బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: సిటీ బస్సులు చూస్తే ప్రజలు పరుగో పరుగు, ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదో అనుకుంటే రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రెండు నెలల నుంచి ప్రజలు వారివారి ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడు రోడ్ల మీద సిటీ బస్సులు, కార్లు, క్యాబ్ లు, ఆటోలు తదితర వాహనాలు సంచరిస్తున్నాయి. ఇంత కాలం లాక్ డౌన్ ఎత్తేస్తే బయట తిరుగుదామని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు బయటకు వచ్చి సిటీ బస్సుల్లో సంచరించాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు పరిస్థితి విచిత్రంగా ఉంది. బెంగళూరులో ప్రతిరోజు వేల సంఖ్యలో సంచరించే BMTC బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతాయని ఊహించిన అధికారుల అంచనాలు తల్లకిందులైనాయి. BMTC బస్సుల్లో సంచరించడానికి ప్రయాణికులు రాకపోవడంతో ఖాళీగా బస్సులు తిరుగుతున్నాయి. సిటీ బస్సులు చూస్తున్న ప్రజలు వాటిలో సంచరించాలంటే భయపడి పరుగు తీస్తున్నారు. అధికారుల ఓవర్ కాన్ఫిడెన్స్ బెడిసికొట్టంది.

Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !

రెండు నెలల తరువాత ?

రెండు నెలల తరువాత ?

లాక్ డౌన్ అమలు అయిన తరువాత బెంగళూరు సిటీలో సంచరించే బీఎంటీసీ బస్సులు పూర్తిగా నిలిపివేశారు. బెంగళూరులో సిటీ బస్సులతో పాటు క్యాబ్ లు, ఆటోలు, ప్రైవేట్ ట్యాక్సీల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. సిటీ బస్సులు, క్యాబ్ లు, ఆటోలు లేకపోవడంతో ప్రజలు ఇన్ని రోజులు సంచరించడానికి వీలు లేకపోయిందని అందరూ భావించారు. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మంగళవారం నుంచి బెంగళూరులో బీఎంటీసీ సిటీ బస్సులు రెండు నెలల తరువాత రోడ్ల మీదకు వచ్చాయి.

అధికారుల ఓవర్ కాన్ఫిడెన్స్

అధికారుల ఓవర్ కాన్ఫిడెన్స్

రెండు నెలల తరువాత రోడ్ల మీదకు వచ్చే బస్సుల్లో ప్రజలు ఎక్కువగా సంచరిస్తారని అధికారులు అంచనా వేశారు. ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు బెంగళూరులోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు వెలుతారని అధికారులు భావించారు. అయితే అధికారుల ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొదటికే మోసం వచ్చింది.

భారీ లాభాలు రావాలని !

భారీ లాభాలు రావాలని !

రెండు నెలల నుంచి బీఎంటీసీకి ఆధాయం లేకపోవడంతో ఎలాగైనా ఆ రెండు నెలల లాభాలు సంపాధించాలని అధికారులు నిర్ణయించారు. బీఎంటీసీ బస్సుల్లో టిక్కెట్లు రద్దు చేసి డైలీ పాస్ రూ. 70, వీక్లీ పాస్ రూ. 300 లు మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. రూ. 10 టిక్కెట్ కొని సంచరించడానికి వెలుతున్న ప్రయాణికులు రూ. 70 డైలీ పాస్ తీసుకుని ఎందుకు సంచరించాలి ? మాకు ఎందుకు రూ. 60 నష్టం అంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. రూ. 10 టిక్కెట్ కోసం మాకెందుకు రూ. 70 బొక్క అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

బీఎంటీసీకి చెందిన కొందరు అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలనే బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని ఆ సంస్థలో పని చేస్తున్న కొందరు డ్రైవర్లు, కండెక్టర్లు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర దగ్గర స్టేజుల్లో దిగి వెళ్లిపోతున్న వారు రూ. 10, రూ. 15 టిక్కెట్లు తీసుకుంటారని, అలాంటిది టిక్కెట్లు రద్దు చేసి రూ. 70 డైలీ పాస్, రూ. 300 వీక్లీ పాస్ లు పెడితే ఎవరు సంచరిస్తారు ? అని కండెక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

క్యాబ్ లు, ఆటోల పరిస్థితి సరేసరి !

క్యాబ్ లు, ఆటోల పరిస్థితి సరేసరి !

బెంగళూరు నగరంలో బీఎంటీసీ బస్సులతో పాటు ఓల్వో బస్సులు ప్రస్తుతం ఖాళీగా తిరుగుతున్నాయి. దానికి తోడు రెండు నెలల తరువాత రోడ్ల మీదకు వచ్చిన ఆటోలు, క్యాబ్ ల్లో ప్రయాణించే వారు కరువయ్యారు. మొత్తం మీద రెండు నెలల తరువాత భారీ ఆధాయం వస్తుందని ఊహించిన బీఎంటీసీ అధికారుల అంచనాలు తల్లకిందులైనాయి.

English summary
Lockdown: After 2 Months The BMTC bus service has started from May 19 in Bengaluru. But people don't seem to be interested in boarding the buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X