వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown:మాజీ సీఎం కొడుకు, హీరో నిఖిల్ పెళ్లి ఎలా జరిగింది ?, ఎవరికి టోపీ పెడుతున్నారు ?, హైకోర్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కొడుకు, ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు నిఖిల్ కుమారస్వామి, రేవతిల పెళ్లికి మీరు ఎలా అనుమతి ఇచ్చారు ? లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్నామని మీకు అనిపించలేదా ? పెళ్లికి ఎంత మంది హాజరుకావాలో మీరు ఎలా నిర్ణయిస్తారు ? అంటూ కర్ణాటక హై కోర్టు ప్రభుత్వాన్ని, రామనగర జిల్లా కలెక్టర్ ను, వారి న్యాయవాదిని ప్రశ్నించింది. మీరు ఎవరికి టోపీ పెట్టాలని ప్రయత్నింస్తున్నారో అనే విషయం అర్థం కావడంలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ సీఎం కొడుకు, ప్రముఖ హీరో నిఖిల్ వివాహం వివాదానికి దారి తీసింది.

Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !

మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కొడుకు, హీరో

మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కొడుకు, హీరో

మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కొడుకు, ప్రముఖ సినీ హీరో, రాజకీయ నాయకుడు అయిన నిఖిల్ కుమారస్వామి, రేవతిల వివాహం ఏప్రిల్ 17వ తేదీన రామనగర జిల్లాలోని కేతగానిహళ్ళిలోని వారి సొంత ఫాం హౌస్ లో జరిగిన విషయం తెలిసిందే.

జిల్లా కలెక్టర్ అనుమతి

జిల్లా కలెక్టర్ అనుమతి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కొడుకు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి, రేవతిల వివాహం కేతగానళ్ళిలోని ఫాం హౌస్ లో జరుపుకోవడానికి రామనగర జిల్లా కలెక్టర్ (DC) అనుమతి ఇచ్చారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో నిఖిల్, రేవతిల వివాహం చేసుకోవడానికి రామనగర జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది విక్రమ్ అంటున్నారు.

హై కోర్టులో విచారణ

హై కోర్టులో విచారణ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఆయన కొడుకు నిఖిల్ పెళ్లి రామనగర జిల్లాలోని కేతగానహళ్ళి ఫాం హౌస్ లో వైభంగా జరిపించారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. హైకోర్టులో నిఖిల్ పెళ్లి వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ జరిగింది. మాజీ సీఎం కుమారస్వామి కొడుకు పెళ్లి లాక్ డౌన్ లో ఎలా జరిగింది ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

పెళ్లికి 80 నుంచి 95 మంది హాజరు !

పెళ్లికి 80 నుంచి 95 మంది హాజరు !

మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి కొడుకు నిఖిల్ పెళ్లికి వారి కుటుంబ సభ్యులు దాదాపు 80 మంది నుంచి 95 మంది వరకు హాజరుకావడానికి రామనగర జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారని, మాజీ సీఎం కుమారస్వామి అనుమతి ఇచ్చాన వారు మాత్రమే పెళ్లికి హాజరైనారని, పెళ్లి జరిగిన కేతగానహళ్ళిలోని ఫాం హౌస్ దగ్గర డీఎస్పీ దగ్గర ఉండి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు పెట్టుకునేలా, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది విక్రమ్ హైకోర్టుకు చెప్పారు.

అసలు ఏం జరిగింది !

అసలు ఏం జరిగింది !

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్నల నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి నిఖిల్ పెళ్లి ఎలా జరిగింది ?, అసలు అక్కడ పెళ్లి ఎలా జరిగింది ? అని తాము వ్యక్తిగతంగా సమాచారం తెసుకోవాలని భావించడంలేదని అన్నారు. అయితే లాక్ డౌన్ లో పెళ్లి జరిపించడంతో పిటిషన్ దాఖలు అయ్యిందని గుర్తు చేశారు. నిఖిల్ పెళ్లి ఎలా జరిగింది ? అక్కడ ఏం జరిగింది ? అని పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం చెప్పింది.

ఎవరికి టోపీ పెడుతున్నారు !

ఎవరికి టోపీ పెడుతున్నారు !

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్ డౌన్ సమయంలో పెళ్లికి 50 మంది కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదని స్పష్టంగా ఉంది. రామనగర జిల్లా కలెక్టర్ 80 మంది నుంచి 95 మంది వరకు నిఖిల్ పెళ్లికి హాజరుకావడానికి అనుమతి ఇచ్చారని మీరే అంటున్నారు, ఇది లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించడం కాదా ? అని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది విక్రమ్ ను హైకోర్టు ప్రశ్నించింది. అసలు మీరు ఎవరికి టోపీ పెట్టాలని చూస్తున్నారు ? అంటూ కర్ణాటక హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి ?

సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి ?

మాజీ సీఎం కుమారస్వామి కొడుకు పెళ్లికి ఎందుకు 80 నుంచి 95 మందికి మీరు అనుమతి ఇచ్చారు ?, ఇది లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించడం కాదా ? అని హైకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని, రామనగర జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించింది. పెళ్లికి ఎంత మంది హాజరుకావాలి అనే విషయంపై మీరే నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు మీరు చెప్పారా ? అనే సమాధానం ఇవ్వాలని కేంద్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. లాక్ డౌన్ సందర్బంగా సామాన్య ప్రజలు చాలా మంది వారి పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారని హైకోర్టు గుర్తు చేసింది, అయితే మాజీ సీఎం కొడుకు నిఖిల్ పెళ్లి మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయిందని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ కర్ణాటక హైకోర్టు మే 12వ తేదీకి వాయిదా వేసింది.

English summary
Coronavirus Lockdown: The High Court of Karnataka has asked why the Ramanagaram Deputy Commissioner did not impose any restriction on the number of persons allowed at the wedding of Nikhil, son of former Chief Minister H.D. Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X