వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: బీహర్‌లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీహర్ కూడా లాక్ డౌన్ విధిస్తామని చెబుతోంది. దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువగా రెండువారాల పాటు లాక్ డౌన్ విధిస్తామని స్పష్టంచేశారు.

Recommended Video

Lockdown From July 16 To 31 లాక్ డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు, మళ్లీ విధిస్తే ఎలా అంటూ..?

కరోనా: కొత్త కేసుల్లో 2వ స్థానం, రికవరీలో 3, మొత్తం మరణాల్లో 8.. దేశంలో కరోనా వైరస్ లెక్కలివే..కరోనా: కొత్త కేసుల్లో 2వ స్థానం, రికవరీలో 3, మొత్తం మరణాల్లో 8.. దేశంలో కరోనా వైరస్ లెక్కలివే..

ఈ నెల 16వ తేదీ గురువారం నుంచి బీహర్‌లో లాక్ డౌన్ విధిస్తారు. ఈ నెల చివరి నాటికి అంటే జూలై 31వ తేదీ శుక్రవారం వరకు అమల్లో ఉంటుంది. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో బీహర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే లాక్ డౌన్‌కి సంబంధించి విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.

Lockdown to be imposed in Bihar from July 16..

అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సంస్థలు/సముదాయాలు విధిగా మూసివేయాల్సిందేనని స్పష్టంచేసింది. లాక్ డౌన్ సందర్భంగా మార్కెట్లు, కార్యాలయాలు మూసివేస్తారు. కానీ అత్యవసర సేవలు పాలు, కూరగాయాలు, మెడికల్ షాపు, బియ్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయి.

English summary
lockdown will be imposed in Bihar from July 16 till the end of the month to curb the spread of Covid-19 cases in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X