వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, సీఎం క్లారిటీ, అందరికీ భలే చాన్స్, షరతులు వర్థిస్తాయి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచం అంతా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు భారతదేశం మొత్తం గత మూడు వారాలుగా లాక్ డౌన్ అయ్యింది. భారతదేశంలో 9, 356 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని అధికారులు నిర్దారించారు. 7, 367 మంది ఐసోలేషన్, క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. 716 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధితో 273 మంది ప్రాణాలు పోయాయి. అయితే కర్ణాటకలో కరోనా వైరస్ మరణాల కంటే మద్యం తాగడానికి బానిసలు అయిన వారి మరణాల సంఖ్య నాలుగింతలు ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 14వ తేదీ తరువాత కర్ణాటకలో మద్యం విక్రయించే విషయంపై లోతుగా ఆలోచిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయించాలని ఆలోచిస్తున్నామని సీఎం చెప్పడంతో మద్యం వ్యాపారులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో తాగుబోతులు ఆయోమయంలో పడిపోయారు. అందరికీ చాన్స్ ఇవ్వాలని, షరతులు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

కరోనా దెబ్బ ఎంత మంది అంటే !

కరోనా దెబ్బ ఎంత మంది అంటే !

కర్ణాటకలో 182 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన 59 మంది చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్ వ్యాధితో ఇప్పటి వరకు 6 మంది చనిపోయారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అక్కడి ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు రోడ్లలోకి రాకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాగుబోతుల చావులే ఎక్కువ

తాగుబోతుల చావులే ఎక్కువ

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఎక్కువ కాకుండా బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వానికి మరో తలనొప్పి తయారైయ్యింది. కర్ణాటకలో గత 24 రోజులుగా మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించడంతో మందుబాబులు గిలగిలలాడుతున్నారు. ఇప్పటి వరకు మద్యంకు బానిసలు అయిన 20 మందికిపైగా తాగుబోతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రభుత్వం తల పట్టుకుంది.

సీఎం అప్ప క్లారిటీ

సీఎం అప్ప క్లారిటీ

కర్ణాటకలో మద్యం విక్రయించాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సోమవారం బెంగళూరులోని అధికార నివాసంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14వ తేదీ తరువాత మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు.

ఎంఎస్ఐఎల్ షాపుల్లో మాత్రమే !

ఎంఎస్ఐఎల్ షాపుల్లో మాత్రమే !

ప్రభుత్వ ఆధీనంలోని ఎంఎస్ఐఎల్ మద్యం దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖా మంత్రి ఆర్.బి. తిమ్మాపుర సైతం ఈ ప్రతిపాదన చేశారని, ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో తాము చర్చించామని, బుధవారం ఈ విషయంపై పూర్తి సమాచారం ఇస్తామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటక మొత్తం మీద ఎంఎస్ఐఎల్ షాపులు కేవలం 789 మాత్రమే ఉన్నాయి.

మద్యం వ్యాపారులు ఫైర్

మద్యం వ్యాపారులు ఫైర్

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కేవలం ఎంఎస్ఐఎల్ షాపుల్లో మాత్రమే మద్యం విక్రయించాలని ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పడంతో బెంగళూరు ఫెడరేషన్ ఆఫ్ వైన్ మర్చంట్స్ అసోసియేషన్ సంఘం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది. మద్యం విక్రయించడానికి అందరికీ అవకాశం ఇవ్వాలని ఆ సంఘం ప్రతినిధులు సీఎం యడియూరప్పకు లేఖ రాశారు.

Recommended Video

Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu
పార్శిల్స్ మాత్రమే, ఒకేఒక్క చాన్స్ !

పార్శిల్స్ మాత్రమే, ఒకేఒక్క చాన్స్ !

ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మద్యం విక్రయించడానికి అన్ని బార్ లు, రెస్టారెంట్ లు, పబ్ లకు అవకాశం ఇవ్వాలని, ఆ సమయంలో అక్కడ మద్యం సేవించడానికి మాత్రం అవకాశం ఇవ్వకపోతే సరిపోతుందని, ప్రజలు పార్శిల్ తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలని వారు సీఎం యడియూరప్పకు మనవి చేశారు. మొత్తం మీద కర్ణాటకలోని మందుబాబులు త్వరలో ఓ గుడ్ న్యూస్ వింటారని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.

English summary
Coronavirus Lockdown: The Karnataka State Liquor Dealers Association has opposed the sale of liquor only through MSIL stores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X