చివరిలో సొరిముత్తు కేరళలో గతంలో పని చేసిన కంపెనీలోనే పని చెయ్యడానికి వెళ్లాడు. భర్త సొరిముత్తు కేరళ వెళ్లిన తరువాత రమ్లెట్ ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. తరువాత ఆ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడితో పాటు, భర్త సొరిముత్తు ఫ్రెండ్స్ తో రమ్లెట్ ఎక్కువ చనువు పెంచుకుని విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది.

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్ !

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్ !

రమ్లెట్ ఆమె భర్త ఫ్రెండ్స్ తో పాటు ఓ యువకుడితో అక్రమ సంబంధం సాగిస్తుందని, ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుతుంటుందని సొరిముత్తు కుటుంబ సభ్యులు గమనించారు. కుటుంబ సభ్యులు చెప్పడంతో విషయం తెలుసుకున్న భర్త సొరిముత్తు, అతని కుటుంబ సభ్యులు నువ్వు పద్దతి మార్చుకోవాలని రమ్లెట్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా రమ్లెట్ మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదని తెలిసింది.

భార్య, ప్రియుడు బెడ్ రూంలో ఉంటే తాళం !

భార్య, ప్రియుడు బెడ్ రూంలో ఉంటే తాళం !

లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన సొరిముత్తు కేరళ నుంచి తమిళనాడు చేరుకోలేకపోయాడు ఇదే మంచి చాన్స్ అంటూ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న రమ్లెట్ గదిలో నగ్నంగా అతనితో ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న సొరిముత్తు కుటుంబ సభ్యులు రమ్లెట్, ఆమె ప్రియుడు ఉన్న గదికి బయట తాళం వేసి కేరళలో ఉన్న ఆమె భర్త సొరిముత్తుకు సమాచారం ఇచ్చారు.

భర్త వచ్చేలోపు ప్రియుడితో ఎస్కేప్

భర్త వచ్చేలోపు ప్రియుడితో ఎస్కేప్

కేరళలో ఉన్న సొరిముత్తు నానా తంటాలు పడి సొంత ఊరు కురిచ్చికుళం చేరుకున్నాడు. అప్పటికే గదిలో నుంచి రమ్లెట్ ఆమె ప్రియుడు తప్పించుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న సొరిముత్తు భార్య రమ్లెట్ కు ఫోన్ చేశాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఇద్దరు పిల్లలతో కలిసి జీవిద్దామని, తనను వెంటనే నువ్వు కలవాలని రమ్లెట్ కు చెప్పాడు.

Recommended Video

Liquor Shops Reopen : Public Opinion On Liquor Price Hike | Oneindia Telugu
కరోనా పరీక్షలు, గంటలో భార్య ఫినిష్

కరోనా పరీక్షలు, గంటలో భార్య ఫినిష్

కేరళ నుంచి సొంత ఊరు వచ్చిన సొరిముత్తు తరువాత తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నాడు. ఆసుపత్రి దగ్గరకు వచ్చిన భార్య రమ్లెట్ తో మాట్లాడి ఆమెకు బుధ్దిమాటలు చెప్పాడు. ప్రియుడితో పారిపోయినా తనను భర్త సొరిముత్తు ఏమి అనలేదని నమ్మిపోయిన రమ్లెట్ అతనితో కలిసి అర్దరాత్రి 12. 30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో సొరిముత్తు కత్తి తీసుకుని భార్య రమ్లెట్ గొంతును మూడు సార్లు కత్తిరించి అతి దారుణంగా హత్య చేశాడు. రమ్లెట్ ను తాను హత్య చేశానని, నా ఇద్దరు పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని సొరిముత్తు అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. భార్యను హత్య చేసిన సొరిముత్తు నేరుగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడని తిరునల్వేలి డీఎస్పీ పొన్నరసు మీడియాకు చెప్పారు.

English summary
Lockdown: A construction worker in Tamil Nadu allegedly hacked his wife to death after he found out about her extramarital affair and surrendered before the cops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X