బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: లాక్ డౌన్ లో లిక్కర్ కిక్కు, మదర్స్ డే రోజే తల్లిదండ్రులను చంపేసిన టెక్కీ కొడుకు, డ్రామా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు కొడుకు లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఒక్కసారిగా లిక్కర్ చిక్కడంతో పీకలదాక మద్యం సేవించి తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేశాడు ? అనే అనుమానంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదర్స్ డే రోజు కన్న కొడుకు చేతిలో ఆ తల్లి, తండ్రి దారుణ హత్యకు గురైయ్యారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. కరోనా వైరస్ (COVID 19) సందర్బంగా లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటున్న టెక్కీ కొడుకు మద్యం షాప్ లు ఓపెన్ చేసిన రోజు నుంచి విపరీతంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో ఇంట్లో గొడవ జరగడంతో తల్లిదండ్రులను అతి దారుణంగా కొడుకు హత్య చేశాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!

 రిటైడ్ ఆర్ బీఐ అధికారి

రిటైడ్ ఆర్ బీఐ అధికారి

బెంగళూరు నరంలోని జేపీ నగర్ లోని ఆర్ బీఐ లేఔట్ లో గోవిందప్ప (65), శాంతమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆర్ బీఐలో ఉద్యోగం చేస్తున్న గోవిందప్ప రిటైడ్ అయ్యారు. గోవిందప్ప, శాంతమ్మ దంపతుల కుమారుడు నవీన్ బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

 లాక్ డౌన్ లో ఒక్కసారిగా లిక్కర్ కిక్కు !

లాక్ డౌన్ లో ఒక్కసారిగా లిక్కర్ కిక్కు !

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ సందర్బంగా వర్క్ ఫ్రం హోమ్ అవకాశం రావడంతో నవీన్ ఇంట్లనే ఉంటున్నాడు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా బెంగళూరులో లిక్కర్ షాప్ లో తెరుచుకోవడంతో నవీన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. మద్యం షాప్ లు ఓపెన్ అయిన రోజు నుంచి ప్రతిరోజు నవీన్ పీకలదాక మద్యం సేవిస్తున్నాడు.

 మదర్స్ డే రోజు తల్లిదండ్రులు హత్య ?

మదర్స్ డే రోజు తల్లిదండ్రులు హత్య ?

ఆదివారం రాత్రి నవీన్ పీకలదాక మద్యం సేవించాడు. తరువాత మద్యం మత్తులో ఉన్న నవీన్ ను తల్లిదండ్రులు గోవిందప్ప, శాంతమ్మ మందలించారు. ఆ సమయంలో తల్లిదండ్రులతో సాఫ్ట్ వేర్ ఇంజనీరు కొడుకు నవీన్ గొడవపడ్డాడని తెలిసింది. ఆ సమయంలో తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగిన నవీన్ సహనం కోల్పోయి పదునైన కత్తి తీసుకుని తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ రోహిణి కటోచ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 మదర్స్ డే రోజు తల్లిని చంపేశాడు ?

మదర్స్ డే రోజు తల్లిని చంపేశాడు ?

గోవిందప్ప ఆర్ బీఐ లో ఉద్యోగం చేసి రిటైడ్ అయ్యాడని, శాంతమ్మ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని డీసీపీ రోహిణి చెప్పారు. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా నవీన్ సంపాధించిన డబ్బులు విచ్చవిడిగా ఖర్చు చేస్తున్నాడని, నిత్యం తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేసేవాడని, అతను మద్యంకు బానిస అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని డీసీపీ రోహిణి తెలిపారు.

Recommended Video

Coronavirus In Hyderabad | Follow These Things To Prevention Of Corona
 టెక్కీ కొడుకును బెండ్ తీస్తున్న పోలీసులు

టెక్కీ కొడుకును బెండ్ తీస్తున్న పోలీసులు

ఇంట్లో వృద్ద దంపతులు దారుణ హత్యకు గురైన కేసులో వారి టెక్కీ కొడుకు నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే నవీన్ తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ఇంటికి వెళ్లే సరికి తన తల్లిదండ్రులు గోవిందప్ప, శాంతమ్మ హత్యకు గురైనారని, ఎవరు హత్య చేశారో తనకు తెలీదని నవీన్ చెబుతున్నాడు. నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని బెండ్ తీసి అసలు విషయం బయటకు లాగడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Lockdown: Techie Killed His Father And Mother On World Mother's Day In Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X