చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: ఒకే ఇంట్లో నటీ, నటుడి ఆత్మహత్య, తట్టుకోలేని దుర్వాసన, అదే కారణం, లాక్ డౌన్ దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విదించడంతో అనేక మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. లాక్ డౌన్ సందర్బంగా ఎలాంటి ఆదాయం లేకపోవడం, దాచుకున్న సొమ్ము మొత్తం ఖాళీ కావడంతో జీవితంపై విరక్తిచెందిన నటీ, నటుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి నటీ, నటుడు బయటకు రాకపోవడం, ఆ ఇంటి నుంచి దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న విషయం వెలుగు చూసింది. నటీ ,నటుడు ఆత్మహత్యలు చేసుకోవడంతో సాటి కళాకారులు షాక్ కు గురైనారు.

వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !

 తమిళ టీవీ సీరియల్స్

తమిళ టీవీ సీరియల్స్

చెన్నైలోని కోడుంగైయ్యార్ ముతామిజ్ నగర్ లో శ్రీధర్, ఆయన సోదరి జయ కల్యాణి నివాసం ఉంటున్నారు. శ్రీధర్ తో పాటు ఆయన సోదరి జయ కల్యాణి అనేక తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. శ్రీధర్, జయ కల్యాణి నటించిన అనేక సీరియల్స్ హిట్ కావడంతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది.

 లాక్ డౌన్ తో షూటింగ్ లు బంద్

లాక్ డౌన్ తో షూటింగ్ లు బంద్

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్ లు, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిపివేశారు. టీవీ సీరియల్స్ షూటింగ్ లు లేకపోవడంతో నటుడు శ్రీధర్, ఆయన సోదరి జయ కల్యాణి ఇంటికే పరిమితం అయ్యారు.

 ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు

దేశవ్యాప్తంగా టీవీ సీరియల్స్ బంద్ కావడంతో ఆదాయం లేక నటీ నటులు చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దక్షిణ భారతదేశంలో టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటీ నటులు ఇప్పటికే వారి భాదలను అనేకసార్లు బయటకు చెప్పారు. తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శ్రీధర్, జయ కల్యాణి సైతం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారని వెలుగు చూసింది.

 ఇక లాభం లేదని తెలిసింది

ఇక లాభం లేదని తెలిసింది

లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా సినిమా, టీవీ సీరియల్స్ కు కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే షూటింగ్ ల సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, 30 శాతం సిబ్బంది మాత్రమే షూటింగ్ లకు హాజరుకావాలని నియమాలు పెట్టింది. ఇలాంటి నియమాలతో నటుడు శ్రీధర్, నటి జయ కల్యాణికి మరింత ఇబ్బందులు ఎదురైనాయి. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయాయి.

Recommended Video

Unlock 1.0 : Watch Religious Places Reopen Across The Country
 ఈ జీవితానికి ఇది చాలు

ఈ జీవితానికి ఇది చాలు

టీవీ సీరియల్స్ లో ఇక నటించడానికి ఎక్కువ అవకాశాలు రావని అంచనాకు వచ్చిన నటుడు శ్రీధర్, నటి జయ కల్యాణి ఇంటిలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటి నుంచి ఎక్కువ దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శ్రీధర్, ఆయన సోదరి జయ కల్యాణి ఆత్మహత్యలు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఆర్థిక సమస్యల కారణంగానే వీరు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పలువురు హిందీ టీవీ సీరియల్స్ నటీ నటులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
lockdown: Tamil tv serial actors commits suicide in Chennai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X